Lavanya Tripathi: సోషల్ మీడియా అంటేనే ఒక సముద్రం లాంటిది. దానిలో రూమర్లు అలల్లా వస్తుంటాయి. అయితే, తాజాగా లావణ్య త్రిపాఠి ఒక బాబుని ఎత్తుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. “అరె, లావణ్యకి 6 నెలల్లోనే బాబు పుట్టాడా? ఇదెలా సాధ్యం?” అని కొందరు, “ఏమో, ఆమె ప్రెగ్నెన్సీని లేట్‌గా అనౌన్స్ చేసి, 9 నెలలకే డెలివరీ అయ్యిందేమో!” అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ, ఈ గాసిప్ వెనక నిజం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: KTR Challenges CM Revanth: చర్చకు రాకుంటే ముక్కు నేలకు రాసి సారీ చెప్పాలి.. కేటీఆర్ సంచలన కామెంట్స్!
లావణ్య తన ప్రెగ్నెన్సీ విషయాన్ని మే 2025లో బయటపెట్టింది. ఆమె మూడో నెలలో ఈ విషయాన్ని అనౌన్స్ చేసి ఉంటే, ఇప్పటికి ఆమె గర్భం 6 నెలల వయసులో ఉంటుంది. సెలబ్రిటీలు సాధారణంగా మూడు నెలల తర్వాతే ప్రెగ్నెన్సీ విషయాన్ని షేర్ చేస్తారు.
కానీ, ఈ వైరల్ ఫోటో చూస్తే, లావణ్య ఒక బాబుని ఎత్తుకుని నవ్వుతూ కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు ఫుల్ కన్ఫ్యూజన్‌లో పడిపోయారు.
” లావణ్య బాబునా? లేక వేరే వారి బాబు నా? ” అని అడుగుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: Congress: తెలంగాణ కాంగ్రెస్‌కు కేవీపీ అవసరమా.. హాట్ టాపిక్‌గా మారిన ఎపిసోడ్!
మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోను చూసి, “అరె, ఇది ఫేక్ రా!” అంటూ ఒక్కటే రచ్చ చేస్తున్నారు. ఈ ఫోటోలో లావణ్య ఎత్తుకున్న బాబు ఆమె కొడుకు కాదు, ఆమె అన్నకి పుట్టిన బిడ్డ.. అవును, లావణ్య తన అన్న కొడుకుని ఆప్యాయంగా ఎత్తుకున్న ఫోటోను ఎవరో సోషల్ మీడియాలో తప్పుగా వైరల్ చేస్తూ, “లావణ్యకి బాబు పుట్టాడు” అని రూమర్లు క్రియోట్ చేస్తున్నారు. ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని మెగా ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు.
Also Read: TG Tourism: టూరిజంపై మంత్రి స్పెషల్ ఫోకస్.. ఇప్పటికే కొంతమంది పనితీరుపై అసంతృప్తి!
ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, మెగా ఫ్యామిలీ అంటేనే ఓపెన్ బుక్ లాంటిది. లావణ్యకి నిజంగా బిడ్డ పుట్టి ఉంటే, అది సీక్రెట్‌గా ఉంచే ఛాన్సే లేదు. మెగా ఫ్యామిలీ నుంచి గ్రాండ్ అనౌన్స్‌మెంట్‌తో పాటు, సోషల్ మీడియాలో ఫోటోల వరద వచ్చేసేది. కానీ, ఇప్పుడు ఈ ఫోటోను బట్టి రూమర్లు పుట్టించడం, కొందరు ట్రోలర్స్ టైమ్‌పాస్ అని మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.