Champion Movie: కలెక్షన్ల ‘ఛాంపియన్’ మొదటి రోజు గ్రాస్ ఎంతంటే
champion-collection
ఎంటర్‌టైన్‌మెంట్

Champion Movie: కలెక్షన్ల ‘ఛాంపియన్’ మొదటి రోజు గ్రాస్ ఎంతో తెలిపిన నిర్మాతలు.. ఇది మామూలుగా లేదుగా..

Champion Movie: ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మించిన తాజా చిత్రం ‘ఛాంపియన్’ (Champion) బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఆరంభాన్ని అందుకుంది. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం, విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ‘పీపుల్స్ ఛాంపియన్’గా నీరాజనాలు అందుకుంటోంది. చాలా కాలం తర్వాత ఒక పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వైజయంతీ మూవీస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ నుంచి వచ్చిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను అందుకుంటూ, డే-1 కలెక్షన్లలో రోషన్ కెరీర్‌లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.

Read also-Dhurandhar Boxoffice: బాక్సాఫీస్ వద్ద ‘దురంధర్’ సునామీ.. రూ. వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన రణవీర్ సింగ్

‘ఛాంపియన్’ కేవలం ఆట గురించి మాత్రమే కాదు, ఆత్మాభిమానం మరియు పోరాటం గురించి కూడా చెబుతుంది. 1940ల నాటి హైదరాబాద్ సంస్థాన నేపథ్యంలో సాగే ఈ కథలో మైఖేల్ విలియమ్స్ (రోషన్) అనే యువ ఫుట్‌బాల్ క్రీడాకారుడి ప్రయాణాన్ని దర్శకుడు ప్రదీప్ అద్వైతం అద్భుతంగా ఆవిష్కరించారు. 1948 నాటి భైరాన్‌పల్లి వీరోచిత పోరాటాన్ని ఈ కథలో ప్రధానాంశంగా తీసుకున్నారు. నిజాం రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా సాగే ఈ పోరాటం ప్రేక్షకులను ఉద్వేగానికి గురిచేస్తోంది. తన సొంత కలల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే ఒక యువకుడు, తన ఊరి ప్రజల కష్టాలను చూసి ఎలా మారాడు? తన ఆటతో శత్రువులకు ఎలా సమాధానం చెప్పాడు? అనేది సినిమాలోని అసలు ట్విస్ట్. ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Read also-RajaSaab Pre Release: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా?.. ఎప్పుడంటే?

ఈ సినిమాలో రోషన్ తన నటనతో స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఫుట్‌బాల్ ఆడే సన్నివేశాల్లో మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లలో రోషన్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రకళ పాత్రలో అనస్వరా రాజన్ అభినయం సహజంగా ఉంది. తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. తోట తరణి ఆర్ట్ వర్క్ సినిమాకు 1948 నాటి వాతావరణాన్ని అద్భుతంగా తీసుకొచ్చింది. దుల్కర్ సల్మాన్ పోషించిన అతిథి పాత్ర సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ గతంలో ‘మహానటి’, ‘సీతారామం’ వంటి క్లాసిక్స్‌ను అందించినట్టే, ఇప్పుడు ‘ఛాంపియన్’తో మరో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నట్లు కనిపిస్తోంది. చరిత్రను, క్రీడను మేళవించి తీసిన ఈ చిత్రం యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ ‘ఛాంపియన్’ ప్రస్థానం లాంగ్ రన్ కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Just In

01

Udaipur Incident: కదిలే కారులో మేనేజర్‌పై అదే కంపెనీ సీఈవో, ఎగ్జిక్యూటివ్ హెడ్ కలిసి అత్యాచారం

KTR and Kavitha: కవిత మాటలకు కేటీఆర్ కౌంటరా? మౌనమా? నాగర్‌కర్నూల్లో అన్నాచెల్లెళ్ల రాజకీయ పోరుబాట!

Phone Tapping Case: నా ఫోన్లు ట్యాప్ చేశారు.. సిట్‌కు మెుత్తం చెప్పేసా.. సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్

KP Vivekanand: పాలమూరు ప్రాజెక్టుకు రెండేళ్లలో ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద!

Operation Sindoor 2.O: పాకిస్థాన్‌‌లో ‘ఆపరేషన్ సింధూర్ 2.O’ భయాలు.. సరిహద్దులో కీలక పరిణామం