Chiranjeevi: మంత్రులు వచ్చినప్పుడు అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నా
Chiranjeevi (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Chiranjeevi: గ్లోబల్ సమ్మిట్‌కు పిలవడానికి మంత్రులు వచ్చినప్పుడు నేను ఏ పొజిషన్‌లో ఉన్నానో తెలుసా?

Chiranjeevi: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 (Telangana Rising Global Summit 2025) ముగింపు వేడుకకు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇస్తున్న ప్రాముఖ్యతను ఆయన ఎంతగానో కొనియాడారు. ఎంటర్‌టైన్‌మెంట్ రంగం విషయంలో ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా చేసేందుకు తాను కూడా కృషి చేస్తానని ఈ కార్యక్రమంలో ఆయన తెలిపారు. ఆయన స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతుంటే.. ఆహుతులందరూ అలానే చూస్తుండి పోయారు. ప్రస్తుతం చిరంజీవి స్పీచ్‌కు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డ్యాన్స్ చేస్తున్నా..

ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఈ వేడుకకు వచ్చినందుకు చాలా గౌరవంగా భావిస్తున్నాను. వాస్తవానికి సోమవారం నన్ను ఈ వేడుకకు ఆహ్వానించడానికి వచ్చినప్పుడు నేను ఏ పొజిషన్‌లో ఉన్నానంటే.. ఎవరో అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నాను. గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి చిరంజీవి ఎలాగైనా రావాలని, సీఎం రేవంత్ రెడ్డి నా దగ్గరికి మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబును పంపించారు. ఆ సమయంలో నేను అన్నపూర్ణ స్టూడియోలో అమ్మాయితో డాన్స్ చేస్తున్నాను (నవ్వుకుంటూ..). వెంటనే షూటింగ్ ఆపేసి వారిని కూర్చోబెట్టుకుని మాట్లాడాను. నన్ను ఒక్కడినే పిలిచారని నేను అనుకోవడం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ తరపున ఒక ఏజెంట్‌గా నేను ఇక్కడకు వచ్చాను. ఇక్కడకు వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీపై ఎంతో గౌరవం ఉంది. ఇలాంటి వేదికను సెట్ చేసి, అందులో కూడా సినిమా రంగానికి ప్రాముఖ్యత ఇవ్వడమనేది చాలా గొప్ప విషయం.

Also Read- Akhanda 2: ఎట్టకేలకు ‘అఖండ 2’ విడుదల తేదీ చెప్పిన మేకర్స్.. రిలీజ్ ఎప్పుడంటే?

హ్యాట్సాఫ్ సీఎం రేవంత్ రెడ్డి..

ఆయన సీఎం అయిన తర్వాత అభినందించడానికి వారి దగ్గరకు వెళ్లాను. అప్పుడొక మాట అన్నారు. ‘హైదరాబాద్‌ను ఫిల్మ్‌ హబ్‌గా చేయాలని అనుకుంటున్నాను. ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీ వరకే కాదు.. గ్లోబల్‌గా సినిమా ఇండస్ట్రీల నుంచి ఇక్కడకు వచ్చి షూటింగ్స్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి. ఎంకరేజ్‌మెంట్ ఉంది.. అది నా ధ్యేయం’ అని అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఇది అయ్యే పనేనా? అని అప్పుడు అనిపించింది. మీరు ఏమైనా చేయండి. మీ గైడెన్స్‌లో ఏం చేయడానికైనా సిద్ధం అని ఒక మాట అన్నాను కానీ, చాలా తక్కువ సమయంలో సినిమా ఇండస్ట్రీపై ఆయనకున్న నిబద్దత, ఇలాంటి స్టేజ్‌పై సినిమాకు ఆయన కల్పించిన ప్రాధాన్యత.. ఇవన్నీ చూసిన తర్వాత.. హ్యాట్సాఫ్ చెబుతున్నాను. నిజంగా ఆయనకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన చెప్పడమే కాకుండా.. చేసి చూపించారు. తప్పకుండా ఆయన అనుకున్నది సాధిస్తారనే నమ్మకం నాకు కలిగింది. ఇక్కడ మనకు ఎన్నో వనరులు ఉన్నాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ చేయగలిగితే కనుక సినిమా పరిశ్రమలో ఎంతో మందికి పని దొరుకుతుంది. దానిని ఎవరూ పట్టించుకోలేదన్న మాట వాస్తవం.. దానిని నేను అంగీకరిస్తున్నాను.

Also Read- Ustaad Bhagat Singh: ‘స్టెప్ ఏస్తే భూకంపం’.. దేఖ్‌లేంగే సాలా సాంగ్ ప్రోమో అదిరింది

నేను కూడా భరోసా ఇస్తున్నా..

సినిమా ఇండస్ట్రీ నిమిత్తం త్వరలో కొన్ని సెమినార్స్ నిర్వహిస్తామని అన్నారు. మేమందరం కూడా ఇందులో భాగమవుతాం. ప్రపంచానికే అద్భుతమైనటువంటి సినిమా హబ్‌గా హైదరాబాద్‌ని చేయడంలో మేమందం ముందుంటాము. బాలీవుడ్ నుంచి సల్మాన్‌ఖాన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌లాంటి వారు ఇక్కడ అడ్వాన్స్‌డ్, ఫ్యూచరిస్టిక్ స్టూడియోలు నిర్మిస్తామనేది శుభారంభం. దీనిని మేం స్ఫూర్తిగా తీసుకుని, మేము కూడా భాగమవుతాం. ఈ రోజున ప్రపంచపరంగా చూస్తే సినిమా ప్రభావం ఎంత ఉంటుందనేది నేషనల్ వైడ్‌గా కేంద్ర ప్రభుత్వం కూడా అంచనా వేస్తుంది. అందులో మమ్మల్ని కూడా భాగస్తులని చేశారు. కొరియాలో యువత వ్యసనాల బారిన పడకుండా.. వారిని ఎంటర్‌టైన్‌మెంట్‌కు దగ్గర చేసింది అక్కడి ప్రభుత్వం. జపాన్‌ ప్రభుత్వం కూడా యానిమేషన్‌ విషయంలో చొరవ చూపిస్తుంది. గ్లోబల్‌ రేంజ్‌లో సినిమా ఇండస్ట్రీలు హైదరాబాద్ వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాలని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇస్తోంది. నేను కూడా భరోసా ఇస్తున్నాను. నా వంతు కృషి నేను చేస్తాను’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?