Jagdeep Dhankhar Resign
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా.. సడన్‌గా ఎందుకు?

Jagdeep Dhankhar: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం రాత్రి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రాజీనామాతో దేశం మొత్తం ఒక్కసారిగా షాకయ్యింది. ఎందుకు రాజీనామా చేశారు? ఇంత సడన్‌గా ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు? రాజీనామా చేశారా.. లేదా బలవంతంగా చేయించారా? ఇలా చిత్రవిచిత్రాలుగా మీడియా, సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలైంది. అయితే తన రాజీనామా లేఖలోనే ఎందుకు ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాలను క్లియర్ కట్‌గా ధన్‌ఖర్ వివరించారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న వైద్యుల సూచన మేరకు ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లుగా లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనివ్వడం, వైద్య సలహాను పాటించడం రాజీనామాకు ప్రధాన కారణాలుగా లేఖలో వివరించారు. దీంతో రాజీనామాపై చిత్రవిచిత్రాలుగా నడుస్తున్న చర్చలు, పుకార్లకు చెక్ పడినట్లు అయ్యింది. వాస్తవానికి జగదీప్‌కు వయసు రీత్యా ఆరోగ్యం సహకరించడం లేదు. ఇప్పటికే చాలాసార్లు ఆస్పత్రిపాలయ్యార్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్యనే ఆరోగ్య సమస్యలు తీవ్రం కావడంతో ఐసీయూలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.

Read Also- Anil Murder Case: అనిల్ హత్యకు అదే కారణం.. సంచలన విషయాలు వెలుగులోకి!

రాజీనామా లేఖలో ఏముంది?
ఉపరాష్ట్రపతి తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు రాశారు. ‘ నా ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, వైద్య సలహాను అనుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఏ) ప్రకారం, నేను తక్షణమే భారత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నాను. నా పదవీకాలంలో నాకు లభించిన అచంచలమైన మద్దతు.. నేను కొనసాగించిన సామరస్యపూర్వక సంబంధాల విషయంలో భారత రాష్ట్రపతికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రిమండలికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రధాని సహకారం, మద్దతు అమూల్యమైనవి. నా పదవీకాలంలో నేను చాలా నేర్చుకున్నాను. పార్లమెంటులోని గౌరవ సభ్యులందరి నుంచి నేను పొందిన ఆప్యాయత, విశ్వాసం, అభిమానం నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ పదిలపరచబడతాయి. మన ప్రజాస్వామ్యంలో ఉపరాష్ట్రపతిగా నేను పొందిన అమూల్యమైన అనుభవాలు, అంతర్దృష్టులకు నేను చాలా కృతజ్ఞుడను. నా ఈ పదవీ కాలంలో భారతదేశం సాధించిన అద్భుతమైన ఆర్థిక పురోగతిని, అపూర్వమైన విపరీతమైన అభివృద్ధిని చూసి, అందులో పాలుపంచుకోవడం ఒక విశేషం సంతృప్తి. భారతదేశ చరిత్రలో ఈ పరివర్తన యుగంలో సేవ చేయడం ఒక నిజమైన గౌరవం. ఈ గౌరవనీయమైన పదవిని వీడుతున్నప్పుడు, భారత్ ప్రపంచ స్థాయి పెరుగుదల, అద్భుతమైన విజయాలను చూసి నేను గర్వపడుతున్నాను’ అని రాజీనామా లేఖలో జగదీప్ ధన్‌ఖర్ వివరించారు.

Read Also- HHVM: తెలంగాణలోనూ ‘వీరమల్లు’కు బంపరాఫర్.. ఇక రికార్డులు బద్దలే!

వన్ అండ్ ఓన్లీ..!
భారత రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి పదవీకాలం ఐదు సంవత్సరాలు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 ప్రకారం ఉపరాష్ట్రపతి తన పదవిని చేపట్టిన తేదీ నుంచి ఐదేళ్ల వరకూ పదవిలో ఉంటారు. అయితే,
భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకూ ఉపరాష్ట్రపతి రాజీనామా చేయలేదు. పదవిలో ఉంటూ.. అందులోనూ ఇంకా పదవీకాలం ఉండగానే రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి జగదీప్ ధన్‌ఖర్ మాత్రమే. ఉప రాష్ట్రపతులు సాధారణంగా తమ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తారు ఆ తర్వాత రాష్ట్రపతిగా పదోన్నతి పొందుతారు. అయితే ఇలా రాజీనామా చేయడం అనేది ఇది అరుదైన సంఘటన. ఒకవేళ ఉపరాష్ట్రపతిని తొలగించాల్సి వస్తే రాజ్యసభలోని అప్పటి సభ్యులందరి మెజారిటీతో ఆమోదించి, లోక్‌సభ అంగీకరించిన తీర్మానం ద్వారా పదవి నుండి తొలగించవచ్చు. అయితే, అటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశాన్ని కనీసం పద్నాలుగు రోజుల ముందు తెలియజేయకుండా ఎటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టరాదు. అప్పుడిక ఉపరాష్ట్రపతి అధికారికంగా లేదా, తన చేతితో రాష్ట్రపతికి లేఖ ద్వారా తన పదవికి రాజీనామా చేయవచ్చు.

రాజీనామా లేఖ ఇదే..

Vice President

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!