Murmu in Rafale: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Murmu in Rafale) దేశవాసులను ఆశ్చర్యానికి గురిచేశారు. బుధవారం ఆమె అత్యంత అధునాతన యుద్ధ విమానమైన ‘రాఫెల్’లో (Rafale) ఏకంగా 30 నిమిషాలపాటు ప్రయాణించారు. హర్యానాలోని అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి ఆమె ప్రయాణించారు. దీంతో, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు యుద్ధ విమానాల్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ద్రౌపది మర్ము చరిత్రకెక్కారు. అంతకుముందు, 2022 ఏప్రిల్‌లో అసోంలోని తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్-30 ఎంకేఐ విమానంలో ప్రయాణించారు. రాఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణించిన అనంతరం ద్రౌపది ముర్ము స్పందిస్తూ, జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని అనుభవమని ఆమె అభివర్ణించారు.
విజిటర్స్ బుక్‌లో సందేశం
రాఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణించిన అనంతరం ద్రౌపది ముర్ము విజిటర్స్ బుక్‌లో ఆసక్తికరమైన సందేశం రాశారు. తొలిసారి రాఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణించేందుకుగానూ అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను సందర్శించడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. రాఫెల్ విమానంలో తన మొదటి ప్రయాణం దేశ రక్షణ సామర్థ్యాలపై తనలో కొత్త గర్వాన్ని నింపిందని ద్రౌపది ముర్ము రాసుకొచ్చారు. తన ప్రయాణాన్ని విజయవంతంగా నిర్వహించిన అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ బృందానికి, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు అభినందనలు తెలుపుతున్నట్టు ఆమె పేర్కొన్నారు.
Read Also- Jubliee Hills Bypoll: ‘జూబ్లిహిల్స్ మీ అయ్య జాగీరా?’.. కాంగ్రెస్ అభ్యర్థిపై ఆర్.ఎస్ ప్రవీణ్ ఫైర్
శివంగి సింగ్‌తో రాష్ట్రపతి ఫొటో
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు చెందిన 5 యుద్ధ విమానాలను కూల్చిశామని, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన స్వాడ్రన్ లీడర్, మహిళా పైలెట్ శివంగి సింగ్‌ను పట్టుకున్నామంటూ దాయాది దేశం పాకిస్థాన్ పదేపదే ప్రకటనలు చేసింది. సరిగ్గా అదే, శివంగి సింగ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ (బుధవారం) అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఫొటో దిగారు. తాము పట్టుకున్నామని చెబుతున్న పైలెట్ శివంగి సింగ్‌తో రాష్ట్రపతి ముర్ము ఉన్న ఫొటో చూస్తే పాకిస్థాన్ త్రివిధ దళాలకు ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Read Also- Azharuddin: నిజమా!.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి?.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ ఊహించని ట్విస్ట్?
ఎవరీ శివంగి సింగ్?
శివాంగి సింగ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోని ‘గోల్డెన్ ఆరోస్’ స్క్వాడ్రన్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటి, ఏకైక మహిళా రాఫెల్ పైలట్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. ఈ ఏడాది మే నెలలో ఆపరేషన్ సిందూర్ పేరిట, పీవోకేతో పాటు పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన కచ్చితత్వ దాడుల సమయంలో శివంగి సింగ్ రాఫెల్ విమానాన్ని నడిపారు. వారణాసికి చెందిన ఈ యువ సైనికురాలి వయసు కేవలం 29 సంవత్సరాలే. 2017లో ఆమె ఎయిర్‌ఫోర్స్‌లో చేరారు. రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపే అర్హత సాధించడానికి ముందు మిగ్-21 బైసన్ విమానాన్ని చాలా గంటలపాటు నడిపారు. ఈ నెలలోనే, అక్టోబర్ 9న క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ (QFI) బ్యాడ్జ్‌ను శివంగి సింగ్ అందుకున్నారు. కాగా, ఆపరేషన్ సింధూర్ సమయంలో శివాంగి సింగ్‌ను సియాల్‌కోట్ వద్ద పట్టుకున్నామని, పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేసింది. అయితే, ఈ వాదనల్లో నిజంలేదని కేంద్ర ప్రభుత్వం ఆ సమయంలో తోసిపుచ్చింది.
