Hyderabad Crime: హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై పెట్రోల్ పోసి హతమార్చాడో భర్త. అడ్డుకున్న కూతుర్ని సైతం ఆ మంటల్లోకి హత్యాయత్నం చేశాడు. నల్లకుంట ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితుల అరుపులు విన్న స్థానికులు హుటాహుటీన వచ్చి మంటల్లో చిక్కుకున్న తల్లి, కూతుర్ని రక్షించే ప్రయత్నం చేశారు. గాయపడ్డ ఇరువురిని హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.
అసలేం జరిగిందంటే?
నల్గొండ జిల్లా హుజూరాబాద్ కి చెందిన వెంకటేష్, త్రివేణి భార్య భర్తలు. వారికి ఇద్దరు పిల్లలు, ఒక కూతురు ఉంది. హైదరాబాద్ లోని నల్లకుంట ప్రాంతంలో జీవిస్తున్న వెంకటేష్, త్రివేణి కాపురంలో గత కొన్ని రోజులుగా తరుచూ గొడవలు జరుగుతున్నాయి. భార్యకు ఎవరితోనే అక్రమ సంబంధం ఉందని అనుమానిస్తూ భర్త వెంకటేష్ వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల పెద్ద గొడవ జరగడంతో త్రివేణి పుట్టింటికి సైతం వెళ్లింది. అయితే తాను మారిపోయానంటూ బతిమాలి మరి వెంకటేష్ తిరిగి ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు.
Also Read: BC Reservations: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీల ట్విస్ట్.. పెద్ద ప్లాన్ వేశారు..?
బిడ్డల కళ్ల ముందే ఘాతుకం
హైదరాబాద్ కు వచ్చిన కొద్దిరోజులు బాగానే ఉన్న వెంకటేష్.. ఆ తర్వాత తిరిగి వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు భార్య భర్తల మధ్య పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన వెంకటేష్.. కన్న బిడ్డల ముందే భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన కూతుర్ని సైతం ఆ మంటల్లోకి నెట్టివేశాడు. దీంతో బాధితుల ఆర్తనాదాలు విని స్థానికులు పరిగెత్తుకు రాగా.. వెంకటేష్ భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. అయితే భార్య అప్పటికే మృతి చెందగా.. కూతురు స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై కోసు నమోదు చేసిన పోలీసులు.. వెంకటేష్ గంటల వ్యవధిలోనే వెంకటేష్ ను అరెస్టు చేశారు.
హైదరాబాద్ లోని నల్లకుంటలో దారుణం
అనుమానంతో భార్యని దారుణంగా హత్య చేసిన భర్త
ఇంట్లో పిల్లల ముందే భార్యపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త వెంకటేష్
అడ్డుకున్న కూతుర్ని మంటల్లో తోసేసి పరారైన వెంకటేష్
భార్య అక్కడికక్కడే మృతి, స్వల్ప గాయాలతో బయటపడిన కూతురు
ప్రేమించి… pic.twitter.com/hr1yPmXfDR
— BIG TV Breaking News (@bigtvtelugu) December 26, 2025

