Balmuri venkat on BJP: గ్రేటర్ హైదరాబాద్ లోని కోటిన్నర మంది జనాభాకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ పాలక మండలిలో ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజాసమస్యలపై గళం విప్పారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశానికి కాంగ్రేస్ ఎక్స్ అఫిషియో సభ్యులు విజయశాంతి, బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ రావులతో పాటు బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్ లతో పాటు మజ్లీస్ పార్టీకి చెందిన మిర్జా, అఫండీ లు కూడా పాల్గొని ప్రజాసమస్యలపై తమ గళం విన్పించారు.
వీరిలో అగ్నిప్రమాదాలపై రఘునందన్ రావు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లో మౌలిక వసతులు, రైల్వే క్రాసింగ్ ల వద్ద జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఈటల రాజేందర్ మాట్లాడగా, స్పోర్ట్స్ కాంప్లెక్స్, నాలాలు, వీధి ధీపాలపై మజ్లీస్ ఎమ్మెల్సీ మీర్జా మాట్లాడారు. ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో ఎపుడూ చిరుద్యోగులనే బలి చేస్తున్నారే తప్పా, అధికారులపై చర్యలు తీసుకోవటం లేదని బీజేపీ సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేయగా, గత సర్కారు హాయంలో అన్ని పోస్టులు ఔట్ సోర్స్, కాంట్రాక్టు ప్రాతిపదికనే భర్తీ చేశారని, ఇపుడు తాను నేరుగా సర్కారు ఉద్యోగాలను కల్పించేందుకు సర్కారు చేస్తున్న ప్రయత్నాలపై బల్మూరి వెంకట్ లు కౌన్సిల్ లో బీజేపీ కార్పొరేటర్ల వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.
Also Read: MLC Kavitha: రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు.. ఏం తప్పు చేశారని ఇచ్చారు?
ఉదయం పదిన్నర గంటల తర్వాత ప్రారంభం కాగానే, తొలుత పెహల్గావ్ లో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి, గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదం మృతుల ఆత్మలకు శాంతి చేకూర్చాలని, ఇందుకు రెండు నిమిషాల పాటు మౌనం వహించాలని మేయర్ ఆదేశించారు. మౌనం వహించినానంతరం బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ జోక్యం చేసుకుని పెహల్గావ్ ఘటన కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే జరిగిందని వ్యాఖ్యానించటంతో బీజేపీ కార్పొరేటర్లు నర్సింహారెడ్డి, మధుసూదన్ రెడ్డి లు అభ్యంతరం తెలిపారు.
దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన మహ్మద్ సర్దార్ ఫోటోలను చూపుతూ ఈ ఆత్మహత్య ఘటనపై చర్చించాలని డిమాండ్ చేశారు. కాంగ్రేస్ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దిన్ వేధింపులు తాళ లేక ఇటీవలే ఆత్మహత్య చేసుకుని మరణించిన మహ్మద్ సర్దార్ ఫొటోలతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసనలు తెలిపారు.
Also Read: Anganwadi Jobs: త్వరలోనే అంగన్వాడీల్లో.. 14వేల ఖాళీలు భర్తీ!
దీంతో మేయర్ విజయలక్ష్మి జోక్యం చేసుకుని కార్పొరేటర్లకు సర్ది చెప్పినా,వారు విన్పించుకోకపోవటంతో, సీనియర్ ఎక్స్ అఫిషియో సభ్యులు, పేరుగాంచిన న్యాయవాది బీజేపీ ఎంపీ, ఎక్స్ అఫిషయో సభ్యుడు బోరబండ లో మహ్మద్ సర్దార్ ఆత్మహత్య ఘటనపై మాట్లాడుతారని ఆయన మాట్లాడే అవకాశమిచ్చారు. దీంతో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ బోరబండలో జరిగిన ఘటనపై ఇప్పటికే కాంగ్రేస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దిన్ పై ఎఫ్ఐఆర్ నమోదైందని, ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన ఇపుడు ఉరి తీస్తారా? అంటూ వ్యానించారు, పోలీసుల విచారణ జరుగుతుందని, వాస్తవాలు బయటకొచ్చిన తర్వాత బాధ్యులెవరైనా శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు.
వరుస అగ్నిప్రమాదాలపై విచారణ జరిపించాలి
గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద మృతులకు శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత ఎమ్మెల్యే జుల్ఫీకర్ అలీ అగ్ని ప్రమాదాలపై మాట్లాడుతూ మొఘల్ పురాలో జీహెచ్ఎంసీ కొద్ది సంవత్సరాల క్రితం నిర్మించిన భవనంలో ఇప్పటి వరకు వరుసగా అగ్ని ప్రమాదాలు జరిగాయని ఒక్కసారి కూడా జోనల్ కమిషనర్ ఘటన స్థలాన్ని పరిశీలించలేదని వ్యాఖ్యానించగా, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు జోక్యం చేసుకుని అసలు ఇటీవలే జీహెచ్ఎంసీ కోట్లాది రూపాయలు వచ్చించి నిర్మించిన కొత్త భవనంలో వరుసగా అగ్ని ప్రమాదాలెందుకు జరుగుతున్నాయి? అందుకు కారణం ఎవరు? ఆ అవసరం ఎవరికి ఉందని, అందులో టౌన్ ప్లానింగ్ ఫైళ్ల మాత్రమే ఎందుకు కాలి పోతున్నాయన్న విషయంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేయగా, సమాధానం చెప్పాలని మేయర్ కమిషనర్ ఆర్. వి. కర్ణన్ ను ఆదేశించారు. కర్ణన్ సమాధానం చెబుతూ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. టౌన్ ప్లానింగ్ కు చెందిన ఫైళ్లు కాలిపోయాయని ఎంపీ రఘునందన్ ప్రస్తావించగా, చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాసరావు సమాధానం చెబుతూ 2016 తర్వాతి ఫైళ్లన్నీ కూడా హార్డ్ డిస్క్ లో సేఫ్ గా ఉన్నాయని సమాధానం చెప్పారు.
Also Raed: Harish Rao on Congress: ఇదేనా ప్రజాపాలన?.. హరీష్ రావు సంచలన కామెంట్స్!