Ajit Pawar Dies:మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం 8 గంటలకు ముంబయి (Mumbai) నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతి (Baramati)కి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న ‘లియర్ జెట్ 45’ చార్టర్ విమానం ప్రమాదానికి గురైంది. బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా సాంకేతిక లోపం తలెత్తి విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఐదుగురు స్పాట్ డెడ్
చార్టర్ విమానం టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత అంటే ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. విమానం కుప్పకూలిన అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి (PSO), విమాన పైలెట్, ఇద్దరు సిబ్బంది కలిపి అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు పౌరవిమాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) అధికారికంగా ప్రకటించింది. ప్రమాద తీవ్ర దృష్ట్యా ఎవరూ ప్రాణాలతో బయటపడే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొంది.
BREAKING
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
బారామతిలో ల్యాండ్ అవుతుండగా కూలిన విమానం
ఉదయం 8.45 గంటలకు విమాన ప్రమాదం
ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు ఉన్నట్లు సమాచారం
Maharashtra Deputy CM Ajit Pawar passes away#AjitPawar https://t.co/gwd5IpiLHS pic.twitter.com/u75AzXkrbz
— BIG TV Breaking News (@bigtvtelugu) January 28, 2026
మోదీ, అమిత్ షా సంతాపం
డిప్యూటీ సీఎం దుర్మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ను సంప్రదించి.. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు అజిత్ పవార్ మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్వయంగా ఘటనకు గల కారణాలను పర్యవేక్షిస్తున్నారు. మరో డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే సైతం అజిత్ పవార్ అకాల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అజిత్ పవార్.. రాజకీయ నేపథ్యం
అజిత్ పవర్ విషయానికి వస్తే.. ఆయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు. జులై 22, 1959లో మహారాష్ట్ర అహ్మద్ నగర్ లోని డియోలాలి ప్రవారా గ్రామంలో జన్మించారు. 1982లో సర్కారి సహకార సంఘాల (సుగర్ కోఆపరేటివ్ మొదలైనవి) బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రయాణం మెుదలు పెట్టారు. తరువాత పూణే డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడిగా 16 సంవత్సరాలు సేవలందించారు. 1991లో మొదటిసారిగా బారామతి నుంచి మహరాష్ట్ర శాసన సభకు (MLA) ఎన్నికయ్యారు. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవులు అనుభవించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అత్యధికసార్లు (6 సార్లు) పని చేశారు.
Also Read: Edulapuram Municipality: ఎదులాపురం మున్సిపాలిటీలో.. అధికార పార్టీ అభ్యర్థుల జాబితా ఖరారు..?
2023లో ఎన్సీపీలో చీలికలు
2023లో అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీలో తిరుబాటు జరిగింది. దీంతో ఎన్సీపీ పార్టీ రెండు వర్గాలుగా చీలి పోయింది. ప్రస్తుతం ఒక వర్గానికి అజిత్ పవార్ నాయకత్వం వహిస్తుండగా.. మరో వర్గానికి శరద్ పవార్ చీఫ్ గా ఉన్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా శరద్ పవార్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఎన్సీపీకి చెందిన రెండు వర్గాలు తిరిగి కలబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఇందుకు అనుగుణంగానే పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ రెండు వర్గాలు కలిసి పోటీ చేశాయి. కాగా అజిత్ పవార్ మృతి ఘటన.. ప్రస్తుతం పవార్ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

