TG Tourism: టూరిజం శాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగానే ఆ శాఖలో ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు, ఏయే బాధ్యతలు చేపడుతున్నారు, రిటైర్డ్ ఉద్యోగులు (Employees) ఎంతమంది పనిచేస్తున్నారు. వారి పనితీరు ఎలా ఉందనే దానిపై ఆరా తీస్తున్నది. రిటైర్డ్ ఉద్యోగులుగా కొనసాగుతున్నవారికి ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. కొంతమంది (Employees) ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ టైప్ చేస్తున్నది. అవసరం అయితే ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై ఉద్యోగులను శాఖకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అధికారుల్లో మార్పు వస్తేనే..
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) టూరిజంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలోని అన్ని టూరిజం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాలని, పర్యాటకులను ఆకర్షించాలని అందులో భాగంగానే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని శ్రీకారం చుట్టారు. టూరిజం పాలసీ తీసుకొచ్చారు. అయితే, ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే శాఖలోని ఉద్యోగుల పనితీరు సైతం మెరుగుపడాలని భావించినట్లు తెలిసింది.
Also Read: Operation Kagar: మావోయిస్టు అగ్రనేతలంతా అక్కడే!
దీంతో శాఖలోని ఉద్యోగుల (Employees) ఎంతమంది ఉన్నారు, వారు ఏయే విధులు నిర్వహిస్తున్నారనే దానిపై వివరాలు సేకరించింది. శాఖను బలోపేతం చేసేందుకు అధికారుల ట్రాన్స్‌ఫర్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. అంతేకాదు ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన వారి విధులపైనా ఆరా తీసినట్లు తెలిసింది. అంతేగాకుండా రిటైర్డ్ అయినా కొనసాగుతున్న వారి వివరాలను సైతం సేకరించి వారికి ఉద్వాసన పలకాలని నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగానే 13 మంది రిటైర్డ్ ఉద్యోగుల సేవలకు ముగింపు పలికినట్లు తెలిసింది. మార్కెటింగ్, రవాణా, వాటర్ ఫిట్, సౌండ్ అండ్ లైట్, ఇంజినీరింగ్, హోటళ్లు తదితర విభాగాల్లో జనరల్ మేనేజర్లుగా పనిచేస్తున్న వారిని రిమూవల్ చేశారు. రెగ్యూలర్ అధికారులకు బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది.
అధికారులపై నిఘా
రిటైర్డ్ ఉద్యోగులతో (Employees) టూరిజంలో చేపట్టాల్సిన పనులు ముందుకు పోవడం లేదని దీంతో ప్రభుత్వం చేరాల్సిన లక్ష్యం చేరడం లేదని సమాచారం. అందుకే వారి స్థానంలో నూతనంగా యువతను తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. లేకుంటే ఇతర శాఖల నుంచి డిప్యూటైషన్‌పై (Employees) ఉద్యోగులను తెచ్చుకుంటే లక్ష్యం నెరవేరుతుందని పనులు సైతం వేగంగా జరుగుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు రిటైర్డ్ అధికారులకు ఇచ్చే వేతనాలతో ఇద్దరు లేదా ముగ్గురు ఉద్యోగులను నియమించుకోవచ్చని వారికి పనులు అప్పగించినా నిర్ణీత సమయంలో పూర్తి అయ్యే అవకాశం ఉందని ఉన్నతాధికారులు సైతం భావిస్తున్నట్లు సమాచారం. మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం ప్రభుత్వ లక్ష్యం మేరకు టూరిజం శాఖ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. అధికారుల పనితీరుపైనా నిఘా పెట్టినట్లు సమాచారం. కొంతమంది అధికారులపై అసంతృప్తితో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వారు తీరు మార్చుకోకుంటే త్వరలోనే వారిని ఇతర శాఖలకు బదిలీ చేయనున్నట్లు తెలిసింది.
ముందుకు సాగని ఫైల్స్
ఏళ్లుగా కొంతమంది ఒకే దగ్గర పనిచేస్తుండడంతో ఉద్యోగుల్లో (Employees) బద్దకం పెరిగిందనే ప్రచారం జరుగుతున్నది. దీంతో ఏ ఫైల్ ముందుకు సాగడం లేదని, పర్యాటక ప్రాంతాల పర్యటనకు సైతం వెళ్లకుండా ఆఫీసుల్లోనే కూర్చొని కాలయాపన చేస్తున్నారనే చర్చ ఉన్నది. ఇలా పనిచేస్తున్న అందరిపైనా ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అధికారులు పని చేయకపోతే వేటుపడే అవకాశం లేకపోలేదని శాఖకు సంబంధించిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఏదిఏమైనా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంలో ఇక పర్యాటకం అభివృద్ది చెందనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Bhadradri Kothagudem: రెచ్చిపోతున్న కంకర మాఫియా.. నాసిరకం కంకరతో నిలువు దోపిడీ