Harish Rao on Congress: వృద్ద రైతుపై పోలీసు చేయి చేసుకోవడంపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య చెప్పుకునేందుకు తహశీల్దార్ కార్యాలయంకు వెళ్లిన వృద్ధ రైతు పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? ఇదేనా మీరు చెబుతున్న ప్రజా పాలన రేవంత్ రెడ్డి? అని నిలదీశారు. సీఎం ఆదేశాలతో ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం పోలీసులకు అవసరమా? ప్రశ్నించారు.
నాడు లగచర్ల లంబాడి రైతన్నల చేతులకు బేడీలు వేశారు? నేడు ఖానాపూర్ లో వృద్ద రైతు మెడలు పట్టి గెంటేశారు? ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదన్న సంగతి మరిచిపోయి ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతు పై చేయి వేసిన పోలీసు పై వెంటనే తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బేషరతుగా యావత్ తెలంగాణ రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: Crime News: కామాంధుడైన ప్రియుడికి.. కూతురును బలిచ్చిన కన్నతల్లి!
రోగి మృతికి ఎవరు బాధ్యులు?
ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఒకేసారి 70 మంది ఫుడ్ పాయిజన్ కు గురి కావడం, అందులో ఒకరు మృతి చెందటం అత్యంత బాధాకరం అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. విద్యార్థులు చదువుకునే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, వైద్యం కోసం వచ్చే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫుడ్ పాయిజన్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఫుడ్ పాయిజన్లు జరగటం, ప్రాణాలు కోల్పోవడం అత్యంత సాధారణం అయ్యిందన్నారు. మానసిక వైద్యం పొందేందుకు ఆసుపత్రి వచ్చిన పేషంట్లకు కూడా నాణ్యమైన భోజనం పెట్టలేని దిక్కుమాలిన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తునట్లు? ఆరోగ్య శాఖ ఏం చేస్తున్నట్లు? అని ప్రశ్నించారు.
ప్రాణం కోల్పోయిన ఆ మానసిక రోగి మృతికి ఎవరు బాధ్యులు? ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రాణ నష్టం అన్నారు. అస్వస్థతకు గురయ్యారని తెలిసిన తర్వాత కూడా, బాధితులకు నాణ్యమైన వైద్యం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపడం అమానుషం అన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో క్లిష పరిస్థితిలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులతో పాటు, మిగతా 67 మందికి నాణ్యమైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read: Mahesh Kumar Goud: ఐయామ్ రెడీ హరీష్.. పీసీసీ చీఫ్ సంచలన కామెంట్స్!