Tallest Ram Statue: వరల్డ్‌లోనే ఎత్తైన రాముడి విగ్రహం ఆవిష్కరణ
Tallest Ram Statue (Image Source: Twitter)
జాతీయం

Tallest Ram Statue: మరో అరుదైన ఘట్టం.. 77 అడుగుల శ్రీరాముడి విగ్రహం.. ఆవిష్కరించిన మోదీ

Tallest Ram Statue: దేశంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్యలో ధ్వజారోహణ జరిగి వారం గడువకముందే శ్రీరాముడికి సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహాన్ని (Tallest Ram Statue) ప్రధాని మోదీ ఆవిష్కరించి.. జాతికి అంకింతం చేశారు. దక్షిణ గోవాలోని ‘శ్రీ సంస్థాన్‌ గోకర్ణ పర్తగాలీ జీవోత్తమ్‌ మఠం’ (Shree Samsthan Gokarn Partagali Jeevottam Math)లో ఏర్పాటు చేసిన ఈ 77 అడుగుల కాంస్య విగ్రహాన్ని (77-foot bronze statue) ప్రధాని ప్రారంభించారు.

మఠం 550వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా మఠంలో ఏర్పాటు చేసిన ‘రామాయణ థీమ్ పార్క్ గార్డెన్‌’ (Ramayana Theme Park Garden)ను ప్రారంభించారు. మఠం ఏర్పాటై 5 శతాబ్దాలు దాటిన సందర్భంగా తపాలా స్టాంప్, స్మారక నాణెంను కూడా మోదీ విడుదల చేశారు. కాగా శ్రీ సంస్థాన్‌ గోకర్ణ పర్తగాలీ జీవోత్తమ్‌ మఠం.. దేశంలోనే అతి పురాత మత సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తాజాగా ప్రారంభించిన రాముడి విగ్రహాన్ని.. ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని తీర్చిదిద్దినన శిల్పి రామ్ సుతార్ నిర్మించడం విశేషం.

Also Read: Shalibanda Fire Accident: ఓల్డ్ సిటీ బ్లాస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్.. షాపు మూడు వైపులా విస్ఫోటనం.. ఉగ్రవాదుల పనేనా?

ఇవాళ ఉదయం కర్ణాటక (Karnataka)లోని ఉడుపి (Udupi)ని ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడి శ్రీకృష్ణ మఠం (Sri Krishna Matha)లో ప్రార్థనలు చేశారు. అనంతరం సుమారు లక్షమంది విద్యార్థులు, సన్యాసులు, పండితులు చేసిన శ్రీమద్ భగవద్గీత సార్వజనిక పారాయణం (Laksha Kantha Gita Parayana)లో మోదీ పాల్గొన్నారు. అలాగే మఠంలో సువర్ణ తీర్థ మండపంను ప్రారంభించారు. ఉడుపిలోని ఈ శ్రీకృష్ణ మఠాన్ని 800 ఏళ్ల క్రితం శ్రీ మద్వాచార్యులు స్థాపించారు. ద్వైత సిద్దాంతానికి కేంద్ర బిందువుగా ఈ మఠం ప్రసిద్ధి చెందింది.

Also Read: Bigg Boss Telugu 9: కెప్టెన్సీ కోసం డైరెక్ట్‌గా నాతో తలపడు.. డిమోన్‌కు కళ్యాణ్ సవాల్.. ఏం ప్లాన్ చేశావ్ సంజన?

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!