Operation Sindoor 2.O: ఈ ఏడాది మే నెలలో భారత సాయుధ బలగాలు అత్యంత కచ్చితత్వంతో జరిపిన ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) విధ్వంస ఛాయలు దాయాది దేశం పాకిస్థాన్‌ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దాదాపు 8 నెలలు గడుస్తున్నా ఆ భయం నుంచి ఇంకా బయటపడడం లేదు. మరోసారి ఆపరేషన్ సింధూర్ 2.O (Operation Sindoor 2.O) దాడి జరిగితే తట్టుకోలేమని జంకుతోంది. ముఖ్యంగా పాకిస్థాన్ ఆర్మీ అధికారుల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని బహిర్గతం చేసే కీలక పరిణామం తాజాగా చోటుచేసుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (POK) నియంత్రణ రేఖ వెంబడి యాంటీ మిసైల్ సిస్టమ్‌ను పాకిస్థాన్ హుటాహుటిన మోహరించింది. రావలకోట్, కోట్లీ, బింబర్ సెక్టార్లలో సీ-యూఏఎస్‌లను (counter-unmanned aerial systems) మోహరించింది. ఈ మేరకు భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు పక్కా సమాచారం అందింది. నియంత్రణ రేఖ వెంబడి మొత్తం 30 యాంటీ-డ్రోన్ వ్యవస్థలను మోహరించినట్టు సమాచారం.
అకస్మాత్తుగా తీసుకుంటున్న ఈ చర్యల ద్వారా నియంత్రణ రేఖ వెంబడి గగనతల పర్యవేక్షణను బలోపేతం చేసుకోవడం, అదేసమయంలో అత్యాధునికి యుద్ధ సామర్థ్యాలను సంసిద్ధంగా ఉంచుకోవడం పాకిస్థాన్ లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.
డ్రోన్‌లు ఎక్కడెక్కడ మోహరించారు?
నియంత్రణ రేఖ వెంబడి అత్యంత కీలకమైన ప్రాంతాలలో పాకిస్థాన్ ఆర్మీ డ్రోన్‌లను మోహరించింది. సెక్టార్ల వారీగా చూస్తే, ప్రధానంగా రావల్‌కోట్‌లో పెద్ద సంఖ్యలో డ్రోన్‌లను సిద్ధం చేసుకున్నారు. ఈ సెక్టార్ భద్రతను 2వ ఆజాద్ కశ్మీర్ బ్రిగేడ్ చూసుకుంటుంది. ఈ ప్రాంతానికి ఎదురుగా భారత్‌లో పూంచ్ సెక్టార్ ఉంటుంది. అత్యంత కీలకమైన ప్రాంతం కావడంతో పాక్ సైన్యం ఈ చర్యలు తీసుకుంది. ఇక, కొట్లీ సెక్టార్‌ను3వ ఆజాద్ కశ్మీర్ బ్రిగేడ్ చూసుకుంటోంది. ఈ సెక్టార్‌కు ఎదురుగా భారత్‌లో రాజౌరి, పూంచ్, నౌషీరా, సుందర్‌బనీ ప్రాంతాలు ఉన్నాయి. భింబర్ సెక్టార్‌ను 7వ ఆజాద్ కశ్మీర్ బ్రిగేడ్ చూసుకుంటున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించారు. భారత్ దెబ్బకి యాంటీ-మిసైల్ సిస్టమ్‌తలో పాటు ఎలక్ట్రానిక్, కైనెటిక్ సామర్థ్యాలతో కూడిన ఆయుధ వ్యవస్థలను కూడా మోహరించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి.
ఈ వ్యవస్థలు ఏం చేస్తాయి?
పాకిస్థాన్ మోహరించిన సీ-యూఏఎస్ సిస్టమ్‌ను రేడియో-ఫ్రీక్వెన్సీ గుర్తింపు కోసం ఉపయోగిస్తారు. అంతేకాదు, దిశను గుర్తించే టెక్నిక్స్ ఇందులో ఉంటాయి. 10 కిలోమీటర్ల దూరంలో విచ్ఛిన్నమయ్యే చిన్న భాగాలతోపాటు పెద్ద డ్రోన్‌లను కూడా గుర్తించగలుగుతుంది. ఇక, యాంటీ-యూఏఈవీ జామింగ్ గన్‌ను సులభంగా చేతులతో మోసుకెళ్లవచ్చు. భుజాల మీద పెట్టుకొని 1.5 కిలోమీటర్ల దూరం వరకు ఫైరింగ్ చేయవచ్చు. డ్రోన్ కంట్రోల్, వీడియో, జీపీఎస్ లింకుల్లో అవాంతరాలను సృష్టించేందుకు వీటిని వాడుతుంటారు.
Read Also- Kamareddy district: భార్యపై వేధింపులు.. కామాంధుడ్ని చెప్పుతో కొడుతూ.. రోడ్డుపై ఊరేగించిన భర్త

