Kalvakuntla Kavitha: ‘నేను గతంలో చెప్పిన దయ్యాల్లో మొదటి దయ్యమే సంతోష్ రావు’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను, ఆమె కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించారు. భరోసా కల్పించారు. సౌమ్య కుటుంబానికి అండగా ఉంటామని హామీఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు దూరం కావటానికి కారణం సంతోష్ రావు అన్నారు.
ఆయనకు శిక్ష పడటం అనుమానమే..
గద్దర్ లాంటి నాయకులు గంటలు గంటలు గేట్ బయట వేచి చూడటం, ఈటల లాంటి పార్టీ వీడటానికి కూడా ఈ సంతోష్ రావే కారణంఅని ఆరోపించారు. కేసీఆర్ ఫాం హౌస్ లో సగం ఇడ్లి తిన్నారా? పూర్తిగా ఇడ్లి తిన్నారా? అన్న సమాచారాన్ని కూడా గుంపు మేస్త్రీకి చేరవేసేది సంతోష్ రావే(Santhosh Rao) అని పేర్కొన్నారు. గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారి సంతోష్ రావు అని, అందుకే ఆ గూఢచారిని శిక్షిస్తాడని నేను నమ్మటం లేదన్నారు. సంతోష్ రావు ను సిట్ పిలిచి విచారించడం మంచిదే.. కానీ ఆయనకు శిక్ష పడటం అనుమానమే అన్నారు. ఇటువంటి దుర్మార్గుడికి కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish rao) ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావటం లేదన్నారు. నిజంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే కచ్చితంగా ఈ దుర్మార్గుడికి శిక్ష పడుతుందన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు తమ పని తాము చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక్కోసారి మన నీడ కూడా మన కళ్లను కప్పే పరిస్థితి వస్తుందన్నారు. ఉద్యమకారులను కేసీఆర్ కి దూరం చేసిన పాపం కచ్చితంగా ఈ దుర్మార్గుడికి తగులుతుందన్నారు.
Also Read: Gadwal Politics: గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల్లో రాజుకున్న రాజకీయ సెగ.. ఆశావహుల ఎదురుచూపులు
గృహహింస ఘటనలు
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి కొంచెం క్రిటికల్ గా ఉన్నప్పటికీ కాస్త ఇంప్రూమెంట్ ఉందన్నారు. కానిస్టేబుల్ ను చంపే ధైర్యం గంజాయి బ్యాచ్ చేసిందంటే ప్రభుత్వం అంటే వారికి ఏ మాత్రం భయం లేదని స్పష్టమవుతోందన్నారు. డ్రగ్స్, గంజాయి ఫ్రీ చేస్తామని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ దురదృష్టమేమిటంటే గ్రామాల్లో కూడా ఫ్రీ గా గంజాయి, డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ లోకి కూడా గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చి పిల్లలను పాడు చేస్తున్నారని దీని కారణంగా మా ఆడవాళ్లే బాధితులుగా మారే పరిస్థితి ఉంటుందన్నారు. గృహహింస ఘటనలు జరగటానికి డ్రగ్స్, గంజాయి కారణమవుతోందన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మత్తు వదిలి డ్రగ్స్, గంజాయి మాఫియా పై వారి ప్రతాపం చూపాలని సూచించారు. ఎక్సైజ్, ఫారెస్ట్ సిబ్బందికి వెపన్స్ ఇవ్వాలని, వాళ్లకు ట్రైనింగ్ లో గన్ ఫైరింగ్ ఉంటుందని కానీ వెపన్స్ ఇవ్వటం లేదన్నారు. వెపన్స్ ఉంటే గంజాయి, డ్రగ్స్ మాఫియాకు భయం ఉంటుందన్నారు. డ్రగ్స్, గంజాయి మహమ్మరిని తరిమికొట్టేందుకు జాగృతి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్, గంజాయి ముఠాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

