Swetcha Exclusive: మావోయిస్టుల కదలికలను పసిగట్టిన స్వేచ్ఛ
Swetcha Exclusive (image credit: twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Swetcha Exclusive: మావోయిస్టుల కదలికలను ముందే పసిగట్టిన స్వేచ్ఛ.. ఎప్పటికప్పుడు వరుస కథనాలు

Swetcha Exclusive: ఆపరేషన్ కగార్ మొదలైనప్పటి నుంచి మావోయిస్టుల కదలికలపై ‘స్వేచ్ఛ’ వరుస కథనాలను ఇస్తూ వస్తున్నది. దాదాపుగా జరిగే పరిణామాలను కచ్చితంగా అంచనా వేసి ప్రచురిస్తున్నది. కర్రె గుట్టల ప్రాంతాన్ని హిడ్మా అండ్ కో వదిలిపోయిన విషయాన్ని స్పష్టంగా వివరించింది. తెలంగాణ, ఆంధ్రా, ఒడిశా, మహారాష్ట్ర అడవుల్లో జరుగుతున్న పరిణామాలపైనా వరుస కథనాలను రాసింది. మావోయిస్టుల కదలికలు, పోలీసుల చర్యలను విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుసుకొని ప్రచురించింది.

ఇటీవల కాలంలో హిడ్మాతోపాటు మావోయిస్టు చీఫ్ దేవ్‌జీ, ఆజాద్, ఇతర కీలక నేతలు కర్రె గుట్టల ప్రాంతం, గోదావరి పరివాహక ప్రదేశాల్లోని గుట్టల ప్రాంతంలో సంచరించిన విషయాన్ని కూడా ‘స్వేచ్ఛ’ బయటపెట్టింది. బీజాపూర్‌లో భారీగా పేలుడు పదార్థాలను ధ్వంసం చేయడం, స్వాధీనం చేసుకోవడం పైనా కూడా రాసింది. పోలీసులు ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్‌పై మావోయిస్టులు కాల్పులు జరిపిన విషయాన్ని కూడా పసిగట్టింది.

Also Read:EPFO Withdraw: ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో పండుగ లాంటి శుభవార్త! 

బేస్ క్యాంపు దగ్గర కాల్పులతోనే మావోయిస్టులకు కౌంట్ డౌన్

బీజాపూర్ జిల్లా పూసుగుప్ప బేస్ క్యాంపుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఆ ప్రాంతం వారికి స్వర్గధామంగా ఉండడంతో పాటు మందు గుండు సామగ్రి సైతం అక్కడ ఎక్కువ నిల్వ చేసుకోవడంతో అక్కడే సంచరిస్తూ మనుగడ సాగిస్తుంటారు. అలాంటి ప్రాంతాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీంతో కీలక మావోయిస్టులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పోలీసుల ఎత్తుగడలకు తట్టుకోలేక మావోయిస్టులు విలవిలలాడారు.

నాలుగైదు రోజులు ఎదురు కాల్పులు

వరుసగా నాలుగైదు రోజులు ఎదురు కాల్పులు జరిగాయి. కొద్దిమంది మాత్రమే ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఎక్కువ మంది పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు సంసిద్ధులు అయ్యారు. ఈ నేపథ్యంలో దేవ్‌జీ, ఆజాద్‌లు లొంగిపోవాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నిర్ణయాన్ని సహించని మోస్ట్ వాంటెడ్ హిడ్మా తన స్థావరాన్ని మార్చుకునేందుకు తన బృందం సభ్యుల పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టాడు. ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

Also Read: Swetcha Exclusive: మహాధర్నాలో కవిత ప్లాన్ బట్టబయలు.. స్వేచ్ఛ చెప్పిందే నిజమైంది!

Just In

01

Samantha Wedding: మళ్లీ తెరపైకి సమంత పెళ్లి వ్యవహారం.. నేడు పెళ్లి అంటూ వార్త వైరల్.. రాజ్‌ మాజీ భార్య షేర్ చేసింది ఇదే..

Bhadradri Kothagudem: భద్రాద్రి మోడల్‌పై సర్కార్ స్టడీ? ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలకు దేశ స్థాయి గుర్తింపు!

Marriage Debate: తన మనవరాలి పెళ్లి విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జయా బచ్చన్.. ఏం అన్నారంటే?

Bhatti Vikramarka: రెండేళ్లలో ఏం చేశాం? భవిష్యత్‌లో ఏం చేయబోతున్నాం? కాంగ్రెస్ ప్లాన్ ఇదే : భట్టి విక్రమార్క

CM Revanth Reddy: యువ‌త‌కు ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలే లక్ష్యం.. గ్లోబల్ సమ్మిట్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి!