Congress-party
జాతీయం

Congress: మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌‌లో వరుస రాజీనామాలు.. కారణాలు ఇవే

Congress: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి (Congress) ఊహించని షాక్ తగిలింది. పార్టీ అధిష్టానం శనివారం విడుదల చేసిన 71 జిల్లాల అధ్యక్షుల జాబితా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. పార్టీలో పునర్‌వ్యవస్థీకరణను దృష్టిలో పెట్టుకొని విడుదల చేసిన ఈ జాబితాపై నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. భోపాల్, ఇండోర్, ఉజ్జయిని, బుర్హాన్‌పూర్‌ల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. అంతటితో ఆగకుండా చాలా మంది రాజీనామాలు కూడా చేశారు. రిజైన్ ద్వారా తమ అసంతృప్తిని వెలిబుచ్చారు.

రాఘోఘఢ్‌లో పరిస్థితి మరింత దారితప్పింది. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్ కొడుకు, మాజీ మంత్రి జైవర్ధన్‌ సింగ్‌ అనుచరులు అర్ధరాత్రి సమయంలో భారీ నిరసనలు చేపట్టారు. గుణా జిల్లా అధ్యక్షుడిగా జైవర్ధన్‌ సింగ్‌‌ను నియమించడంపై భగ్గుమన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నియమించి రాజకీయంగా ఆయనను పక్కన పెట్టాలని భావిస్తున్నారని అనుచరులు మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జీతూ పట్వారీ బొమ్మలను దహనం చేశారు. జైవర్ధన్‌‌‌ను అవమానపరిచారంటూ ఆయన అనుచరులు బిగ్గరగా నినాదాలు చేశారు. మరోవైపు, భోపాల్‌ జిల్లా అధ్యక్షుడిగా ప్రవీణ్‌ సక్సేనాను తిరిగి నియమించడం తీవ్ర అసంతృప్తి పరిస్థితులకు దారి తీసింది. జిల్లా అధ్యక్ష పదవి ఆశించిన మోను సక్సేనా సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని ప్రకటించారు. పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పిలుపు మేరకు పార్టీ పునర్నిర్మాణ అవసరాన్ని నేతలు పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు.

Read Also- Anchor Udaya Bhanu: ఉదయభానును తొక్కేసింది వాళ్ళేనా.. లైవ్ లో గట్టిగా ఇచ్చి పడేసిందిగా?

ఇండోర్‌లో కొత్త నగర అధ్యక్షుడిగా చింటూ చౌక్సే, జిల్లా అధ్యక్షుడు విపిన్ వాంఖడేలకు పదవులు ఇవ్వడంపై ప్రత్యర్థి వర్గాలు భగ్గమన్నాయి. రాష్ట్రంలో మహిళా విభాగం మాజీ చీఫ్ సాక్షి శుక్లా సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వెల్లగక్కారు. ఉజ్జయిని (గ్రామీణ)లో మహేష్ పర్మార్ నియామకంపై కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సత్నాలో సిద్ధార్థ్ కుశ్వాహ నియామకంపై కూడా కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే కొందరు రాజీనామాలు కూడా చేశారు. జిల్లా అధికార ప్రతినిధి, రాజీవ్ గాంధీ పంచాయతీ సెల్ అధ్యక్షుడు హేమంత్ పాటిల్ తన పదవి నుంచి వైదొలిగారు. బుర్హాన్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయిన అరుణ్ యాదవ్‌కు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వకపోవడాన్ని ఆయన అనుచరులు తప్పుబట్టారు. సీక్రెట్‌గా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించినట్టుగా సమాచారం.

కాంగ్రెస్ జాబితా ఇదే

కాంగ్రెస్ విడుదల చేసిన జాబితా ప్రకారం, 21 మంది అధ్యక్షులను పార్టీ అధిష్టానం పునర్నిర్మించింది. మొత్తం 71 మంది జిల్లా అధ్యక్షులను ప్రకటించగా, అందులో 37 మంది రిజర్వ్ వర్గాలకు చెందినవారు కావడం గమనార్హం. 35 జనరల్ , 12 ఓబీసీ, 10 ఎస్టీ, 8 ఎస్సీ, 4 మహిళలు, 3 మైనారిటీ వర్గాలు చొప్పున అధిష్టానం పదవులు కట్టబెట్టింది. ముఖ్యంగా, జిల్లా అధ్యక్ష పదవులు అప్పగించినవారిలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. 8 మంది మాజీ ఎమ్మెల్యేలు, ముగ్గురు మాజీ మంత్రులకు జిల్లా స్థాయిలో బాధ్యతలు ఇవ్వడంపై నేతలు అసంతృప్తిగా ఉన్నారు.

Read Also- Crime News: రామంతపూర్ బాలుని హత్య కేసులో నిందితుడు అరెస్ట్.. ఏం చేశాడంటే!

ఈ నియామకాలు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పర్యవేక్షణలో ఖరారు చేశారు. అయినప్పటికీ, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆధిపత్యం కొనసాగుతోందని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఆయనకు చెందిన కనీసం 10 మంది అనుచరులు జాబితాలో చోటు దక్కించుకున్నారని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్లు అయిన ఓంకార్ సింగ్ మార్కం, జైవర్ధన్ సింగ్, నిలయ్ డాగా, ప్రియవ్రత్ సింగ్ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నాయి. ఏదేమైనా జిల్లాల కొత్త అధ్యక్షుల ప్రకటన పార్టీలో మార్పులకు నాందిపలకడం ఏమో గానీ, వర్గపోరాటాలకు మరింత ఆజ్యం పోసినట్టు అయింది.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు