PM Modi: గుజరాత్ పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ నాటి తొలి కేంద్ర హోమంత్రి సర్దార్ వల్లభాయ్ (Sardar Vallabhbhai Patel) గురించి మాట్లాడారు. ఆయన మాటలు విని ఉంటే భారత్ లో ఉగ్రదాడుల పరంపర ఉండేది కాదని పేర్కొన్నారు.
పటేల్ మాట వినాల్సింది
గుజరాజ్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా గాంధీ నగర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ 1947లో దేశం మూడు భాగాలుగా విడిపోయిందని గుర్తు చేశారు. అయితే అదే రోజు రాత్రి కాశ్మీర్ గడ్డపై తొలి ఉగ్రదాడి జరిగిందని ప్రధాని అన్నారు. విభజన సమయంలో ఉగ్రవాదులను ఉపయోగించుకొని.. పాక్ మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకుందని ప్రధాని పేర్కొన్నారు. ఆ రోజు పీఓకేను సొంతం చేసుకునే వరకు సాయుధ బలగాలు వెనక్కి తగ్గవద్దని నాటి కేంద్రం హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచించారని మోదీ గుర్తుచేశారు. కానీ అప్పటి నేతలు ఎవరూ ఆయన మాటలు వినిపించుకోలేదని చెప్పారు.
1947లో భారత్ మూడు ముక్కలైంది: ప్రధాని మోదీ
అదేరోజు రాత్రి కశ్మీర్లో తొలిసారి ఉగ్రదాడి జరిగింది
సాయుధ మూకల సాయంతో కశ్మీర్‌లోని కొంత భాగాన్ని పాక్ ఆక్రమించుకుంది
ఆరోజే ఉగ్రవాదులను ఏరివేసి.. పీఓకే ను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న సర్దార్ వల్లభాయ్ సలహా విని ఉంటే ఉగ్రదాడులు ఉండేవి… pic.twitter.com/QLDrsHkyHI
— BIG TV Breaking News (@bigtvtelugu) May 27, 2025
3 సార్లు పాక్‌ను ఓడించాం
గత 75 ఏళ్లుగా భారత్.. ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ అన్నారు. పహల్గాం దాడి (Pahalgam Terror Attack) కూడా అందులో భాగంగా జరిగిందేనని స్పష్టం చేశారు. యుద్ధంలో పాక్ ను మూడు సార్లు భారత్ ఓడించిందని గుర్తు చేశారు. యుద్ధంలో భారత్ ను ఓడించలేమని పాక్ అర్థమైందని మోదీ అన్నారు. అందుకే భారత్ పై పరోక్ష యుద్ధాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఉగ్రవాదం ముసుగులో అవకాశం దొరికిన చోటల్లా పాక్ దాడి చేస్తూనే ఉందని అన్నారు. భారత్ ఇంతకాలం దానిని సహిస్తూనే వచ్చిందని చెప్పారు.
Also Read: Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్‌కు బదులిచ్చిన పవన్.. థియేటర్ యాజమాన్యాలపై బిగ్ బాంబ్!
ఉగ్రవాదం.. పాక్ యుద్ధ వ్యూహాం
ఉగ్రవాదాన్ని పాక్ ఒక యుద్ధ వ్యూహాంగా అనుసరిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. అయితే దీనిని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) లో మరణించిన ఉగ్రవాదులకు పాక్ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించని మోదీ గుర్తు చేశారు. ఆ దేశ ఆర్మీ కూడా చనిపోయిన ముష్కరులకు సెల్యూట్ చేసిందని చెప్పారు. దీన్ని బట్టి ఉగ్రవాదం అనేది పరోక్ష యుద్ధం కాదని.. పాక్ యుద్ధ వ్యూహమని రుజువు చేస్తోందని మోదీ చెప్పారు.