CPM Protest(IMAGE crdit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

CPM Protest: రోడ్డును బాగు చేయండి రోడ్డుపై నాటేసి నిరసన

CPM Protest: సంవత్సరాలుగా గుంతల మయమై ప్రమాదాలకు కారణమవుతున్న రహదారిని మరమ్మతు చేయాలని బచ్చన్నపేటలో తారు రోడ్డుపై గుంతల్లో నాటు వేసి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం సీపీఎం బచ్చన్నపేట (Bachannapet) మండల కమిటీ ఆధ్వర్యంలో, మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ నుండి కొడవటూరు కమాన్‌ వరకు గుంతలతో నిండిన రోడ్డుపై నాట్లు వేసి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజేందర్ మాట్లాడుతూ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగామ జిల్లాలను కలిపే ఈ రహదారి నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుందని, భారీ వాహనాలు తరచుగా బోల్తాపడి ప్రాణ నష్టం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. రోడ్డు మరమ్మతు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సీపీఎం జనగామ జిల్లా కమిటీ సభ్యుడు సుంచు విజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: CM Revanth Reddy: భారీ వ‌ర్షాలు వ‌చ్చినా ప్రాణ‌ నష్టం వాటిల్లకుండా జాగ్రత్త ప‌డాలి

రహదారికి మరమ్మతులు చేపట్టాలి

ఇటీవల వడ్ల లోడుతో వెళ్తున్న భారీ వాహనం నడిరోడ్డుపై బోల్తాపడిందని, వర్షాకాలంలో గుంతలలో నీరు నిల్వ ఉండటం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే ధ్వంసమైన నేషనల్ హైవే రహదారికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో రోడ్ల దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్, నాయకులు రామగళ్ళ అశోక్, సమ్మయ్య, మురళి, శోభ, సుధాకర్, మైబెల్లి భాస్కర్, కిష్టయ్య, చారి, మల్లమ్మ పాల్గొన్నారు.

Also Read: SC on Aadhar card: పౌరసత్వానికి ‘ఆధార్‌ ప్రూఫ్ కాదు’.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు