ప్రభాస్ ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా?
rajasab-pre-release(X)
ఎంటర్‌టైన్‌మెంట్

RajaSaab Pre Release: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా?.. ఎప్పుడంటే?

RajaSaab Pre Release: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వస్తున్న భారీ హారర్-కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab). సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్లను పీక్స్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తోంది. తర్వాత విడుదలైన రెండు పాటలు చాట్ బాస్టర్లుగా నిలిచాయి. ఈ ఉత్సాహంతో ఉన్న మూవీ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేందుకు సిద్ధమైంది.

Read also-Bigg Boss9: ‘ఇమ్మూన్యుల్ ఒక వెదవ.. ఎంత చెప్పినా వినలేదు’.. తనూజ షాకింగ్ కామెంట్స్

ఖైత్లాపూర్ మైదానంలో భారీ ఏర్పాట్లు

హైదరాబాద్‌లోని ఖైత్లాపూర్ (Khaitlapur) మైదానం ఈ నెలాఖరున ప్రభాస్ అభిమానుల సందడితో హోరెత్తిపోనుంది. డిసెంబర్ 27 (శనివారం) సాయంత్రం జరగనున్న ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం నిర్వాహకులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో పెద్ద సినిమాల ఈవెంట్లు ఎల్‌బీ స్టేడియంలో జరిగేవి, కానీ ఫ్యాన్స్ తాకిడిని దృష్టిలో ఉంచుకుని, అందరికీ అనుకూలంగా ఉండేలా కూకట్‌పల్లి సమీపంలోని విశాలమైన ఖైత్లాపూర్ గ్రౌండ్స్‌ను మేకర్స్ ఎంచుకున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ నేరుగా స్టేజ్ మీద అభిమానులను పలకరించనుండటంతో ఈ ఈవెంట్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ వేడుకలోనే సినిమాకు సంబంధించిన మరో అదిరిపోయే ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఎస్.ఎస్. తమన్ నేతృత్వంలో లైవ్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ ఉండబోతోంది. ఇప్పటికే విడుదలైన ‘సహానా సహానా’ వంటి పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.

Read also-Duvvada Couple: శివాజీ మాటల రచ్చలోకి ‘దువ్వాడ’ జంట.. సపోర్ట్ ఎవరికంటే?

మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ ముగ్గురు హీరోయిన్లు ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నారు. టాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర దర్శకులు, నిర్మాతలు ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మెగాస్టార్ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరవుతారని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లోనే ఒక డిఫరెంట్ అటెంప్ట్. వింటేజ్ లుక్‌లో ప్రభాస్ మెప్పించబోతున్నారు. జనవరి 9న థియేటర్లలోకి వచ్చేముందు, డిసెంబర్ 27న జరిగే ఈ వేడుక సినిమా హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే సెలబ్రెటీల భద్రతా విషయంలో వివాదాల నెలకోన్న నేపధ్యంలో కట్టదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రభాస్ అభిమానలు భారీ అంచానలు పెట్టుకున్నారు. మెగాస్టార్ ముఖ్య అతిథిగా శస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Just In

01

Anasuya Viral Post: మిస్ అవుతున్నా.. స్విమ్ సూట్‌ వీడియో పెట్టి మరీ ట్రోలర్స్‌కు షాకిచ్చిన అనసూయ

Sankranti Holidays: గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు ఖరారు.. ఏకంగా 9 రోజులు హాలీడే

Director Teja: పాప్‌కార్న్ ధరలకు ప్రేక్షకుడు పరేషాన్.. దర్శకుడు తేజ ఏం అన్నారంటే?

Suside Crime: దారుణం.. ఓటు వేయలేదని తిట్టడంతో ఓ యువకుడు ఆత్మహత్య!

Sanjana Journey: గౌరవం కోసమే బిగ్ బాస్9లో టాప్ 5 వరకూ వచ్చానంటున్న సంజన.. ఆ నింద ఏంటంటే?