Naveen Yadav (imagecredit:twitter)
Politics, తెలంగాణ

Naveen Yadav: ఇరకాటంలో నవీన్ యాదవ్?.. ఓటర్ ఐడీ పంపకాలతో ఎఫ్ఐఆర్ నమోదు!

Naveen Yadav: జూబ్లీహిల్స్ అభ్యర్థి విషయంలో రోజుకో ట్విస్ట్ తెరమీదకు వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఆశావహుల రేసులోని నవీన్ యాదవ్‌పై ఎఫ్​ఐఆర్ నమోదు కావడంతో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఓటర్ ఐడీ పంపకాల్లో నవీన్ యాదవ్‌ను మధురానగర్ పోలీసులు ఏ1 గా చేర్చారు. దీంతో ఒక్కసారిగా పార్టీలోనూ కాస్త ఆందోళన మొదలైంది. తాము నిర్వహించిన సర్వేల్లో నవీన్ యాదవ్ లీడ్‌లో ఉన్నట్లు కాంగ్రెస్ ఇప్పటి వరకు ప్రస్తావిస్తూ వచ్చింది. కానీ ఓటర్ ఐడీ పంపకాల వ్యవహారంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నది. అంతేగాక ప్రతిపక్షాలకు కాంగ్రెస్‌ను విమర్శించేందుకు ఓ కీలక అస్త్రం లభించినట్లైంది. దీంతో పార్టీ పెద్దలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఎన్నికల కమిషన్ రూల్స్ బ్రేక్ చేస్తే ఎలా అంటూ పార్టీలోని ముఖ్యులు అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చింది. ఈ నెల 13న గెజిట్ నోటిఫికేషన్ రానుండగా, నవంబరు 11న పొలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో అభ్యర్ధి ఎంపిక ఉత్కంఠగా మారింది. రూల్స్ బ్రేక్ చేసినప్పటికీ సర్వేల్లో లీడ్‌లో ఉన్న వారికే ఇవ్వాలా, లేదా రేసులోని మిగతా నేతల నుంచి సెలక్షన్ చేయాలా అని పార్టీ కసరత్తును మొదలు పెట్టింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక కోసం నవీన్ యాదవ్ పేరుతో పాటు సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, మైనంపల్లి హన్మంతరావు పేర్లను కూడా క్రోడీకరించి ముగ్గురు ఇన్‌ఛార్జ్ మంత్రులు హైకమాండ్‌కు పంపినట్లు తెలిసింది. దీనిపై ఏఐసీసీ లెవల్‌లో స్క్రీనింగ్ జరుగుతున్నది.

Also Read: Physics Nobel: ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ అవార్డ్.. 1985లో ప్రయోగం.. నేడు విప్లవాత్మక మార్పులు

స్థానికం.. బీసీ నినాదం

గత కొన్ని రోజుల నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా స్థానికులే ఉంటారని కాంగ్రెస్ పేర్కొన్నది. తాజాగా బీసీకే ఇవ్వనున్నట్లు పీసీసీ చీఫ్​ కూడా వ్యాఖ్యానించారు. ఈ రెండు సమీకరణాల్లో నవీన్ యాదవ్ సెట్ అయినప్పటికీ, ఎఫ్​ఐఆర్ నమోదైన నేపథ్యంలో పార్టీ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక బీసీ జాబితాలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన పేరు విస్తృతంగా వినిపిస్తున్నప్పటికీ, మంగళవారం సాయంత్రం తాను రేసులో లేన్నట్లు ఆయనే ప్రకటించినట్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది.

ఇక ప్రస్తుతం కార్పొరేటర్‌గా ఉన్న సీఎన్ రెడ్డి పేరు కూడా బాగా వినికిడిలో ఉన్నది. సర్వేల్లోనూ ఆయనకు పాజిటివ్‌గా ఉన్నట్లు పార్టీ నేతలు వివరించారు. ఇక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి పేరు కూడా ఆకస్మికంగా తెర మీదకు వచ్చింది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఈయన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, సుదీర్ఘకాలం సిటీలోనే సత్సంబంధాలు కలిగి ఉండడంతో మైనంపల్లి పేరు కూడా పార్టీ పరిశీలించినట్లు తెలిసింది. రేసులోని నేతలందరిపై సర్వేలు చేయించినప్పటికీ, టికెట్ ఎవరికి కేటాయిస్తుందనేది టెన్షన్‌గా మారింది.

Also Read: Lik movie postponed: రిలీజ్ వాయిదా పడిన ప్రదీప్ రంగనాధన్ సినిమా.. ఎందుకంటే?

కాంగ్రెస్‌ను ఆశీర్వదిస్తారా?

జూబ్లీహిల్స్‌ బీఆర్ఎస్ స్థానం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి గోపినాథ్ గెలుపొందారు. ఆయన మరణం అనంతరం ఏర్పడిన ఉప ఎన్నిక కావడంతో కంటోన్మెంట్ తరహాలోనే విజయం వరిస్తుందని కాంగ్రెస్ ధీమాతో ఉన్నది. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నది. అంతేగాక కులాల వారీగా కమ్యూనికేట్ చేసేందుకు ముగ్గురు ఇన్‌ఛార్జ్ మంత్రులను పార్టీ నియమించింది. డివిజన్ల వారీగా వర్క్ డివైడ్ చేసి ఏకంగా 20 మంది కార్పొరేషన్ చైర్మన్లకు అదనపు బాధ్యతలు అప్పగించింది. డివిజన్ల వారీగా అభివృద్ధి పనులకు భరోసా, శంకుస్థాపనలు ఒక వైపు చేస్తూనే, నియోజకవర్గాన్ని ప్రభావితం చేసే ప్రతీ సెక్టార్‌తో స్వయంగా సీఎం మాట్లాడుతున్నట్లు తెలిసింది.

వ్యాపారవేత్తలు, చిత్ర పరిశ్రమ, బస్తీల్లోని ముఖ్య నాయకులు, ఇలా అందరినీ పార్టీ, ప్రభుత్వం కమ్యూనికేట్ చేస్తున్నది. అత్యధిక ఓటర్లు కలిగిన ముస్లింలకు స్పెషల్ ఫండ్స్‌తో పాటు పెండింగ్‌లోని వర్క్స్ అన్నింటినీ క్లియర్ చేస్తూ వెళ్తున్నది. తాజాగా కబరస్థాన్‌కు స్థలం కూడా కేటాయించింది. అయితే ఆ స్థలం అంశం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ పథకాలు ప్రచారం చేస్తున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో మైలేజ్ రావడం లేదనేది కాంగ్రె‌స్‌కూ అర్థమైంది. దీంతో జూబ్లీహిల్స్ ప్రజలు ఎలాంటి తీర్పును ఇస్తారనేది కూడా అధికారంలోని కాంగ్రెస్‌ను టెన్షన్ పెడుతున్నది. మరోవైపు ముగ్గురు మంత్రుల ఫైట్‌కు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గమే వేదికగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని గెలిపించేందుకు నేతలంతా సమిష్టిగా పనిచేస్తారా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.

ఎంఐఎం మద్దతు ఎవరికి?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎంఐఎం మౌనంగా వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి వచ్చిన తర్వాత ఎంఐఎం హస్తంలో ప్రెండ్లీ రిలేషన్‌ను మెయింటైన్ చేస్తున్నది. ఇప్పుడు అదే స్నేహన్ని కొనసాగిస్తుందా లేదా అనేది కూడా ఉత్కంఠగానే ఉన్నది. గతంలో నవీన్ యాదవ్‌కు టికెట్ ఇస్తే సపోర్ట్ చేస్తామని కొందరు ఎంఐంఎం నేతలు చెప్పినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో మరికొందరు ఎంఐఎంను ఆయన గతంలో వదిలేసి వెళ్లారని, ఇప్పుడు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదనే వాదన కూడా వచ్చింది. ఎంఐఎంలోనూ రెండు టీమ్‌లు వేర్వేరు అభిప్రాయాలను వ్యక్త పరిచినట్లు సమాచారం. దీంతో ఎంఐఎం నేరుగానే పోటీ చేస్తుందా, లేక కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందా అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఎంఐఎం, కాంగ్రెస్ నేతల మధ్య చర్చలు జరిగినట్లు కూడా ఎక్కడా తెర మీదకు రాకపోవడం గమనార్హం. ఓవరల్‌గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పొలిటికల్ పార్టీల ముఖ చిత్రాలను మార్చేలా స్పష్టమవుతున్నది.

Also Read: Rajasthan Crime: రూ.100 కోసం.. వ్యాపారవేత్త దారుణ హత్య.. జిమ్‌లో అందరూ చూస్తుండగానే..

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?