Operation Kagar( image credit: twitter)
తెలంగాణ

Operation Kagar: మావోయిస్టు అగ్రనేతలంతా అక్కడే!

Operation Kagar:  ఆపరేషన్ కగార్ (Operation Kagar) చివరి అంకానికి చేరుకున్నట్టు తెలుస్తున్నది. ఛత్తీస్‌గఢ్ జాతీయ పార్కు అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నేత గణపతి (Ganapati)మకాం వేసినట్టు సమాచారం అందింది. దీంతో గణపతి (Ganapati) టార్గెట్‌గా ఆపరేషన్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలు, జాతీయ పార్కు అటవీ ప్రాంతంలోని 30 వేల మందితో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.  సాయంత్రం 7 గంటలకు ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) అటవీ ప్రాంతంలో బలగాలు సెర్చింగ్ ముమ్మరం చేశాయి. గణపతితోపాటు మరో అగ్రనేత హిడ్మాను చంపేందుకు గాలింపు కొనసాగిస్తున్నాయి.

 Also Read: Ajay Devgan – CM Revanth: అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిలిం స్టూడియో!

కాల్పులు ఆపి వేయాలి

మరోవైపు,(Operation Kagar) ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపివేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ (Professor Haragopal) డిమాండ్ చేశారు. ‘‘ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో 30 వేల మంది కేంద్ర బలగాలు, ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్ర (police) పోలీసులు మావోయిస్టులను, ఆదివాసీలను చుట్టుముట్టి ఫైరింగ్ చేస్తున్నారని సమాచారం. బస్తర్ ఐజీ సుందర్ రాజ్ (Sundar Raj) మావోయిస్టులను లొంగిపొమ్మని హెచ్చరికలు చేస్తున్నాడు లేదా చావుకు సిద్ధం కండి అని మాట్లాడుతున్నాడు. గణపతి, (Ganapati) హిడ్మా (Hidma) వంటి నాయకులు ఉన్నారని ప్రచారం చేస్తున్నారు.ప్రజలు, ప్రజాస్వామికవాదులు, హక్కుల సంఘాలు వామపక్ష పార్టీలు, మేధావులు ఈ మారణ హోమంపై తక్షణమే స్పందించాలి. పోలీసులు చట్టం, రాజ్యాంగం ప్రకారం మెదలకుండా, హత్యలు చేయడం, హత్య చేస్తామని హెచ్చరించడం ప్రజాస్వామ్య వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ కాల్పులు ఆపివేయడానికి అన్ని వర్గాల వారు స్పందించాలి’’ అని హరగోపాల్ (Professor Haragopal) విజ్ఞప్తి చేశారు.

 Also Read: Seethakka on KTR: కేటీఆర్ నాశనమైపోతారు.. మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ఫైర్!

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?