YSRCP: అవును.. వైసీపీలో కీలక నేతలుగా.. అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి నీడలా, రైట్ హ్యాండ్‌గా ఉన్న విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) , కుటుంబ సభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) ఇరువురూ రీ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రెండు మూడ్రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో (Social Media) ఇదే హాట్ టాపిక్‌గా మారింది. సాయిరెడ్డి నేరుగా జగన్ రెడ్డితోనే టచ్‌లోకి వెళ్లగా.. బాలినేని ఇంకా మంతనాలు జరుపుతున్నారని తెలియవచ్చింది. మరోవైపు బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో కలిశారనే చర్చ కూడా జరుగుతోంది. ట్విట్టర్ వేదికగా వైసీపీ శ్రేణులు, జగన్ వీరాభిమానులు.. ‘బిగ్ బ్రేకింగ్ మళ్లీ వైసీపీలోకి విజయసాయి’ అని తెగ హడావుడి చేస్తున్నారు. బాలినేని విషయంలోనూ అంతే.. ‘తిరిగొస్తున్న జగన్ బంధువు’ అని రచ్చ రచ్చే చేస్తున్నారు. దీనికి వైసీపీ కార్యకర్తలే కౌంటర్లు కూడా ఇస్తుండటం గమనార్హం. ఇందులో నిజానిజాలెంత అనే విషయాలు ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి..
Read Also- Viral News: చాక్లెట్ తీసుకోలేదని మహిళను చంపేశాడు.. సీన్ కట్ చేస్తే..!
వ్యవ‘సాయిరెడ్డి’ కాదా?
రాజకీయ మేధావిగా గుర్తింపు పొందిన విజయసాయిరెడ్డి కారణమేంటో తెలియట్లేదు కానీ ‘ వైఎస్ జగన్ మనసులో నాకు చోటులేదు’ అని చెప్పి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన సాయిరెడ్డి.. వైసీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే అటు ఆంధ్రలో ఇటు ఢిల్లీలోనూ ప్రముఖ నాయకుడిగా రాణించారు. ఇంకా చెప్పాలంటే వైసీపీలో నెంబర్-2గా ఓ వెలుగు వెలిగారు. జగన్ తర్వాత అన్నీ తానై క్యాడర్‌ను చూసుకుంటా వచ్చిన విజయసాయి పార్టీలో తనదైన ముద్ర బలంగా వేసుకున్నారు. మరీ ముఖ్యంగా 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం కష్టపడిన వారి కంటే.. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన చుట్టూ కోటరి ఉందని ఆరోపిస్తూ గుడ్ బై చెప్పేశారు. జగన్ నీడలా వ్యవహరించిన సాయిరెడ్డి రాజీనామా వైసీపీ అస్సలు ఊహించలేదు. ఆ తర్వాత క్యాడర్ అయితే ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నది. రాజకీయాలే వద్దు బాబోయ్.. వ్యవసాయం చేసుకుంటానంటూ రాజ్యసభ పదవి ఇంకా మూడేళ్లుపైనే ఉన్నప్పటికీ రాజీనామా చేసేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సాయిరెడ్డి రీ ఎంట్రీ ఇస్తున్నారని.. ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తున్నది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టు 15 తర్వాత తిరిగి అధినేత జగన్ సమక్షంలో కండువా కప్పుకుంటారని సమాచారం. ఇదేగానీ నిజమైతే వైసీపీకి పెద్ద బూస్టే అని చెప్పుకోవచ్చు.
Read Also-Lavanya Tripathi: 6 నెలలకే లావణ్య త్రిపాఠికి బాబు పుట్టాడా?.. వైరల్ అవుతున్న ఫోటో?
నేనొచ్చేస్తా జగన్!
వైఎస్ జగన్‌కు మామ వరుసయ్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పట్నుంచీ అలకబూని ఆఖరికి 2024 ఎన్నికల్లో పార్టీ, తాను ఓడిన తర్వాత రాజీనామా చేశారు. అనంతరం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిపోయారు. అయితే ఆయనకు ఇప్పటివరకూ ఎలాంటి పదవి లేకపోవడం, పైగా పార్టీలోని పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం, తన ప్రత్యర్థులు కూడా అటు టీడీపీలో.. ఇటు జనసేనలో ఉంటూనే హెచ్చరిస్తుండటం ఇవన్నీ నచ్చలేదట. వైఎస్ హయాం నుంచి వైఎస్ జగన్ వరకూ కాంగ్రెస్, వైసీపీలో ఓ రేంజిలో ఉన్న తనను ఎవరుపడితే వాళ్లు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. ‘ఆ రోజులు మళ్లీ రావు.. వైసీపీతోనే మళ్లీ వస్తాయ’ని పదే పదే అనుచరులు, వీరాభిమానులు గుర్తు చేస్తున్నారట. అయినా కూటమిగా ఉన్నప్పుడు కలిసిమెలిసి పోవాలేగానీ ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించే పరిస్థితుల్లో కూడా బాలినేని లేరట. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ దగ్గర ఈ విషయాలపైన ఓపెన్ అయితే ఆయన్నుంచి ఎలాంటి స్పందన వస్తుందో..? అని మదనపడుతున్నారట. ఉమ్మడి ప్రకాశం జిల్లాను ఒంటి చేత్తో ఏలిన తనకు ఈ పరిస్థితి వచ్చిందేట్రా బాబూ..? అంటూ తనను తానే ప్రశ్నించుకుంటున్నారని తెలిసింది. మంచిరోజులు వైసీపీతోనే అంటూ ఫిక్స్ అయ్యి జనసేనను నుంచి బయటికొచ్చి సొంత గూటికి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారట. ఇటీవల బెంగళూరులో రహస్యంగా జగన్‌ను బాలినేని కలిశారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అంతేకాదు.. తిరిగి సొంత గూటికి వచ్చేందుకు జగన్ తల్లి విజయమ్మ ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అయితే జగన్ మాత్రం ఒప్పుకోలేదని టాక్.
పోయేదేముంది?
ఇన్నాళ్లు జరిగిందేదో జరిగిపోయింది.. అభిమానులు, క్యాడర్ తమతోనే ఉంది కదా..? రీ ఎంట్రీ ఇస్తే పోయేదేముంది? అని అటు సాయిరెడ్డి, ఇటు బాలినేని గట్టిగానే అనుకుంటున్నారట. అయినా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు కదా? పార్టీలో నుంచి బయటికెళ్లినంత మాత్రాన వాళ్లేమీ శత్రువులు కూడా కాలేదు కదా. ఏదేమైనా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అంతు బట్టదు. సాయిరెడ్డి రీ ఎంట్రీ ఇస్తే కచ్చితంగా ఆయనుకున్న ప్రాధాన్యత దక్కుతుందని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. వైసీపీ క్యాడర్ కోసం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశారు కూడా. ఇదంతా పార్టీ అధికారంలో లేనప్పుడే సాయిరెడ్డి చక్కబెట్టుకుంటూ వచ్చారంటే మామూలు విషయమేమీ కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తే దగ్గరుండి మరీ వారికి బెయిల్ ఇప్పించి అండగా నిలిచిన సందర్భాలు కోకొల్లలు. అటు కార్యకర్తలు.. ఇటు నేతలతో సమన్వయం చేయడంలో సాయిరెడ్డి తర్వాతే ఎవరైనా అన్నట్లుగా పేరుంది. అందుకే అలాంటి వ్యక్తి మళ్లీ పార్టీలోకి వస్తానంటే జగన్ కూడా ఏమాత్రం అడ్డు చెప్పకుండా సాదరంగా స్వాగతించాలని వైసీపీ శ్రేణులు కోరుతున్నాయి. ఇక బాలినేని కూడా జగన్ జిల్లాల పర్యటనలో తిరిగి కండువా కప్పుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఈ ఇద్దరి రీ ఎంట్రీ వైసీపీకి మరింత బలం చేకూరినట్లుగా అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రచారం ఎంతవరకూ నిజమవుతుందో? వారి మనసులో ఏముందో తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడాల్సిందే మరి.
Read Also- Congress: తెలంగాణ కాంగ్రెస్‌కు కేవీపీ అవసరమా.. హాట్ టాపిక్‌గా మారిన ఎపిసోడ్!