Delhi blast Umar: మహిళా పేషెంట్లను ఏం అడిగేవాడో తెలుసా?
Umar-Nabi (Image source Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Delhi blast Umar: ఢిల్లీ పేలుళ్ల కేసు నిందితుడు.. హాస్పిటల్‌లో మహిళా పేషెంట్లను ఏం అడిగేవాడో తెలుసా?

Delhi blast Umar: యావత్ భారతదేశం ఉలిక్కిపడేలా నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద రోడ్డుపై భారీ పేలుడు (Delhi Blast) జరిగిన విషయం తెలిసిందే. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో (Al Falah University) వైద్యుడిగా పనిచేసిన డాక్టర్ మొహమ్మద్ ఉమర్ నబీ (Delhi blast Umar) అనే అనుమానిత ఉగ్రవాది, హ్యుందాయ్ ఐ20 కారులో భారీగా పేలుడు పదార్థాలు తీసుకొచ్చి ఈ పేలుడుకు పాల్పడ్డాడు. ఈ ఉగ్రవాది గత చరిత్రను తెలుసుకునేందుకు ఎన్ఐఏ సహా ఇతర దర్యాప్తు సంస్థలు ప్రతి చిన్న విషయంపైనా ఆరా తీస్తున్న క్రమంలో అనేక విస్తుగొల్పే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఉమర్ తొలుత డాక్టర్‌గా పనిచేసిన సమయంలో అతడి ప్రవర్తన ఏవిధంగా ఉండేదానేదానిపై దర్యాప్తు చేయగా ఆసక్తికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

హిజాబ్‌పై మహిళలకు ప్రశ్నలు

జమ్మూ కాశ్మీర్‌లోని (Jammu Kashmir) అనంత్‌నాగ్‌లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పనిచేసేటప్పుడు, మహిళా రోగులతో ఉమర్ మాట్లాడిన తీరును బట్టి అతడికి ఉగ్రవాద భావజాలం చాలాకాలం నుంచే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా రోగులను హిజాబ్ గురించి ప్రశ్నలు అడిగేవాడని తేలింది. సమస్యలు ఉన్నట్లుగా తాను భావించిన మహిళా పేషెంట్లను గుర్తించి, హిజాబ్ ధరించనందుకు వారిని ప్రశ్నించేవాడని, తరచూ ఇదే విధంగా ప్రవర్తించేవాడని ఉమర్ నబీని దగ్గరగా గమనించిన మెడికల్ కాలేజీకి చెందిన వ్యక్తులు చెప్పారు. ‘మీరు ఎందుకు హిజాబ్ ధరించడం లేదు?, తలను ఎందుకు సరిగ్గా కప్పుకోలేదు?’ అంటూ మహిళా రోగులను కటువుగా అడిగేవాడని ఒకరు గుర్తుచేసుకున్నారు. అంతేకాదు, నమాజ్‌ విషయంలోనూ ప్రశ్నించేవాడని, రోజుకు ఎన్నిసార్లు నమాజ్ చేస్తారంటూ అడిగేవాడని తెలిపారు.

Read Also- Governors Powers: బిల్లుల ఆమోదంలో గవర్నర్ల అధికారాలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు

అతడి ప్రశ్నలు నచ్చని కొందరు పేషెంట్లు, తమను అనవసరమైన ప్రశ్నలు అడుగుతూ, తమ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ కొందరు పేషెంట్లు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ ఫిర్యాదుల అనంతరం, కాలేజీ యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి కూడా తొలగించింది. అక్కడ తొలగింపు వేటు పడిన తర్వాత ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాడు. తనలో ఉగ్రవాద భావజాలాన్ని మరింత పెంచుకొని, చివరకు ఆత్మాహుతి బాంబర్‌గా మారిపోయాడు.

ఉమర్ ఒక బాంబర్‌గా మారడం వెనుక అతడి ఆలోచనా ధోరణిని అర్థం చేసుకోవడానికి ఈ అంశాలు దర్యాప్తు అధికారులకు దోహదపడుతున్నాయి. కాగా, ఢిల్లీ పేలుడు ఘటనలో 13 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాదాపు 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.

తన దారిలో నడవకుంటే శత్రువే!

తాను సరైనదని భావించిన ఏ పనినైనా, కొంచెం ఉల్లంఘిస్తున్నట్టు కనిపించినా అదొక శత్రుపూరిత చర్యగా ఉగ్రవాది ఉమర్ భావించేవాడని బయటపడింది. మత సంబంధ విషయాలలో నబీ బాగా నిక్కచ్చిగా ఉండేవాడని, అతడిలో రాడికల్ భావజాలం చాలా ఎక్కువగా ఉండేదని కొందరు గుర్తుచేసుకున్నారు. ఇతర మతాలపై ఇస్లామిక్ ఆధిపత్యం కోసం ఎంతవరకైనా వెళ్లవచ్చంటూ ప్రోత్సహించాలని కోరుకునేవాడని దర్యాప్తులో బయటపడింది. మెడికల్ కాలేజీ క్లాస్ రూమ్‌ల్లోనూ మగవారిని, మహిళా స్టూడెంట్స్‌ను వేరు చేయాలని డిమాండ్ చేసేవాడని బయటపడింది.

Read Also- Swetcha Exclusive: మావోయిస్టుల కదలికలను ముందే పసిగట్టిన స్వేచ్ఛ.. ఎప్పటికప్పుడు వరుస కథనాలు

వీడియోలోనూ ఉగ్రవాద భావజాలం

ఢిల్లీ బ్లాస్ ఘటనపై విచారణలో ఉమర్ నబీకి సంబంధించిన కీలక విషయాలు బయటపడుతున్నాయి. పేలుడు సంభవించడానికి దాదాపు వారం రోజుల ముందు అతడు మాట్లాడిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆత్మహుతి భావనను చాలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారంటూ ఉమర్ ఆ వీడియోలో లెక్చర్లు ఇచ్చాడు. నిజానికి ఆత్మహుతి దాడి ఒక ‘అమరత్వ ఆపరేషన్’ అని, ఆత్మహుతి దాడిగా ముద్రవేశారని ఉగ్రవాద విషాన్ని కక్కాడు. ఇస్లాంలో ఇదొక ‘అమరత్వ ఆపరేషన్’ అని, ఆత్మహుతిపై భిన్నవాదనలు, విరుద్ధ విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నాయంటూ ప్రచారం చేశాడు. ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట ప్రదేశంలో, నిర్దిష్ట సమయంలో తాను చనిపోతానని ముందుగానే తెలిసి చనిపోవడమే ‘అమరత్వ ఆపరేషన్’ అని పేర్కొన్నాడు. ఈ నెల ప్రారంభంలో జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలోని తన సోదరుడికి నబీ ఇచ్చిన ఫోన్‌లో ఈ వీడియో క్లిప్ స్టోర్ అయ్యి ఉంది.

Just In

01

CM Revanth Reddy: యువ‌త‌కు ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలే లక్ష్యం.. గ్లోబల్ సమ్మిట్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి!

Bowrampet Land Dispute: బౌరంపేట్‌లో బడాబాబుల భూ మాయ‌.. పెద్దలకు వత్తాసు పలుకుతున్న మున్సిపాలిటీ రెవెన్యూ?

Trivikram Venkatesh: వెంకీమామ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా టైటిల్ ఇదే!

Minister Sridhar Babu: తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మహిళల కీలక పాత్ర : మంత్రి శ్రీధర్

Rumour Controversy: వారి బ్రేకప్‌ వ్యవహారంలో తనకు సంబంధం లేదంటున్న కొరియోగ్రాఫర్ నందికా ద్వివేది..