Anil Murder Case: మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు మరెల్లి అనిల్ హత్య భూ వివాదమే అని పోలీసులు తేల్చారు. ఈ కేసు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు(SP Srinivas Rao), అదనపు ఎస్పీ మహేందర్ తూప్రాన్ డీఎస్పీ నరందర్(DSP Narander) తో కలసి మీడియాకు వెల్లడించారు. ఈ నెల 14 న సోమవారం హైదరాబాద్(Hyderabad) గాంధీభవన్ నుంచి సొంతూరికి తన కారులో అనిల్(Anil) వస్తుండగా వరిగుంతం సబ్స్టేషన్ సమీపంలో రెండు కారులలో వెంబడించి అనిల్ ను కాల్చిచంపినట్లు ఎస్పీ తెలిపారు.అనిల్ హత్యకు పై తెర గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి పక్కా స్కెచ్ వేయగా ఆయన వద్ద పనిచేస్తున్న రంగంపేట కు చెందిన పడేపు నాగరాజు,ఆయన సోదరుడు పడేపు నాగభూషణం,షాబొద్ధిన్,ఫరీద్,చిన్నా,తలారి అశోక్ లు కలసి పథకం ప్రకారం అనిల్ ను హత్యచేసినట్లు ఎస్పీ వెల్లడించారు. మొత్తం ఈ కేసులో 7 గురు నిందితులు కాగా ఐదుగురిని సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీ లో ఉన్నట్లు వెల్లడించారు. నిందితులను పట్టుకొవ డానికి ఇద్దరు డీఎస్పీలు ప్రశ్నకుమార్, నరందర్‌ల ఆధ్వర్యంలో సిఐ లు, ఎస్ఐ లతో 7 బృందాలను ఏర్పాటు చేసి కేసును చేధించినట్లు ఎస్పీ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.
రవీందర్ రెడ్డి భూమిని అమ్మనివ్వకుండా
ఈ కేసులో నిందితులను అదుపులోకి విచారించగా వీందర్ రెడ్డి, నాగరాజు, నాగభూషణం, మధ్య గొడవలు ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు. రవీందర్ రెడ్డి, అనీల్ మధ్య పెట్రోల్ పంపు, భూమికి సంబంధించి, పై తెర గ్రామంలో రవీందర్ రెడ్డికి సంబంధించిన 12 ఎకరాలకు భూమినీ అనిల్ కౌలుకు తీసుకొని పంటలు పండిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు డబ్బుల విషయంలో గొడవలు, మొదలయ్యాయని, అనిల్, ఆ భూమి లోకి ఎవరిని రానీయకుండా అడ్డుకోవడం, ఆ భూమి బీడు ఉండటం, రంగంపేటలో ఉన్న మరో 3 ఎకరాల రవీందర్ రెడ్డి భూమిని అమ్మనివ్వకుండా అనిల్ అడ్డుపడ్డాడని ఎస్పీ శ్రీనివాస్(SP Srinivass) రావు తెలిపారు. నాగరాజు అనే వ్యక్తి సర్పంచ్ గా పోటీ చేస్తా అంటే అనిల్ బెదిరించాడన్నారు. ఎ1 సోమన్నగిరి రవీందర్ రెడ్డి, ఎ2 పడేపు నాగరాజు, ఎ3 పడేపు నాగభూషణం, ఎ4 షబుద్దీన్, ఎ5 ఫరీద్, ఎ6 చిన్న, ఎ7 తలారి అశోక్‌లు నిందితులు అని చెప్పారు. ఎ1, ఎ2, ఎ3 లతో అనిల్‌కి గత కొంతకాలంగా గొడవలు ఉన్నాయని తెలిపారు. ముగ్గురు కలిసి అనిల్‌ని చంపేయాలని అనుకున్నారని, కత్తులతో హత్య చేస్తే అనిల్ తిరిగి దాడి చేసే అవకాశం ఉందని గన్ తో కాల్చి చంపాలని అనుకున్నారని పేర్కొన్నారు. బీహార్‌లో నీ పాట్నాకు చెందిన సుచిత్ అనే వ్యక్తి వద్ద గన్ కొనుగోలు చేసి ఫరిద్ అనే వ్యక్తి నేపాల్ సరిహద్దుల్లో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశాడని, గన్‌తో జమ్మికుంటలో ట్రైన్ దిగిన ఫరిద్‌ను నాగరాజు పికప్ చేసుకున్నాడని చెప్పారు. గన్,10 రౌండ్‌ల బుల్లెట్‌ల కొనుగోలుకోసం నాగరాజు 1,50 లక్షలు ఫరీద్‌కు ఇచ్చి నట్లు ఎస్పీ శ్రీనివాస్ రావు వెల్లడించారు.
Also Read: Rahul Sipligunj: మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల నజరానా
సంగాయిపేట పెట్రోల్ బంకుకు వెళుతుండగా
ఈ నెల 14 న హైదరాబాద్ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొని తిరిగి రంగంపేట వస్తుండగా, ఓ ఆల్టో కారు, మరో కారులో అప్పటికే అనిల్ ని హత్య చేయాలని నిందితులు ప్లాన్ చేసుకున్నారని, వరిగుంతం సబ్ స్టేషన్ వద్ద నాగరాజు, నాగభూషణం, షాబుద్దిన్, చిన్నా, ఫరీద్, అశోక్‌లు గుమ్మడిదల నుండి అనిల్ కారును 2 కారులలో మారుతి 800 కారు, షిఫ్ట్ డిజైర్ కారుల వెంబడించారు. అనిల్ కారులో ముగ్గురు ఉండడాన్ని గమనించారు. అనిల్ కారులో ఉన్న శేఖర్, కౌడిపల్లిలో దిగి పోగా డ్రైవర్, బాలేష్, మరో వ్యక్తి పోతం శెట్టిపల్లిలో దిపోయారు. అక్కడి నుండి అనిల్ ఒక్కరే కారు నడిపిస్తూ సంగాయిపేట పెట్రోల్ బంకుకు వెళుతుండగా మార్గ మధ్యలో వరిగుంతం గ్రామ శివారులోని సబ్స్టేషన్ వద్ద అనిల్ కారుకు మారుతి 800 నాగభూషణం అడ్డుపెట్టగా, వెనుక ఉన్న షిఫ్ట్ కారు లోని ఫరీద్ కిందికి దిగి అనిల్ పై 4 రౌండ్లు గన్‌తో షూట్ చేసి కాల్చి చంపారని ఎస్పీ శ్రీనివాస్ రావు వెల్లడించారు. కాల్పులతో కంగారుపడ్డ అనిల్ కారు అదుపు తప్పి కలవర్టును ఢీకొంది. అప్పటికే అనిల్ అపస్మారక స్థితిలో వెళ్లిపోయారు. అనిల్ చనిపోయారని నిర్ధారించుకున్న రంతరువాత అక్కడినుండి నిందితులు పరారీ అయ్యారని ఎస్పీ చెప్పారు. హత్యకు సూత్రధారులు, రవీందర్ రెడ్డి, నాగరాజు, నాగభూషణంలు అని పోలీసులు తేల్చారు. అనిల్‌కు నాగరాజు కు ఓ ప్లాటు విషయంలో విబేధాలు ఉన్నాయి. అలాగే నాగభూషణంకు అనిల్ కు ఆర్థిక లావాదేవీల గొడవలు ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు.
అనిల్ నేపద్యం!
అనిల్ సొమ్మగారి రవీందర్ రెడ్డి బార్య సోమన్నగారి లక్ష్మీ వద్ద డ్రైవర్ గా ముఖ్య అనుచరునిగా ఉన్నారు. ఆమె 20019 లో నర్సాపూర్ ఎమ్మెల్యే గా బీ ఎస్పీ నుండి పోటీ చేశారు. ఆ సమయంలో అనిల్ అన్ని తానై ఆమె వెంట నడిచారు. అప్పట్లోనే ఆమె, ఆమె భర్త రవీంద్ర రెడ్డి కొన్న స్థలంలో అనిల్ సంగాయిపేట వద్ద పెట్రోల్ బంకు వేశారు. స్థలం మాత్రం లీజుకు ఉన్నట్లు సమాచారం. లక్ష్మీ కరోనా సమయంలో మరణించడంతో కొద్ది రోజులు రవీందర్ రెడ్డి కి అనిల్ అనుచరునిగా ఉన్నారు. ఆతరువాత అనిల్, రవీందర్ రెడ్డి మధ్య భూ వివాదం నెలకొని విబేధాలు తారాస్తాయికి చేరుకున్నాయని ఎస్పీ శ్రీనివాస్ రావు వెల్లడించారు. ఐదుగురు నిందితులను పట్టుకొని అరెస్ట్ చేయగా, విజయవాడకు చిందిన, షాబొద్దీన్, చిన్నా లు పరారీలో ఉన్నట్లు ఎస్పీ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. త్వరలో వారిని పట్టు కుంటాముని ఎస్పీ తెలిపారు. నిందితులు హత్యకు ఉపయోగించిన గన్ తో పాటు 4 కాలి తూటాలు, నిందితులు వాడిన కారులు పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.
మృతుడు అనిల్ 40,50 సెటిల్ మెంట్లు
మృతుడు అనిల్ జనతా గ్యాంగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకొని హైదరాబాద్, ప్రాంతాల్లో సెటిల్ మెంట్లు చేశాడిని ఎస్పీ తెలిపారు. అన్నింటిపై పూర్తి విచారణ చేశామని తెలిపారు. భూతగాదాలు ఆర్థిక లావాదేవీలు, అనిల్ హత్యకు కారణాలనీ ఎస్పీ శ్రీనివాస్ రావు వెల్లడించారు. జనతా గ్యారేజ్ గ్యాంగ్ పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి పాల్గొన్న వారిని బైండోవర్ చేస్తామని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఏ ఎస్ పి మహేందర్ డీఎస్పీ కు ప్రసన్న కుమార్, సిఐలు రాజశేఖర్ రెడ్డి జానారెడ్డి, రేణుక రెడ్డి, మహేష్, తదితరులు పాల్గొన్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ కేసులో 7 రోజులపాటు 7 టీంలు కస్టపడి కేసును చేధించారని వారికి రివార్డులు అందించనున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Gold Rates (20-07-2025): వామ్మో.. లక్ష దాటేసిన గోల్డ్.. ఇంకేం కొంటారు?
