Plane Loses Wheel: శుక్రవారం గుజరాత్‌లోని కండ్లా నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరానికి ప్రయాణించిన స్పైస్ జెట్ విమానంలో షాకింగ్ ఘటన జరిగింది. విమానం టేకాఫ్ సమయంలో ఒక చక్రం (Plane Loses Wheel) ఊడిపోయింది. దీంతో, విమానాన్ని ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనపై స్పైస్ జెట్ వివరాలు వెల్లడించింది. క్యూ400 టర్బోప్రాప్ విమానం టేకాఫ్ అయిన తర్వాత రన్‌వేపై ఔటర్ వీల్ కనిపించిందని తెలిపింది. రెండు చక్రాల్లో ఒకటి ఊడిపోయినా మరొకటి ఉండడంతో విమానం ముంబై ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపింది.
శుక్రవారం మధ్యాహ్నం 3:51 గంటలకు ముంబైలో విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యిందని, ముందస్తు జాగ్రత్త చర్యగా ముంబై విమానాశ్రయంలో తాత్కాలిక అత్యవసర పరిస్థితిని ప్రకటించారని స్పైస్ జెట్ వెల్లడించింది. ఈ ఘటనపై స్పైస్‌జెట్ ప్రతినిధి స్పందిస్తూ, విమానం ముంబై ప్రయాణించిందని, ఒక చక్రం ఊడిపోయినప్పటికీ సురక్షితంగా ల్యాండ్ అయిందని వివరించారు. ల్యాండింగ్ తర్వాత, విమానం దానంతట అదే టెర్మినల్ వరకు వెళ్లిందని, అందులో ఉన్న ప్యాసింజర్లు అందరూ సాధారణంగానే కిందకు దిగారని వివరించారు.
Read Also- Modi Manipur Visit: మణిపూర్‌కు మోదీ.. కుకీ-మైతేయ్ తెగల మధ్య హింస తర్వాత తొలిసారి.. ఎందుకంటే?
ఈ ఘటనపై ముంబై ఎయిర్‌పోర్ట్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. కండ్లా నుంచి వచ్చిన విమానం సెప్టెంబర్ 12న సాయంత్రం 3:51 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండింగ్ అయిందని పేర్కొంది. సాంకేతిక సమస్య ఉందంటూ సమాచారం అందిందని, అందుకే అత్యవసర ల్యాండింగ్ చేపట్టామని వివరించింది. ‘‘ముందస్తు జాగ్రత్త చర్యగా పూర్తిస్థాయి ఎమర్జెన్సీ ప్రకటించాం. విమానం రన్‌వే 27పై సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. కొద్ది సేపట్లోనే ఎయిర్‌పోర్టులో సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించాం’’ అని ముంబై ఎయిర్‌పోర్టు ప్రతినిధి చెప్పారు.
మరో విమానంలోనూ ప్రమాదం
విమానం చక్రం ఊడిపోయిన ఘటనకు ముందు రోజు స్పైస్‌జెట్‌కు చెందిన మరో విమానంలోనూ ప్రమాదం జరిగినట్టు అనుమానాలు ఉన్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో ఒక విమానం టెయిల్‌పైప్‌లో మంటలు వచ్చినట్టు సందేహాలు వ్యక్తమయ్యాయి. సెప్టెంబర్ 11న (గురువారం) ఈ ఘటన జరిగింది. దీంతో, పక్కనే ఉన్న ఢిల్లీ నుంచి ఖాట్మండ్ వెళ్లాల్సిన బోయింగ్ 737-8 విమానాన్ని (ఫ్లైట్ నంబర్ ఎస్‌జీ041) కూడా తనిఖీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా విమానాన్ని బేకి తీసుకెళ్లి అన్ని తనిఖీలు చేశారు. ఏడు గంటల ఆలస్యంగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఢిల్లీలో టేకాఫ్ తీసుకొని, సాయంత్రం 5.10 గంటలకు ఖాట్మండ్ చేరుకుందని స్పైస్‌జెట్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్యాసింజర్లు అందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొంది.
Read Also- Mega158 and NBK111: దసరాకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్న టాలీవుడ్ టాప్ హీరోస్.. ఫ్యాన్స్‌కు పండగే