America: అమెరికాలో ఘోరమైన సంఘటన చోటుచేసుకున్నది. సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన కుటుంబం (Hyderabad Family) సజీవ దహనమైంది. వెకేషన్ కోసం ఈ మధ్యనే ఆ కుటుంబం డల్లాస్‌కు వెళ్లింది. అయితే ఊహించని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో తేజస్విని, శ్రీ వెంకట్, దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. సెలవులు ఉండటంతో అట్లాంటలోని బంధువుల ఇంటికి వెంకట్ తన కుటుంబంతో కలిసి కారులో వెళ్ళారు. వారం రోజుల పాటు అట్లాంటలో ఎంజాయ్ చేశారు. అయితే డల్లాన్ (Dallas) నుంచి అర్ధరాత్రి తిరిగొస్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. గ్రీన్ కౌంటి ఏరియాలో రాంగ్ రూట్‌లో వచ్చిన కారును మినీ ట్రక్ ఢీ కొన్నది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు సజీవ దహనమయ్యారు.
Read Also- Atchannaidu: ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్ గాలి తీసిన అచ్చెన్న..!
ఎముకలు మిగిలాయ్!
మంటల థాటికి కారు మొత్తం బూడిద అయిపోయింది. మనుషుల ఆనవాళ్లు ఎక్కడా కనిపించకపోవడంతో ఎముకలను సేకరించిన పోలీసులు ఫోరెన్సిక్‌కు పంపారు. డీఎన్ఏ (DNA) శాంపిల్ తీసుకొని మృతి దేహాలను పోలీసులు అప్పగించనున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ట్రక్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంకట్, తేజస్విని కుటుంబ సభ్యుల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తమకు సాయం చేయాలని వేడుకుంటున్నారు.