Satyavathi Rathod: కేసీఆర్ రాష్ట్రానికి మళ్ళీ సీఎం కావాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavati Rathod) ఆకాంక్షించారు. తెలంగాణ భవన్ లో ఎంగిలిపువ్వూ బతుకమ్మను పురస్కరించుకొని బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఒక్కొక్క పువ్వేసి చందమామ అని పాటలు పాడారు. ఆరుగ్యారెంటీలను కాంగ్రెస్ విస్మరించిందని పాటలు పాడారు. మహిళలతో తెలంగాణ భవన్ సందడి నెలకొంది. బతుకమ్మ పాటలతో భవన్ ప్రాంగణం హోరెత్తింది. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ మార్పు అంటే జీవితాల్లో మార్పు అనుకున్నామని కానీ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయం అయిందన్నారు. ఆడపడుచుల మనోభావాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియడం లేదన్నారు.
Also Read: BJP Telangana: బీజేపీలో రగులుతున్న అంతర్గత కుమ్ములాట.. మళ్లీ మొదలైన పాత కొత్త నేతల లొల్లి
యూరియా కోసం మహిళలు సైతం రోడ్డెక్కుతున్నారు
చీరలు, కానుకలు మాయం అయ్యాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు విస్మరించారన్నారు. యూరియా కోసం మహిళలు సైతం రోడ్డెక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంటిపిల్లలతో సైతం యూరియా కోసం క్యూలో ఉంటున్నారని అన్నారు. ప్రభుత్వంపై పోరాటంతో ముందుకు పోతామన్నారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రశ్నించే బతుకమ్మగా.. గొంతు విప్పే బతుకమ్మగా జరుపుకుంటున్నామన్నారు. ప్రత్యేక రాష్ట్ర సమయంలో ఉద్యమరూపంలో బతుకమ్మ వచ్చిందని తెలిపారు.
అన్ని పథకాలు మాయం
దాదాపు 60 దేశాలకుపైగా బతుకమ్మను నిర్వహించుకున్నామన్నారు. మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ ఇలా అన్ని పథకాలు మాయం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహాలక్ష్మి గ్యారెంటీల్లోని 2500, తులంబంగారం ఊసేలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: Kavitha Vs BRS: కవితతో టచ్‌లో ఉన్నది ఎవరు?.. బీఆర్ఎస్ అధిష్టానం ఆరా?
తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం.. సామ రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తామని మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కొందరు సెఫలజిస్టులుగా చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేయడం పార్టీ గమనిస్తుందన్నారు. ముఖ్యంగా తనతో కాంగ్రెస్ పార్టీ నిత్యం సర్వే లు చేపిస్తుందని సైదులు అనే ఒక వ్యక్తి మీడియాలో ప్రాచారం చేస్తున్నారని, పార్టీ కి ఆయనకు సంబంధం లేదన్నారు. సర్వేల కోసం ఏఐసీసీ, పీసీసీ నుంచి ఎలాంటి ఆదేశాలు లేవన్నారు.
కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నం
సైదులకు పార్టీకి సంబంధం లేదని, ఆయనకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా లేదన్నారు. గతంలో సర్వేలు చేస్తున్నానంటూ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడన్నారు. గతంలో దిగిన ఫోటోలను వాడుకుంటూ లీడర్లను మోసం చేసేందుకు రెడీ అయ్యాడన్నారు. పార్టీని డ్యామేజ్ చేసేందుకు అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. బీఆర్ ఎస్ నేతల నుంచి డబ్బులు తీసుకొని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడన్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇప్పటి వరకు ఆయనతో జూబ్లీహిల్స్, ఇతర నియోజకవర్గాల్లో ఎక్కడా పార్టీ సర్వే చేయించలేదన్నారు. పెయిడ్ ఆర్డిస్ట్ సైదుల పట్ల పార్టీ నేతలంతా జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో మోసపోవద్దంటూ సూచించారు.
Also Read: Panchayat Elections: స్థానికంపై సర్కార్ ‘వ్యూహాత్మకం’.. జిల్లా కలెక్టర్లకు కీలక సూచన