India Pakistan Ceasefire: భారత్ – పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించినట్లు శనివారమే భారత్ ప్రకటించింది. అయితే పాక్ వాటిని పాక్ కొద్ది గంటల్లో ఉల్లఘించినప్పటికీ.. భారత్ సైన్యం వార్నింగ్ తో ఆదివారం రాత్రి సైలెంట్ అయిపోయింది. ఇదిలా ఉంటే ముందుగా ప్రకటించిన విధంగానే ఇరుదేశాల మధ్య డీజీఎంవో స్థాయిలో చర్చలు ప్రారంభమయ్యాయి. హాట్ లైన్ లో మెుదలైన ఈ చర్చలకు భారత్ తరపున లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ హాజరయ్యారు. కాల్పుల విరమణకు సంబంధించి ప్రస్తుతం రెండు దేశాలు చర్చిస్తున్నాయి.
మరోవైపు పాక్ తో డీజీఎంవో చర్చలు జరుగుతున్న క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ.. త్రివిధ దళాధిపతులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటికి త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పలువురు సైనిక అధికారులు హాజరయ్యారు. హాట్ లైన్ లో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాక్ కు పెట్టాల్సిన షరతులు గురించి ఈ భేటిలో చర్చించినట్లు తెలుస్తోంది. అందుకు పాక్ అంగీకరిస్తేనే చర్చలు మరింత ముందుకు కొనసాగించాలని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇరు దేశాల చర్చల నేపథ్యంలో మధ్యాహ్నం 2:30 గంటలకు DGMO ప్రెస్ మీట్ నిర్వహించనుంది. భారత్, పాక్ హాట్ లైన్ చర్చల వివరాలను ప్రకటించే ఛాన్స్ ఉంది.
Also Read: Virat Kohli retirement: బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న విరాట్ కోహ్లీ
ఇదిలా ఉంటే ఆదివారం ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ కు బుల్లెట్లు, ఫిరంగులతో తగిన రీతిలో సమాధానం ఇవ్వాలని సూచించారు. పాక్ చర్యలకు భారత్ నుంచి బలమైన రీతిలో ప్రతిస్పందన ఉండాలని సూచించారు. కాశ్మీర్ విషయంలో భారత్ చాలా స్పష్టమైన వైఖరిని కలిగి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాశ్మీర్ ను భారత్ కు ఇవ్వడం మినహా పాక్ కు మరో మార్గం లేదని.. దీనిపై ఎవరి మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించబోదని ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి.