Kamareddy district: భార్య, భర్తల అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. కష్ట సుఖాల్లో అండగా ఉంటానని.. ఏ కష్టం రానివ్వకుండా అడ్డంగా నిలబడతానని తాళి కట్టే సమయంలోనే భర్త ప్రమాణం చేస్తాడు. ఇందుకు తగ్గట్లే జీవిత భాగస్వామికి ఎలాంటి కష్టం రానివ్వకుండా చూసుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటాడు. అలాంటిది భార్యను ఎవరైనా వేధింపులకు గురిచేస్తే ఆ భర్త ఎలా మారిపోతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా కామారెడ్డి జిల్లాలో దీనికి అద్దం పట్టే ఘటన జరిగింది. భార్యను వేధించిన లోకల్ పొలిటికల్ లీడర్ ను ఓ భర్త చావగొట్టాడు. రోడ్డుపై కొట్టుకుంటూ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లాడు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. కామాంధుడ్ని బాధితురాలి భర్త రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్తున దృశ్యాలు స్థానికంగా కలకలం రేపాయి. ఓ వివాహితను దేవేందర్ రెడ్డి అనే రాజకీయ నాయకుడు గత కొద్దిరోజులుగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. నెలరోజుల పాటు మహిళను టార్చర్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని భర్తకు చెప్పుకొని బాధితురాలు ఎంతగానో బాధపడింది. దీంతో కోపంతో రగిలిపోయిన భర్త.. భార్యను వేధిస్తుండగా దేవేందర్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. నడిరోడ్డుపై చెప్పుతో కొడుతూ దేహశుద్ది చేశాడు.
Also Read: Hyderabad Crime: పిల్లల ముందే ఘోరం.. భార్యకు నిప్పంటించిన భర్త.. అడ్డొచ్చిన కూతుర్ని సైతం..
తన భార్యకు ఎదురైన పరిస్థితి మరో స్త్రీకి జరగకూడదంటూ కామాంధుడ్ని నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే చితకబాదాడు. కాలర్ పట్టుకొని రోడ్డుపై లాక్కెళ్లాడు. చెప్పుతో ముఖంపై పదే పదే కొడుతూ తన భార్యను వేధించినదానికి గట్టి గుణపాఠం చెప్పాడు. భర్తతో పాటు అతడి బంధువు సైతం దేవేందర్ రెడ్డిపై దాడి చేయడం వీడియోలో గమనించవచ్చు. తొలుత ఏం జరిగిందో తెలియక స్థానికులు సైతం గందరగోళానికి గురయ్యారు. తీరా అసలు విషయం తెలిసుకొని భర్త చేసిన పనిని సమర్థించారు. నడిరోడ్డుపై దేహశుద్ది అనంతరం దేవేందర్ రెడ్డిని బాధితురాలి భర్త పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రాజకీయ నాయకుడి లైంగిక వేధింపులు
ఓ వివాహితని లైంగికంగా వేధిస్తున్న దేవేందర్ రెడ్డి
నెలరోజులుగా మహిళను టార్చర్ చేస్తున్న దేవేందర్ రెడ్డి
వేధింపులపై భర్తకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
మహిళను వేధిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త… pic.twitter.com/bl5S3zxCYJ
— BIG TV Breaking News (@bigtvtelugu) December 26, 2025

