Pan India Tapping Joint Leaders Came To Light
జాతీయం

PAN INDIA : పాన్ ఇండియా ట్యాపింగ్..!

– తెలంగాణ బయట ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రణీత్ రావు టీం
– కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ కుమారస్వామికి ట్యాపింగ్ సేవలు
– కాంగ్రెస్, కమల నేతల నగదును పట్టిచ్చిన వైనం
– ఏపీలోనూ ట్యాప్ చేశారా? అనే కోణంలో విచారణ?
– విచారణలో బయటికొచ్చిన భుజంగరావు, తిరపతన్నల లీలలు
– తెలంగాణ ఎన్నికల్లో డబ్బులు చేరవేసామని అంగీకారం
– వెలుగులోకి ఉమ్మడి వరంగల్, నల్గొంగ నేతల పేర్లు
– తనమీది మర్దర్ కేసును తానే మాఫీ చేసుకున్న రాధాకిషన్ రావు
– త్వరలోనే ‘బిగ్ బాస్’ పేరు బయటికి?

Pan India Tapping Joint Leaders Came To Light: రాష్ట్రంలోని ప్రైవేటు వ్యక్తుల, కీలక నేతల ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో పోలీసులు ఆదివారం భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావును, హైదరాబాద్‌ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నను అరెస్టు చేశారు. వీరిపై ఐపీసీ 120 ఏ, 409, 427, 201 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో మరో కీలక పాత్రధారి అయిన ప్రణీత్ రావుతో కలిపి గాంధీ అస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించి, అనంతరం వారిని కొంపల్లిలోని నాంపల్లి 14వ అదనపు మేజిస్ట్రేట్ కన్నయ్య లాల్ నివాసంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి వీరికి 14 రోజుల పాటు (ఏప్రిల్ 6 వరకు) రిమాండును విధించారు. అనంతరం నిందితులను పోలీసులు చంచల్ గూడా జైలుకు తరలించారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న తిరుపతన్న గత అసెంబ్లీ ఎన్నికల ముందువరకు ఎస్‌ఐబీలో అదనపు ఎస్పీగా, భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్‌ విభాగంలో అదనపు ఎస్పీగా పనిచేసిన సంగతి తెలిసిందే. నాటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు వీరిద్దరూ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డామని అంగీకరించారు. ఈ కేసులో రాధాకిషన్ రావు పాత్ర కూడా ఉందని ప్రణీత్ రావుతో సహా వీరిద్దరూ అంగీకరించటంతో నాటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పేర్లను కూడా నిందితులుగా పేర్కొంటూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

కేసు విచారణలో భాగంగా శనివారం పోలీసులు భుజంగరావు, తిరుపతన్నలను అదుపులోకి తీసుకుని, ఆరేడు గంటలపాటు విడివిడిగా విచారించగా, దిమ్మతిరిగిపోయే వాస్తవాలు తెలిశాయి. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, తాము ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డామని, గతంలో జరిగిన ఉప ఎన్నికలు, 2023 నవంబరులో జరిగిన శాసన సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల నగదునుతమ వాహనాల్లో తరలించారనీ, గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే ఫోన్ ట్యాపింగ్ పరికరాలు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేశామని వీరు అంగీకరించారు. ప్రభుత్వ విధుల్లో ఉంటూ ప్రభుత్వంలోని పెద్దలు, కొందరు సంపన్నుల కోసమే వీరిద్దరూ ఏళ్ల తరబడి పనిచేస్తున్నట్లు, ఈ క్రమంలో వీరు ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసి ఎప్పటికప్పడు ఆ సమాచారాన్ని ప్రభుత్వ పెద్దలకు చేరవేసినట్లు విచారణలో రుజువు కావటంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు.

Read Also : అష్టదిగ్బంధం, కేసీఆర్ కుటుంబంపై ఈడీ కత్తి..!

మరోవైపు ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఐన్యూస్‌ మీడియా నిర్వాహకుడు శ్రవణ్‌రావు అరువెల పాత్రను పోలీసులు నిర్ధారించారు. శుక్రవారం వీరి నివాసాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలసిందే. శుక్రవారం నాటి సోదాల్లో శ్రవణ్ కుమార్ ఇంట్లో కీలకమైన సమాచారం గల కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈయన ఆఫీసు కేంద్రంగా ట్యాపింగ్ జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. వీరు ముగ్గురూ ఇప్పటికే దేశం దాటిపోయారనీ, వారిలో ప్రభాకర్ రావు అమెరికా, రాధాకిషన్ రావు లండన్, శ్రవణ్ రావు నైజీరియా చేరినట్లు నిర్ధారించిన పోలీసులు లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ జారీ చేశారు.

తాజాగా రాధాకిషన్ రావుకు సంబంధించిన మరో కీలక అంశమూ బయటికొచ్చింది. 2014లో ఈయన మల్కాజ్ గిరి ఏసీపీగా పనిచేసిన సమయంలో కాంగ్రెస్ నేత శ్రీధర్ రెడ్డిని అకారణంగా వేధించటంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో శ్రీధర్ రెడ్డి రాసిన సూసైడ్ నోట్‌లో రాధాకిషన్ రావు పేరును ప్రస్తావించటంతో అప్పట్లో ఆయనపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదైంది. అయితే.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు ఆ కేసును తానే విచారించి, ఆ కేసును క్లోజ్ చేసుకున్నా అడిగిన వారు లేకుండా పోయారు. దీంతో ఈ కేసుపై పునర్విచారణ చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

ఇక ప్రభాకర రావు, రాధాకిషన్ రావు ఆదేశాల మేరకే తాను నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, మిత్రుల ఫోన్లను ట్యాప్ చేసి పూర్తిస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పడు ప్రభాకరరావుకు చేరవేసినట్లు ప్రణీత్ రావు అంగీకరించారు. ఇంతేగాక తమకు వచ్చిన ఆదేశాల మేరకు కొందరు పెద్ద నాయకులు, బడా వ్యాపారుల ఫోన్లనూ తమ బృందం ట్యాప్ చేసిందని ప్రణీత్ రావు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేగాక.. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రణీత్ రావు బృందం కర్ణాటకకు వెళ్లి, జేడీఎస్ అధినేత కుమార స్వామి కోసం పనిచేసిందని విచారణలో తేలింది. ఆ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ నేతల నగదును తరలించే వాహనాల వివరాలను ఎప్పటికప్పుడు కుమారస్వామికి ప్రణీత్ రావు బృందం చేరవేసినట్లు, స్థానిక కీలక ప్రత్యర్థుల ఫోన్లను వీరు ట్యాప్ చేసినట్లు వెల్లడైంది.

Read Also : నగదు తనిఖీలతో సామాన్యుల పరేషాన్

ఎస్‌ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టయిన డీఎస్పీ ప్రణీత్‌రావును విచారిస్తున్న క్రమంలో ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి రావటం, ఆ తర్వాత తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఈ కేసు అనేక కీలక మలుపులు తిరుగుతూ పోతోంది. తాజాగా గతంలో ఎస్‌ఐబీలో పనిచేసి ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ ధనుంజయ్‌‌ను, ఆ తర్వాత వరంగల్‌కు చెందిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను, కొందరు ప్రణీత్‌రావు బ్యాచ్‌మెట్స్‌‌నూ విచారించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు చెందిన నేతలతో బాటు బీఆర్ఎస్ పెద్ద తలకాయలున్నట్లు తెలుస్తోంది.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు