Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్ అంటే సినీ అభిమానులకు ఒక మాస్ ఫీస్ట్. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) సృష్టించిన సంచలనం దృష్ట్యా, తాజాగా రూపొందుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ అంచనాలను మరింత పెంచుతూ, మేకర్స్ తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా, ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘దేఖ్‌లేంగే సాలా’ సాంగ్ ప్రోమోను (Dekhlenge Saala Song Promo) విడుదల చేశారు. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ ప్రోమో యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోవడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ని స్పష్టం చేసింది. కేవలం 26 సెకన్ల నిడివి గల ఈ ప్రోమో.. పవన్ కళ్యాణ్ అభిమానులను, మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ‘స్టెప్ ఏస్తే భూకంపం’ అన్నట్లుగా పవన్ కళ్యాణ్ వేసిన డ్యాన్స్ స్టెప్పులు, ఆయన ఎనర్జీ ఈ పాటను థియేటర్లలో ఏ స్థాయిలో అలరిస్తుందో చెప్పకనే చెప్పాయి.
స్టెప్పేస్తే భూకంపమే..
ఇప్పటికే వచ్చిన ఫైర్ బ్రాండ్ పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కళ్యాణ్ లుక్, ఎనర్జిటిక్ బాడీ లాంగ్వేజ్ మాస్ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్‌లోని రెండవ యాంగిల్‌ని పరిచయం చేశారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ ప్రోమోకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్‌కు, దేవిశ్రీ ప్రసాద్‌కు ఉన్న విజయవంతమైన ట్రాక్ రికార్డుకు తగినట్లుగానే ఈ పాట పక్కా మాస్ బీట్‌తో ఉండబోతోందని ప్రోమో స్పష్టం చేసింది. సాంగ్ లిరికల్ జస్టిస్ గురించి పూర్తి సమాచారం తెలియాలంటే డిసెంబర్ 13న విడుదల కాబోతున్న ఫుల్ సాంగ్ కోసం వేచి చూడాల్సిందే. ‘రంపంపం రంపంపం.. స్టెప్పేస్తే భూకంపం’ అనే పదాలతో పాటు పవన్ కళ్యాణ్ డ్యాన్స్ మూవ్ రెండింటిని మాత్రమే ఈ ప్రోమోలో పరిచయం చేశారు. అవే ఇప్పుడీ వీడియోను వైరల్ చేస్తున్నాయి. ఫుల్ సాంగ్ వస్తే.. సోషల్ మీడియా షేకవడం తధ్యం.
Also Read- Jayasudha: అప్పుడే ఎవరికీ తలవంచలేదు.. పవన్ కళ్యాణ్‌పై జయసుధ సంచలన కామెంట్స్!
మాస్, యాక్షన్ ప్రియులకు ట్రీట్..
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. వీరితో పాటు పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, ఎల్ బి శ్రీరామ్, రాంకీ, ప్రభాస్ శ్రీను వంటి సీనియర్ నటీనటులు ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. నిర్మాతలు హామీ ఇచ్చినట్లుగా, ఈ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులు, యాక్షన్ ప్రియులు మెచ్చే విధంగా రూపొందుతున్నట్లుగా ఈ ప్రోమో చెప్పకనే చెప్పింది. ఫుల్ సాంగ్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను ఏప్రిల్ 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

