BRS: అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ రాష్ట్ర నాయకుడు తాటి వెంకటేశ్వర్లు( Thati Venkateswarlu) మాట్లాడుతూ, నియోజకవర్గంలో గత దశాబ్దం కాలంగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్త విస్మరిస్తూ జరిగిన తీరును ఆయన తీవ్రంగా ఖండించాలకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. పార్టీ విస్తృత సమావేశానికి ఓ వర్గానికి మాత్రమే సమాచారం ఇస్తూ, ఆది నుండి పార్టీ కోసం కష్టపడిన నాయకులనురు. జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరావు వ్యక్తిగత స్వార్థంతో తోటలో రాజకీయాలు మొదలు పెట్టారని తాటి అన్నారు. జిల్లా వ్యాప్తంగా తనకు ఉన్న ప్రజా ఆదరణను చూసి తట్టుకోలేక అవమాన పరుస్తున్నారని వ్యాఖ్యానించారు.నియోజకవర్గ సమస్యలపై కనీస అవగాహన లేని మెచ్చా నాగేశ్వరావును పార్టీ ఇన్‌చార్జ్‌గా ఎవరు నియమించారో ప్రశ్నించారు.
Also Read: Ari Trailer: అరిషడ్వర్గాలపై డిఫరెంట్ సైకో మైథలాజికల్ థ్రిల్లర్.. ట్రైలర్ ఎలా ఉందంటే?
వ్యక్తులపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం
మెచ్చా తీరుతో కార్యకర్తలు, నాయకులు పార్టీకి దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో ఆధిపత్యం ప్రదర్శిస్తూ నిజమైన కార్యకర్తలను అవమానపరుస్తూ ప్రవర్తించిన తీరు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. నాయకత్వానికి సంబంధం లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వ్యక్తులపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సమిష్టి నాయకత్వంతో ఎన్నికలకు వెళ్లకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. భవిష్యత్తులో తీరు మార్చుకోకపోతే నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో నాయకులు, కార్యకర్తలు స్వయంగా ఎన్నికల బరిలో ఉంటారని హెచ్చరించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి
పార్టీ అధినాయకులు కేటీఆర్, హరీష్ రావు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కొంతమంది స్వార్థం కోసం పార్టీని నష్టపరుస్తున్నారని అన్నారు. కార్యకర్తలు ఎవరు అధైర్య పడకూడదని, తాటి వెంకటేశ్వర్లు తమకు అండగా ఉన్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. నిన్న జరిగిన విషయాన్ని అధిష్టానానికి తెలియజేస్తానని చెప్పారు. ఎవరు ఎన్ని చేసినా బిఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటాం. నియోజకవర్గంలోని బిఆర్ఎస్ కార్యకర్తల అభిప్రాయం మేరకు బరిలో ఉంటాం,” అని తాటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జడ్పిటిసి అంకిత మల్లికార్జున రావు, మాజీ సర్పంచులు పొట్ట రాజులు, కారం ఎర్రయ్య, బైటి రాజేష్, రామారావు, ముస్తఫా డాక్టర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Also Read: Ramchandra Rao: కమలం నేతల అసంతృప్తి.. గ్రౌండ్ లెవెల్ లో పార్టీ పరిస్థితి అధ్వానం అంటున్న నేతలు
