Gambhira Bridge: గుజరాత్ ప్రమాదాలకు నెలవుగా మారింది. రెండ్రోజులకో సారి ఘోరాలు.. మూడ్రోజులకోసారి వంతెనలు కూలడాలు షరా మామూలైపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం కావడంతో ‘మోదీజీ.. ఏ క్యా హై’ అంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన ప్రమాదాల నుంచి రాష్ట్ర ప్రజలు తేరుకోకమునుపే బుధవారం ఉదయం మరో ఘోర ఘటన చోటుచేసుకున్నది. ఇవాళ ఉదయం వడోదర, ఆనంద్ జిల్లాలను కలిపే గంభీర బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో నాలుగు వాహనాలు మహిసాగర్ నదిలో పడిపోయాయి. పద్ర తాలూకాలోని ముజ్‌పూర్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రమాదంలో ఇద్దరు మరణించగా, నదిలో పడిన ముగ్గురిని రెస్క్యూ సిబ్బంది కాపాడింది. ముగ్గురి పరిస్థితి నిలకడగానే ఉన్నది. నదిలో ఇంకా ఎంతమంది చిక్కుకుపోయారు? మొత్తం ఎన్ని వాహనాలు నదిలో పడ్డాయి? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. కాగా, బ్రిడ్జిపై నుంచి రెండు ట్రక్కులు, పికప్ వ్యాన్, బోలెరో ఎస్‌యూవీ, మోటార్ సైకిల్ నదిలో పడిపోయాయి. షాకింగ్ విషయమేమిటంటే.. ఓ భారీ ట్రక్కు వంతెన అంచు నుంచి ప్రమాదకరంగా వేలాడుతోంది. ఆ ట్రక్కు నదిలో పడితే కిందున్న మనుషులు బతకడం కష్టమేనని, వాహనాలు కూడా నుజ్జునుజ్జు కావొచ్చని స్థానికులు చెబుతున్నారు.
Read Also- Congress: తెలంగాణ కాంగ్రెస్‌కు కేవీపీ అవసరమా.. హాట్ టాపిక్‌గా మారిన ఎపిసోడ్!
ప్రమాదం ఎలా..?
స్థానిక సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. కాగా, వడోదర, ఆనంద్, భరూచ్, అంక్లేశ్వర్‌లను కలిపే ఈ గంభీర బ్రిడ్జి ఒక కీలకమైన మార్గంగా ఉండేది. ఇది కూలిపోవడంతో ఆయా ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ ఆగిపోయింది. బ్రిడ్జ్‌కు అటువైపు.. ఇటువైపు భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌తో సహా జిల్లా అధికారులు స్పందించి, సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బ్రిడ్జి కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వర్షాకాలం కావడంతో బ్రిడ్జికి పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. వాటికి తాత్కాలిక మరమ్మతులు మాత్రమే చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జి 1985లో పూర్తయిందని, 45 సంవత్సరాల పాతదని అధికారులు చెబుతున్నారు.
Read Also- YSRCP: మళ్లీ వైసీపీలోకి విజయసాయి, బాలినేని.. ముహూర్తం ఫిక్స్!
ఇంకెన్నాళ్లీ ఘోరాలు?
కాంగ్రెస్ సీనియర్ నేత అమిత్ చావ్డా బ్రిడ్జి కూలిపోయిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ప్రత్యామ్నాయ ట్రాఫిక్ మార్గాలను ఏర్పాటు చేయాలని, నిర్మాణ వైఫల్యానికి గల కారణాలపై దర్యాప్తు చేయాలని అధికారులను కోరారు. కాగా, స్థానికులు చెబుతున్న మాటలను బట్టి చూస్తే.. ఈ వంతెన దశాబ్దాల నాటిదని, శిథిలావస్థలో ఉందని తెలుస్తున్నది. ఇది మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, నిర్వహణపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రస్తుతం, రెస్క్యూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి మరియు ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికలు జరుగుతున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా, వేగంగా మారుతోంది. కాగా, పదే పదే గుజరాత్‌లోనే, అందులోనూ బీజేపీ హయాంలోనే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటూ ఉండటం అటు రాష్ట్రంలోని బీజేపీ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్ద ఎత్తునే చెడ్డ పేరు వస్తోంది. ఇక మోదీ స్వరాష్ట్రం కావడంతో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇంకెన్నాళ్లు నేరాలు, ఘోరాలు చూడాలని.. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని కాంగ్రెస్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సోషల్ మీడియా వేదికగా ఎలాంటి కామెంట్స్ వస్తాయో.. ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అవన్నీ మాటల్లో చెప్పలేం.. రాతల్లో అస్సలే రాయలేం.
Read Also-
આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રીજ તૂટી પડ્યો છે.અનેક વાહનો નદીમાં પડતા મોટી જાનહાનિ થઈ હોવાની શક્યતા છે. સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરે અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.@CMOGuj @dgpgujarat @Bhupendrapbjp @sanghaviharsh @CollectorAnd pic.twitter.com/Xn1vIB9QEs
— Amit Chavda (@AmitChavdaINC) July 9, 2025