Gig Workers: దేశవ్యాప్తంగా గిగ్, ప్లాట్‌ఫార్మ్ కార్మికులకు అధికారిక గుర్తింపు, పోర్టబుల్ సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు, అలాగే జాతీయ స్థాయి రిజిస్ట్రేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను కల్పించేందుకు ఉద్దేశించిన కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, 2020 నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ నిబంధనలు కొత్త లేబర్ కోడ్‌ల అమలులో కీలక పాత్ర వహించనున్నాయి.
ప్రభుత్వ ప్రకటన ప్రకారం, సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద అగ్రిగేటర్లు తమ వార్షిక టర్నోవర్‌లో 1–2 శాతం నిధిని సోషల్ సెక్యూరిటీ ఫండ్‌కు కేటాయించాలి, అయితే ఈ మొత్తం గిగ్, ప్లాట్‌ఫార్మ్ వర్కర్లకు చేసే చెల్లింపుల 5 శాతాన్ని మించకూడదు. ఈ నిధితో ఈ వర్గాల కార్మికుల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేయబడతాయి.
Also Read: Chiranjeevi: గ్లోబల్ సమ్మిట్‌కు పిలవడానికి మంత్రులు వచ్చినప్పుడు నేను ఏ పొజిషన్‌లో ఉన్నానో తెలుసా?
ఇంతకుముందు, గిగ్ వర్కర్లు తమపై వచ్చే అన్ని రిస్కులను స్వయంగా భరించేవారు. అగ్రిగేటర్లు వారి సంక్షేమానికి భాగస్వామ్యం కావాల్సిన బాధ్యత లేకపోవడంతో వారు పూర్తిగా రక్షణలేని పరిస్థితిలో ఉండేవారు. కొత్త నిబంధనలు ఈ పరిస్థితిని పూర్తిగా మార్చనున్నాయి. సోషల్ సెక్యూరిటీ చర్యల ద్వారా పోర్టబుల్ రైట్స్, వెల్ఫేర్ స్కీమ్స్, సురక్షిత జీవనోపాధి లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
ఈ కొత్త కోడ్‌ల ప్రకారం గిగ్, ప్లాట్‌ఫార్మ్ వర్కర్లకు ప్రభుత్వం ప్రకటించే భీమా, ఆరోగ్య ప్రయోజనాలు, వంటి పలు సౌకర్యాల కోసం అర్హత లభిస్తుంది. కార్మికులు ఈ-శ్రమ పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాలని, అక్కడ వారికి ఆధార్-లింక్ చేసిన ప్రత్యేక ఐడి జారీ అవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ఐడి తో వర్కర్ ప్లాట్‌ఫార్మ్ మార్చినా, ఉద్యోగం మార్చినా వారి సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు కొనసాగుతాయి. గిగ్, ప్లాట్‌ఫార్మ్ కార్మికులు స్వయంగా ఈ-శ్రమ పోర్టల్‌లో రిజిస్టర్ అయ్యి జాతీయ డేటాబేస్‌లో భాగమవుతారు. ఇది వారి సోషల్ సెక్యూరిటీ, స్కిల్ డెవలప్‌మెంట్, టార్గెటెడ్ వెల్ఫేర్ డెలివరీకు మద్దతు ఇస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
అదనంగా, కొత్త లేబర్ కోడ్‌లు అగ్రిగేటర్, గిగ్ వర్కర్, ప్లాట్‌ఫార్మ్ వర్కర్, ప్లాట్‌ఫార్మ్ వర్క్ లాంటి కీలక పదాలకు స్పష్టమైన నిర్వచనాలు ఇవ్వడం ద్వారా ఈ వర్గాలను చట్టపరమైన రక్షణ పరిధిలోకి తీసుకువస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు లేబర్ లా పరిధికి బయట ఉన్న గిగ్ వర్కర్లు formal grievance redressal mechanisms కు చేరుకోగలుగుతారు. ప్రభుత్వం త్వరలో టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్, కాల్స్ సెంటర్, లేదా ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందని అధికారిక ప్రకటనలో తెలిపారు.

