Lik movie postponed: విఘ్నేషన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాధన్ హీరోగా తెరకెక్కుతున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ విడుదల తేదీని ముందుగానే ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా దీపావళికి రాబోతుందని ప్రచారం చేయగా తాజాగా విడుదల వాయిదా పడినట్లు నిర్మాతలు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ విడుదల చేశారు నిర్మాతలు. అందులో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మొదట విడుదల చేద్దామనుకున్న సమయం కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమాను డిసెంబర్ 18 వ తేదీన విడుదల చేస్తున్నామని మూవీ టీం ప్రకటించింది. ప్రదీప్ రంగనాధన్ హీరోగా చేసిన రెండు సినిమాలతో ఒకే రోజు విడుదల తేదీని ప్రకటించడంతో ప్రదీప్ అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది. అయితే దీనికి రెండు సినిమాల టీంమ్ లు చెక్ పెట్టాయి. ఈ దీపావళికి డ్యూడ్ సినిమా యదావిధిగా విడుదల అవుతుందని, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రం వాయిదా పడుతుందని తెలిపారు. ముందుగా రెండు సినిమాలు ఒకే రోజు విడుదల తేదీ ప్రకటించాయి. ఇప్పుడు క్లారిటీ ఇస్తూ నోట్ విడుదల చేశాయి.
Read also-Rangareddy District: పొలిటికల్ హీట్.. ఆ స్థానంలో గెలిస్తే జెడ్పీ ఛైర్పర్సన్ ఖాయం..!
రౌడీ పిక్చర్స్ యాజమాన్యం తమ అధికారిక ప్రకటనలో.. “రెండు ట్రైన్‌లు ఒకే ట్రాక్‌పై వచ్చి కలిసిపోతే ఎవరికీ మంచిది కాదు” అని. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డ్యూడ్’ సినిమా మైత్రి మూవీస్ పతాకంపై డీవాలీ సమయంలో విడుదల కావడంతో, రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ తీవ్రమవుతుందని భావించారు. కాబట్టి, మైత్రి మూవీస్‌తో సమన్వయం చేసి చూశారు, కానీ సాధ్యం కాకపోవడంతో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ని డిసెంబర్ 18కి తప్పించారు. ఈ నిర్ణయాన్ని “ప్రదీప్ రంగనాథన్, డ్యూడ్ టీమ్‌కి గౌరవంగా” చేసిన చర్యగా వర్ణించారు. ఈ మార్పు సినిమా పరిశ్రమలో సానుకూలతను చూపిస్తోంది. ఇది మునుపటి సందర్భాల్లాగా పోటీకి బదులు సహకారాన్ని ప్రోత్సహిస్తుందని ఫ్యాన్స్ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.
Read also-Kerala Lottery: అదృష్ట దేవత అతడి తలుపు తట్టింది.. లాటరీలో కోట్ల రూపాయల గెలుచుకున్నాడు?
తమిళ సినిమా పరిశ్రమలో కొత్త ఆవిష్కరణలతో ఆకట్టుకునే కథలు తీసుకొచ్చే డైరెక్టర్ విగ్నేష్ శివన్ ఇప్పుడు ఒక సై-ఫై రొమాంటిక్ కామెడీతో ప్రేక్షకులను ఆకర్షించబోతున్నాడు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) అనే ఈ సినిమా 2040 సంవత్సరంలో జరిగే కథను చిత్రిస్తుంది. ప్రేమ’ ఎవల్యూషన్‌షిప్’ వంటి థీమ్‌లతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆసక్తికరంగా ఉంచుతుంది. సినిమా కథ 2040లో జరుగుతుంది. ఇక్కడ ఒంటరి పురుషులకు రోబోట్‌లతో డేటింగ్ అవకాశం ఇచ్చే మ్యాట్రిమోనియల్ సైట్ ఒకటి ఉంటుంది. ఈ రోబోట్‌లు కస్టమర్లతో ప్రేమలో పడకుండా కాంట్రాక్ట్ ప్రకారం బంధిస్తాయి. కానీ, ఒక రోబోట్ తన క్లయింట్‌తో నిజమైన ప్రేమలో పడుతుంది. ఈ కథ భవిష్యత్ ప్రపంచంలో ప్రేమను ఎలా వెతుకుతారో, టెక్నాలజీ మానవ భావాల మధ్య సంఘర్షణలు ఎలా ఉంటాయో చూపిస్తుంది. ఫస్ట్ పంచ్ టీజర్‌లో ప్రదీప్ రంగనాథన్ ఒక వింత ప్రపంచంలో ప్రేమను వెతికే దృశ్యాలు ఆకట్టుకున్నాయి.
— Seven Screen Studio (@7screenstudio) October 6, 2025
