Bihar Election 2025: బీహార్‌లో కొలిక్కి వచ్చిన ఎన్డీయే సీట్ల సర్దుబాటు
Bhihar-Elections
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Bihar Election 2025: బీహార్‌లో కొలిక్కి వచ్చిన ఎన్డీయే సీట్ల సర్దుబాటు.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే?

Bihar Election 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Election 2025) ఎన్డీయే కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకంపై స్పష్టత వచ్చింది. కొన్ని వారాలపాటు కొనసాగిన చర్చల తర్వాత ఆదివారం ఒప్పందం కుదిరింది. కూటమిలో కీలక భాగస్వాములైన బీజేపీ, సీఎం నితీష్ కుమార్ సారధ్యంలోని జనతా దళ్ (యునైటెడ్) పార్టీలు చెరొక్క 101 సీట్లలో పోటీ చేయనున్నాయి. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉండగా, మిగిలిన 41 సీట్లను ఇతర చిన్నపార్టీలకు కేటాయించారు. ఉపేంద్ర కుష్వాహా నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM), జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ అవామ్ మోర్చా (HAM) పార్టీలకు చెరో 6 సీట్ల చొప్పున కేటాయించారు. కాగా, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి (రామ్ విలాస్) 29 సీట్లు కేటాయించారు. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత ధర్మేంద్ర ప్రధాన్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా ఆయన వ్యవహారిస్తున్నారు.

Read Also- Maoist Posters: వడ్డీ వ్యాపారులారా ఖబర్దార్?.. భద్రాచలంలో మావోల పోస్టర్లు కలకలం

సీట్ల పంపకంపై కూటమి పార్టీల ఈ ఒప్పందం కుదరడానికి చాలా సమయం పట్టింది. చిరాగ్ పాశ్వాన్ సారధ్యంలోని లోక్ జనశక్తి పార్టీ తొలుత 40-45 సీట్లు కావాలంటూ పట్టుబట్టడం ఇందుకు కారణమైంది. అయితే, బీజేపీ మాత్రం 25 సీట్ల కంటే ఎక్కువ ఇచ్చేందుకు తొలుత సముఖత తెలపలేదు. వివిధ స్థాయిల్లో చర్చలు జరిగిన తర్వాత ఆదివారం ఒప్పందం ఖరారైంది. ధర్మేంద్ర ప్రధాన్‌తో పలు దఫాల సమావేశాలు నిర్వహించిన తర్వాత ఈ క్లారిటీ వచ్చింది. 40-45 సీట్లు కావాలని చిరాగ్ పాశ్వాన్ పట్టుబట్టినప్పటికీ, చివరకు మనసు మార్చుకొని 29 సీట్లకు అంగీకరించారు. అయితే, 29 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ, జేడీయూ పార్టీలు కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది.

Read Also- Love Betrayal: ప్రేమ పేరుతో ప్రియుడి వంచన… ప్రేయసి ఏం చేసిందంటే

బీజేపీ, జేడీయూ సీట్లు తగ్గాయ్

2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 115 సీట్లలో, బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేశాయి. అయితే, ఈసారి మాత్రం ఈ రెండు పార్టీ 101 సీట్లకే పరిమితమయ్యాయి. ఎక్కువ సీట్లు కావాలంటే ఎల్‌జేపీ పార్టీ గట్టిగా పట్టుబట్టడం ఈ పరిస్థితికి కారణమైంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తన పార్టీ 5 సీట్లు గెలుచుకుందని, 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గణనీయమైన స్థానాల్లో పోటీ చేశామని, తమ పార్టీకి సీట్లు తక్కువ ఇస్తే ఎలా అని చిరాగ్ పాశ్వాన్ పట్టుబట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల్ల పోటీ చేసిన 5 స్థానాలను దక్కించుకొని 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించామన్నారు. అందుకే, ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో కనీసం రెండు అసెంబ్లీ సీట్లు కావాలని ఆయన పట్టుబట్టారు. పార్టీ సీనియర్ నాయకులకు సీట్లు కూడా అడిగారు. దీంతో, ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు విషయంలో ఆలస్యం జరిగింది.

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు