Voter-Adhikar-Yatra
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Voter Adhikar Yatra: కొత్త యాత్ర మొదలుపెట్టిన రాహుల్ గాంధీ

Voter Adhikar Yatra: కాంగ్రెస్ పార్టీ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ఆదివారం ‘వోటర్ అధికార్ యాత్ర’కు (Voter Adhikar Yatra) శ్రీకారం చుట్టారు. బిహార్‌లోని ససారాం నుంచి 1,300 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుందని ఆయన తెలిపారు. ‘ఓట్ల చోరీ’కు వ్యతిరేకంగా జనాల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేయాలనే లక్ష్యంతో రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారు. బిహార్‌లో మొదలైన యాత్ర ప్రారంభ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అగ్రనేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు.

రాజ్యాంగాన్ని రక్షించే పోరాటం
సభను ఉద్దేశించి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది రాజ్యాంగాన్ని రక్షించే పోరాటం అని ఆయన అభివర్ణించారు. ‘వోటర్ అధికార్ యాత్ర’ బిహార్‌లోని 20కి పైగా జిల్లాల గుండా వెళుతుందని వివరించారు. ఇక, ఎన్నికల సంఘంపై ఆయన మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బిహార్‌లో స్పెషల్ ఇన్సెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో ఓటర్లను తొలగించడం, కొత్తగా పేర్లు చేర్చడం ద్వారా ఎన్నికలను దొంగిలించేందుకు ‘కొత్త కుట్ర’ జరుగుతోందని ఆయన ఆరోపించారు. దేశమంతటా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు చోరీకి గురవుతున్నాయని, బిహార్‌లో ఎన్నికలను దొంగిలించేందుకు వాళ్లు అనుసరిస్తున్న చివరి కుట్ర సర్ (SIR) అని, దీని ద్వారా ఓటర్లను తొలగించడం, చేర్చడం చేస్తున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఏం చేస్తోందనేది ఇప్పటికే దేశమంతా తెలుసుకుందని, ఓట్ల దొంగతనం ఎలా జరుగుతోందనేది జనాలకు అర్థమవుతోందని అన్నారు.

Read Also- Congress: మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌‌లో వరుస రాజీనామాలు.. కారణాలు ఇవే

ఇంకా ఏమన్నారంటే,
‘ఓటు చోరీ’పై తాను ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత ఎన్నికల సంఘం (EC) స్పందించి.. తనను అఫిడవిట్ ఇవ్వాలని అడిగిందని, తనలాగే బీజేపీ నేతలు అనేక ఆరోపణలు చేసినా, వారిని మాత్రం అటువంటివి ఏమీ అడగలేదని మండిపడ్డారు. ‘‘బిహార్‌లో ఎన్నికల దొంగతానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము అడ్డుకుంటాం. పేదవారికి ఉన్న ఏకైక శక్తి వారి ఓటే. దాన్ని కూడా వాళ్లు తొలగించాలనుకుంటున్నారు. కానీ, మేము అది జరగనివ్వం. ప్రతి ఎన్నికలో బీజేపీ గెలుస్తోంది. మహారాష్ట్రలో ఇండియా బ్లాక్ గెలవబోతోందని అన్నీ ఒపీనియన్ పోల్స్ చెప్పాయి. కానీ, బీజేపీ కూటమి గెలిచింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మా కూటమి రాష్ట్రంలో సత్తా చాటింది. కానీ, నాలుగు నెలల తర్వాత అదే మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోటి ఓటర్లను కోటీగా చేర్చారు. అందుకే బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. ఓటర్లను చేర్చిన ప్రదేశాల్లో అన్నీ బీజేపీకి అనుకూలంగా మారాయి’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Read Also- Ramchander Rao: ఆర్ఎస్ఎస్‌పై తప్పుగా మాట్లాడుతున్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

వోటర్ అధికార్ యాత్ర వివరాలివే
రాహుల్ గాంధీ చేపట్టిన ‘వోటర్ అధికార్ యాత్ర’ బిహార్‌లో 20కి పైగా జిల్లాల మీదుగా కొనసాగనుంది. ఔరంగాబాద్, గయా, నవాదా, నలందా, షేక్‌పురా, లఖీ సరాయ్, ముంగేర్, భాగల్‌పూర్, కటీహార్, పుర్నియా, అరరియా, సుపౌల్, మధుబనీ, దర్శభంగా, సితామఢి, ఈస్ట్ చంపారన్, వెస్ట్ చంపారన్, గోపాల్‌గంజ్, సివాన్, ఛప్రా, ఆరా జిల్లాల మీదుగా కొనసాగనుంది. సెప్టెంబర్ 1న పాట్నాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభతో ఈ యత్ర ముగియనుంది. రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల ముందు మణిపూర్ నుంచి ముంబై వరకు చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ తరహాలోనే ఈ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాలినడకన, వాహనంలో రెండు విధానాల కలయికతో హైబ్రిడ్ మోడల్‌లో సాగుతుందని చెబుతున్నారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు