UP Tragedy: ఉత్తర్ ప్రదేశ్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహానగర్ లోని భౌరావ్ దేవరాస్ ఆస్పత్రి బిల్డింగ్ పై నుంచి దూకి 83 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే వృద్ధుడి వద్ద సెల్ ఫోన్ లేని కారణంగా ఆస్పత్రి సిబ్బంది అతడ్ని క్యూలో నుంచి పక్కకు తప్పించారు. దీంతో మనస్థాపానికి గురై అతడు చనిపోయినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
83 ఏళ్ల సుఖ్ దేవ్ సింగ్ వైద్యం కోసం సోమవారం (సెప్టెంబర్ 1) భౌరావ్ దేవరాస్ ఆస్పత్రి (BRD Hospital)కి వచ్చారు. ఓపిడీ స్లిప్ కోసం క్యూలో నిలబడ్డాడు. అయితే మెుబైల్ లో అభా యాప్ ఉన్న వారికి మాత్రమే స్లిప్స్ అందిస్తునట్లు వైద్య సిబ్బంది.. అతడికి తెలియజేశారు. అండ్రాయిడ్ ఫోన్ లేని కారణంగా క్యూలో నిలబడవద్దని సూచించారు. దీంతో మనస్థాపానికి గురైన సుఖ్ దేవ్ సింగ్.. ఆస్పత్రి మూడో అంతస్తుకు చేరుకొని అక్కడి నుంచి కిందికి దూకేశాడు.
Also Read: Thummala Nageswara Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇక యూరియా కష్టాలు తీరినట్లే.. మంత్రి కీలక ఆదేశాలు
వృద్ధుడ్ని పంపేసిన ఉద్యోగి
మృతుడు సుఖ్ దేవ్ సింగ్.. ఓల్డ్ మహానగర్ కు చెందిన వ్యక్తి. ఆయనకు వైరల్ ఇన్ఫెక్షన్‌తో పాటు డయాబెటిస్ వంటి వ్యాధులు ఉన్నాయి. వైద్యుడికి చూపించుకోవడానికి ఆయన ఓపిడీ ప్రిస్క్రిప్షన్ కౌంటర్ వద్ద లైన్లో నిలబడ్డారు. ఆయన వంతు వచ్చాక ఆస్పత్రి ఉద్యోగి మొబైల్‌లో ‘ఆభా యాప్ డౌన్‌లోడ్’ చేసుకోవాలని సూచించాడు. అప్పుడే రిజిస్ట్రేషన్ సాధ్యం అవుతుందని చెప్పాడు. దీనికి వృద్ధుడు తన వద్ద ఆండ్రాయిడ్ ఫోన్ లేదని తెలిపాడు. దీంతో ఆయన్ను లైన్ నుంచి బయటకు పంపించేశారు.
Also Read: Viral News: చదివింది 10వ తరగతి.. పాతికేళ్లలో ఏకంగా రూ.కోటి దాచాడు.. ఇతడి జాబ్ ఏంటో తెలుసా?
రంగంలోకి పోలీసులు..
మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆసుపత్రి వెనుకభాగం నుంచి ఎవరో కింద పడిన శబ్దం వినిపించింది. అక్కడ ఉన్న అర్బన్ హెల్త్ పోస్ట్ సిబ్బంది వెంటనే పరిగెత్తుకొని వెళ్లగా.. సుఖ్ దేవ్ సింగ్ రక్తపు మడుగులో కనిపించాడు. దీంతో హుటాహుటీనా అతడ్ని ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఆయన మరణించారని ధ్రువీకరించారు. ఆసుపత్రి యాజమాన్యం వెంటనే 112 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామని.. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.