Mathura Bus Fire: ఢిల్లీ–ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేలో ఘోర ప్రమాదం
Mathura Bus Fire ( Image Source: Canva)
జాతీయం

Mathura Bus Fire: బిగ్ బ్రేకింగ్.. ఢిల్లీ–ఆగ్రా హైవేపై బస్సు ప్రమాదం.. నలుగురు మృతి

Mathura Bus Fire: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురా జిల్లాలో ఢిల్లీ–ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం ఉదయం 4 గంటల సమయంలో చోటుచేసుకోగా, మూడు కార్లు , ఏడు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడు బస్సుల్లో ఆరు స్లీపర్ బస్సులు కాగా, ఒకటి రోడ్వేస్ బస్సుగా అధికారులు తెలిపారు.

మథురా గ్రామీణ ఎస్పీ సురేష్ చంద్ర రావత్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదం అనంతరం అన్ని బస్సులు మంటల్లో చిక్కుకున్నాయి. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీసినట్లు ఆయన తెలిపారు. “రక్షణ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది,” అని ఎస్పీ వెల్లడించారు.

Also Read: Ponguleti Srinivasa Reddy: హౌసింగ్ బోర్డు భూముల ప‌రిర‌క్షణ‌కు ప‌టిష్ట చ‌ర్యలు తీసుకోవాలి : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి!

సీఎం యోగి ఆదేశాలు

ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే స్పందించారు. ఘటనాస్థలికి అధికారులు, సహాయక బృందాలను పంపించి రక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని, మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని సీఎం ఆదేశించినట్లు మథురా జిల్లా కలెక్టర్ చంద్ర ప్రకాష్ సింగ్ తెలిపారు.

Also Read: MyGHMC App: ‘మై జీహెచ్ఎంసీ’ యాప్‌లో చక్కటి ఫీచర్.. మీ చుట్టూ ఉన్న సౌకర్యాలు ఇట్టే తెలుసుకోవచ్చు

అగ్నిమాపక చర్యలు

ప్రమాదం జరిగిన వెంటనే 11 అగ్నిమాపక వాహనాలను ఘటనాస్థలికి తరలించారు. బస్సులన్నింటిలో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు.

Also Read: BRS Water Politics: నీటి వాటా కోసం బీఆర్ఎస్ మరో ఉద్యమానికి సన్నాహాలు.. త్వరలో కేసీఆర్ ప్రకటన చేసే ఛాన్స్..!

Just In

01

CM Revanth Reddy: యంగ్ ఇండియా స్కూల్స్.. రూ.30 వేల కోట్ల వ్య‌యం.. కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం కీలక భేటి

Rowdy Janardhan: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ.. టీజర్ ఎప్పుడంటే?

Hyderabad Crime: పహాడీషరీఫ్‌లో మైనర్‌పై అత్యాచారం.. బాలిక ఫిర్యాదుతో వెలుగులోకి!

India Mexico Trade: టారిఫ్ పెంపులకు కౌంటర్‌గా మెక్సికోతో పరిమిత వాణిజ్య ఒప్పందం దిశగా భారత్ అడుగులు

Hyderabad Crime: భర్తతో గొడవ.. ఏడేళ్ల కూతుర్ని హత్య చేసిన కన్నతల్లి