Rangareddy District (imagecredit:twitter)
రంగారెడ్డి

Rangareddy District: పొలిటికల్ హీట్.. ఆ స్థానంలో గెలిస్తే జెడ్పీ ఛైర్పర్సన్ ఖాయం..!

Rangareddy District: స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ హడావుడి మొదలైంది. నిన్న, మొన్నటి వరకు నువ్వా నేనా అనుకున్న వాళ్ళు కూడా ఒక్కటి చేసే పరిస్థితి కనిపిస్తుంది. పార్టీలకు అతీతంగా అంతర్గత ఒప్పందాలు చేసుకునేలా నాయకులు వ్యవహారిస్తునట్లు తెలుస్తుంది. పార్టీలు జడ్పీ పిఠాలను దృష్టిలో పెట్టుకొని అవగాహన కుదుర్చుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్(Congress) పార్టీ మాత్రం కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) పార్టీలు ఒంటరిగా పోతాయా ఒప్పందంతో పోటీ చేస్తాయా అనే అనుమానాలున్నాయి. రంగారెడ్డి(Rangareddy) జిల్లా పరిషత్త్ చైర్మన్ ఎస్సీ మహిళా, వికారాబాద్ జిల్లా బీసీ మహిళాకు ప్రభుత్వం రిజర్వేషన్ చేశారు.

రంగారెడ్డి జడ్పీకి చేవెళ్ల కీలకం..

రంగారెడ్డి జిల్లాలో 21జడ్పీటీసీలో ఎస్టీలకు 3, ఎస్సీలకు 4, బీసీలకు 9, జనరల్లకు 5స్థానాల చొప్పున రిజర్వేషన్ చేశారు. ఇందులో 9స్థానాలు మహిళా కు 12 స్థానాలు జనరల్ అభ్యర్థులకు వివిధ కేటగిరిలకు కేటాయించారు. కానీ ఎస్సీలకు కేటాయించిన నాలుగు స్థానాల్లో రెండు స్థానాల్లో కచ్చితంగా మహిళా పోటీ చేయాల్సిందే… మిగిలిన రెండు స్థానాల్లో ఎస్సీ మహిళా, పురుషులు చేసుకునే అవకాశం ఉంది. అయితే రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ అవకాశం ఎస్సీ మహిళా రిజర్వేషన్ కావడంతో ఈ నలుగు స్థానాల్లో పోటీ చేసే వారికే మెండుగా ఉన్నాయి. ఆ రిజర్వేషన్లు కూడా ఎస్సీ నియోజకవర్గమైన చేవెళ్ల కే దక్కనుండడం గమనర్హం. శంకర్పల్లి, చేవెళ్ల ఎస్సీ జనరల్, కందుకూరు, షాబాద్ ఎస్సీ మహిళాలకు జడ్పీటీసీ స్థానాలు రిజర్వేషన్ అయ్యాయి. ఇందులో కందుకూరు మినహా మిగిలిన మూడు మండలాలు చేవెళ్ల నియోజకవర్గం.

Also Read: India VS US Rates: భారత్‌లో ఆహార పదార్థాల రేట్లను యూఎస్‌తో పోల్చిన అమెరికన్.. వీడియో వైరల్

వికారాబాద్ జడ్పీకి పోటీ అధికం..

వికారాబాద్ జిల్లాలో 20మండలాలు ఉన్నాయి. ప్రతి మండలం ఒక జడ్పీటీసీ స్థానంకాగా ఎస్టీ కి 2, ఎస్సీకి 4, బీసీకి 8, జనరల్ 6 చొప్పున రిజర్వేషన్ చేయడం జరిగింది. ఇందులో 10 మహిళాలకు 10 పురుషులు, మహిళలకు పోటీ చేసే అవకాశం రిజర్వేషన్ ఆధారంగా ప్రభుత్వం కల్పించింది. అయితే 6స్థానాల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ లకు జడ్పీ చైర్మన్ గా అయ్యే అవకాశం లేదు. కానీ మిగిలిన 14స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు జడ్పీ చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ బీసీ మహిళా కావడంతోనే పార్టీలు అంచనా వేసుకుంటున్నారు.

వికారాబాద్ మాదేనంటూ బీజేపీ ప్రచారం..

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వశ్వర్ రెడ్డి వికారాబాద్ జిల్లా పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. స్థానిక బీజేపీ నాయకులు వికారాబాద్ జడ్పీ పీఠం తమాదేనని ప్రతి రోజు ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ మాత్రం మౌన ప్రదర్శన చేస్తుంది. ఇప్పటికే వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యి స్థానిక ఎన్నికలపై చర్చించారు. కానీ ఏమీ నిర్ణయం తీసుకున్నారో తెలియక కార్యకర్తలు తికమాక పడుతున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తాయా అనే అనుమానాలు బలంగా ఉన్నాయి. ఎందుకంటె బీజేపీ చేసే ప్రచారంతో ప్రజలు చర్చించుకుంటున్నారు.

బీఆర్ఎస్ పెంచిన స్పీడ్..

రంగారెడ్డి జిల్లాలో బీజేపీ మౌనంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం అంతర్గతంగా జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక పై నిఘా పెట్టింది. చేవెళ్లలోని మూడు మండలాల్లో బీఆర్ఎస్ బలమైన అభ్యర్థులను దించేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కృషి చేస్తుంది. రంగారెడ్డి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేసుకున్నట్లు సమాచారం.

Also Read: BRS: అశ్వారావుపేటలో పెరుగుతున్న అంతర్గత పోరు.. బీఆర్‌ఎస్‌లో గందరగోళం

Just In

01

Harish Rao: మీకు అధికారం ఇచ్చింది ఎందుకు.. ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్!

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ మరొక్క రోజు వెనక్కి!.. ఎందుకంటే?

Gold Price Today: తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనాలనుకునేవారికీ ఇదే మంచి ఛాన్స్!

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..