Rahul Gandhi: గతంలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామనుకున్న సీట్లలో ప్రతిపక్ష పార్టీలు ఓడిపోవడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో ఎన్నికల సంఘం కుమ్మక్కు అయి లబ్ధి చేకూర్చిందని పక్కా ఆధారాలు చూపుతున్నారు ప్రతపక్ష నేత రాహుల్ గాంధీ*(Rahul Gandhi). బీజేపీ,(BJP) ఈసీపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక క్రమపద్ధతిలో ఓట్ల దొంగతనం జరుగుతన్నదని అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగిన కుట్రలు ఇప్పుడు బిహార్ ఎన్నికల్లోనూ అమలు చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు.
Also Read: Panchayat Elections: గత రిజర్వేషన్లే కొనసాగింపు? ఎన్నికల నిర్వహణపై దృష్టి
నకిలీ ఓట్లు అని తేలినా ఈసీ మౌనం
తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, ఇంకా చాలా వషయాలు త్వరలో బయటకు వస్తాయని తెలిపారు. ఓట్ల దొంగతనం కుంభకోణమే కాదు ప్రజాస్వామ్యానికి పెద్ద ద్రోహమని వ్యాఖ్యానించారు. సమయం వచ్చినప్పడు శిక్ష తప్పదని హెచ్చరించారు. డిజిటల్ ఓటర్ జాబితాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలోని ఓ నియోజకవర్గంలో దాదాపు లక్ష నకిలీ ఓట్లు అని తేలినా ఈసీ మౌనంగా ఉండిపోయిందని మండిపడ్డారు. ప్రజల టు హక్కును కాపాడాల్సిన ఎన్నికల సంఘమే ఇలా వ్యవహరిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
Also Read: CPM Protest: తారు రోడ్డుపై గుంతల్లో నాట్లు వేసి నిరసన