Crime News: ఇది ముమ్మాటికీ సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునే ఘోరం.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తల్లే కన్న కూతురును కాటేసింది. కామంతో కళ్ళుమూసుకుపోయి తాను తప్పు చేయడమే ఘోరం అన్న సంగతి మరిచి ప్రియుడి కోసం తన కన్న కూతురు జీవితాన్ని బుగ్గిపాలు చేసింది ఓ దుర్మార్గురాలు. తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడు ఆమే కన్న కూతురుపై కన్నేశాడు. మైనార్టీ తీరని ఆ బాలిక(15)ను తన కోరిక తీర్చాలని ఒత్తిడి తెచ్చాడు. అందుకు బాలిక నిరాకరించింది. అయిన తగ్గని దుర్మార్గుడు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
బాలిక కాళ్ళు మంచానికి కట్టేసి చేతులు కదలకుండా తల్లి పట్టుకుని నిస్సహాయురాను చేసి అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తితో టేకుమట్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళతో 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ క్రమంలో గత 5 సంవత్సరాల క్రితం భర్త రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందాడు. భర్త చనిపోయాక తన పెద్ద కూతురును తన తల్లి గారి ఇంటి వద్ద ఉంచి చిన్న కూతురుతో మొగుళ్ళపల్లి మండలంలోని తన అత్తగారి గ్రామంలో కూలిపని చేసుకుని జీవనాన్ని కొనసాగీస్తోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తితో వివాహితకు అక్రమ సంబంధం పెట్టుకుంది. మహిళ తో వివాహేతర సంబంధం కొనసాగుస్తున్న కుమార్ ఆమే చిన్న కుమార్తె(15) పై కన్నేశాడు.
Also Read: Madhu Yashki Goud: జైలుకు వెళ్లనున్న కేసీఆర్, హరీష్.. మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు
ప్రియుడి కోరిక తీర్చేందుకు కూతురు జీవితం నాశనం చేసిన తల్లి
ప్రియుడి కోరికను ఎలాగైనా తీర్చాలని, కన్న కూతురిని ప్రియుడి దగ్గరకు పంపింది. అందుకు బాలిక(15) నిరాకరించడంతో బాలిక కాళ్ళను తాళ్లతో మంచానికి కట్టివేసి బాలిక వెంట్రుకలను బలవంతంగా తన తల్లి గట్టిగా వెనక్కి లాగి పట్టుకుని నిస్సహాయ స్థితిలో పడేసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు. అత్యాచారానికి పాల్పడ్డ సమయంలో నిందితుడు బాలికను విచక్షణారహితంగా నోటితో కొరికి గోళ్ళతో రక్కీ గాయపరిచినట్లు స్థానికులు తెలిపారు.
నిలదీసిన గ్రామస్థులపై కత్తులతో దాడికి యత్నం
అతికిరాతకంగా అత్యాచారం చేసి బాలికకు నరకయాతనను చూపంచి బాలికను ఇంట్లోనే వదిలేసి నిందితులు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. విషయం వారం రోజుల తరువాత బయట పడిందని గ్రామస్థులు పేర్కొన్నారు. అత్యాచారం ఘటన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన వారు సోమవారం రాత్రి తిరిగి ఇంటికి వచ్చారని, ఈ విషయం తెలిసియన్ గ్రామస్తులంతా వారిని జరిగిన అఘాయిత్యంపై నిలదీయగా మాపై కత్తులతో దాడి చేసేందుకు వారు యత్నించారని గ్రామస్తులు తెలిపారు. జరిగిన అగాయిత్యంకు సంబంధించిన సమాచారం మొత్తం పోలీసులకు సమాచారం ఇచ్చామని దీంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారని గ్రామస్థులు తెలిపారు.
Also Read: SP On Farmers: రైతులకు నష్టం కలిగించే వారిని ఉపేక్షించం.. ఎస్పీ వార్నింగ్!
పోలీసుల అదుపులో నిందితులు…? … ఆస్పత్రిలో బాధితురాలు…?
గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో జరిగిన ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అత్యాచారానికి గురైన బాలిక పరిస్థితి విషమంగానే ఉందని పోలీసుల సంరక్షణలో చికిత్స అందిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కన్న తల్లే కన్న కూతురి జీవితాన్ని కామాంధుడికి బలిచ్చేందుకు సిద్ధమైన మూర్ఖపు చర్య ప్రతి ఒక్కరిని కలచివేస్తుంది. పోలీస్ ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం
బాధితురాలు సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై దాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. బాధిత బాలిక చికిత్స పొందుతుంది. బాలిక కోలుకున్న తరువాత ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కేసు విచారణ కొనసాగుతుంది.
Also Read: Suravaram Pratap Reddy University: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం.. నోటిఫికేషన్ రిలీజ్!