Viral News: సమాజంలో ఎప్పుడు.. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఊహించలేని పరిస్థితి. ఎప్పుడు ఎవడు సైకో లాగా మారుతాడో.. మహిళలు, యువతీ యువకులు ఎలాంటి పనులు చేస్తారో పెద్ద పెద్ద నిపుణులకే అంచనాలకే అందట్లేదు. ఈ మధ్య జరిగిన సంఘటనలను బట్టి చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులను బిడ్డలను చంపడం.. భర్తలను ప్రియుడితో కలిసి భార్యలు చంపడం.. భార్యను భర్త చంపడం ఇలా ఒకటా రెండా గత రెండు మూడు నెలలుగా చోటుచేసుకుంటున్న ఘటనలు చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. ఇదిగో ఇప్పుడు మీరు చదవబోయే సంఘటన చూస్తే ఇంత వీడెవడ్రా బాబూ ఇంత సైకోలా ఉన్నాడనే మాట తప్పకుండా మీ నోట వచ్చేస్తుంది. పూర్తి వివరాల్లోకెళితే.. చాక్లెట్ (Chocolate) తీసుకోకుండా తిట్టినందుకు మహిళను చంపేశాడు. ధర్మవరంలో (Dharmavaram) జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఇప్పుడిదే పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది.
Read Also- America: అమెరికాలో ఘోరాతి ఘోరం.. హైదరాబాద్ ఫ్యామిలీ సజీవ దహనం
అసలేం జరిగింది?
జూన్ 29న రాజశేఖర్ కుమారుడి పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిపాడు. కేక్ కట్ చేయడమే కాకుండా అందరికీ చాక్లెట్ కూడా పంచిపెట్టాడు. ఎదురింట్లో ఉన్న రమాదేవికి కూడా కుమారుడితో కలిసి రాజశేఖర్ చాక్లెట్ ఇవ్వడానికి వెళ్లాడు. అయితే ఆ ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవలు ఉన్నాయి. దీంతో ‘చాక్లెట్ వద్దు.. ఏం వద్దుపో’ అని తీసుకునేందుకు నిరాకరించింది. అక్కడితో ఆగి ఉన్నా.. చాక్లెట్ తీసుకుని ఉన్నా ఇద్దరూ ప్రశాంతంగా ఉండేవారు. కానీ, చాక్లెట్ తీసుకోవడానికి నిరాకరించడమే కాకుండా రాజశేఖర్‌ను నోటికొచ్చినట్లుగా దూషించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికిలోనైన ఆయన.. ఆమెను ఆగ్రహంతో కిందకు తోసి, టవల్‌తో గొంతు బిగించాడు. అనంతరం అక్కడి నుంచి రాజశేఖర్ తిన్నగా తప్పించుకుని వెళ్లిపోయాడు. ధర్మవరంలోని గీతానగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన వారం, పది రోజులుగా చర్చనీయాంశం అయ్యింది. పోలీసులకు కూడా అసలేం జరిగిందో అంతుచిక్కలేదు. సుమారు వారం రోజులపాటు లోతుగా దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగుచూసింది.
Read Also- Bhairavam OTT: ‘భైరవం’ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
ఇద్దరి మధ్య గొడవ ఎందుకు?
రాజశేఖర్‌ను రమాదేవి ఎందుకు తిట్టింది? ఇద్దరి మధ్య ఏం జరిగింది? హత్య చేసేంత పరిస్థితి ఎందుకొచ్చింది? అని పోలీసులు విచారణ చేపట్టగా ఒక్కొక్కటిగా నిజానిజాలు బయటికొచ్చాయి. గతంలో రమాదేవి వద్ద కొంత డబ్బును రాజశేఖర్ అప్పుగా తీసుకున్నాడు. అయితే ఆ డబ్బును రమాదేవికి తిరిగి చెల్లించలేదు. ఈ కోపంతోనే చాక్లెట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు.. తీసుకోకపోగా రాజశేఖర్‌ను తిట్టింది. దీంతో ఆగ్రహానికి లోనైన రాజశేఖర్.. ఆమెను తోసేశాడు. తీవ్రగాయాలతో స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 4న రమాదేవి మృతి చెందినది. తానే ఆమెను హత్య చేసినట్లుగా విచారణలో ఒప్పుకున్నట్లు డీఎస్పీ హేమంత్ మీడియాకు వెల్లడించారు. మొత్తానికి వారం రోజులుగా సస్పెన్స్‌గా నెలకొన్న మహిళ హత్య కేసు మిస్టరీని ధర్మవరం పోలీసులు ఛేదించారు. ఈ ఘటన సమాజంలో చిన్న చిన్న విషయాలు కూడా ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీయగలవో తెలియజేస్తోంది. క్షణికావేశంలో చేసిన ఈ పనికి రాజశేఖర్ జైలుపాలయ్యాడు. ఆయనకు జీవితఖైదు పడినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also- Viral News: శివయ్యా.. నీ కొడుకు అయితే ఇలానే తలరాత రాస్తావా?