tollywood-big-heros(image :X)
ఎంటర్‌టైన్మెంట్

Mega158 and NBK111: దసరాకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్న టాలీవుడ్ టాప్ హీరోస్.. ఫ్యాన్స్‌కు పండగే

Mega158 and NBK111: దసరా పండుగ సమయంలో తెలుగు సినిమా ప్రేక్షకులకు గ్రాండ్ ట్రీట్ రాబోతుంది. ఈసారి, మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా158, నందమూరి బాలకృష్ణ నుంచి రాబోతున్న NBK111 సినిమాలు ఒకే తేదీన పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్మాతలు సిద్ధం అవుతున్నార. ఇది తెలుగు సినిమా చరిత్రలో అరుదైనదిగా చెప్పుకోవచ్చు. ఇద్దరు సూపర్‌స్టార్ల సినిమాలు ఒకేసారి ప్రారంభం కానుండటంతో అభిమానులు తెగ సంబరపడుతున్నారు. వీటి వివరాల గురించి అభిమాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also-Women vs Jackel: ఈ బామ్మ భల్లాలదేవ కంటే పవర్ ఫుల్.. చీర కొంగుతో నక్కను రఫ్పాడించింది!

మెగా158: చిరంజీవి – బాబీ కొల్లి

మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు (ఆగస్టు 22, 2025) సందర్భంగా ఈ సినిమా అధికారికంగా ప్రకటించారు. ఇది చిరంజీవి 158వ సినిమా, అందుకే “మెగా158” అని పిలుస్తున్నారు. డైరెక్టర్ బాబీ కొల్లి, ఇది వాల్తేరు వీరయ్య (2023లో బ్లాక్‌బస్టర్) తర్వాత ఇది వారి రెండో కాంబో. ఆ సినిమా లాగా ఇది కూడా మాస్ ఎంటర్‌టైనర్ అయి ఉంటుందని ఆశిస్తున్నారు. బాబీ కొల్లి స్టైల్‌లో యాక్షన్, ఎమోషన్ మిక్స్‌తో ఈ సినిమా ఉంటుందని సమాచారం. చిరంజీవి ఫ్యామిలీ, పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్‌లో హీరోగా కనిపించవచ్చు. ప్రొడక్షన్ KVN ప్రొడక్షన్స్ చేత జరుగుతోంది. షూటింగ్ త్వరలో మొదలవుతుందని అప్‌డేట్స్ వచ్చాయి.

Read also-BJP vs Congress: ప్రధాని తల్లి ఏఐ వీడియో రచ్చ.. దుమ్మెత్తిపోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్

నందమూరి బాలకృష్ణ 111వ సినిమా

NBK111, బాలయ్య బర్త్‌డే ముందు (జూన్ 8, 2025) ప్రకటించారు. ఇది వీర సింహారెడ్డి (2023 బ్లాక్‌బస్టర్) తర్వాత బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతుంది. హిస్టారికల్ ఎపిక్ జోనర్‌లో ఉంటుంది, మాస్ యాక్షన్‌తో ఫుల్ ఎంటర్‌టైన్మెంట్.స్టోరీ & జోనర్: హిస్టారికల్ రోర్ అని పిలుస్తున్నారు. బాలయ్య గ్రాండ్ వారియర్ రోల్‌లో కనిపిస్తాడు. పాలిటికల్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉండవచ్చు. వీర సింహారెడ్డి లాగా మాస్ డైలాగ్స్, ఫైట్స్ ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. ప్రొడక్షన్ వృద్ధి సినిమాస్ చేత, వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Just In

01

Sushila Karki: నేపాల్‌కు తాత్కాలిక ప్రధాని ఎంపిక పూర్తి!.. ప్రమాణస్వీకారానికి సర్వంసిద్ధం

Revanth Reddy: గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి… అధికారులకు సీఎం ఆదేశం

Dasoju Sravan: గ్రూప్1 పరీక్షను తిరిగి నిర్వహించాలి.. ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు

Plane Loses Wheel: విమానం టేకాఫ్ సమయంలో ఊడిన చక్రం.. గమ్యస్థానం చేరుకున్నాక..

Bhupalpally Heavy Rains: భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాడుకతో 100కు పైగా గొర్రెలు మృతి.. ఎన్ని లక్షల నష్టమంటే..?