Medaram Accident: మేడారం మహాజాతరకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కాటారం-మేడారం ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లు దుర్మరణం చెందగా.. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తంపేటకు చెందిన కస్తూరి లక్ష్మి(45), కస్తూరి అక్షిత(21) గా పోలీసులు గుర్తించారు. పోలీసులు, ప్రయాణికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ట్రాలీ కింద తల్లీకూతుళ్లు
మహదేవపూర్ మండలం బొమ్మాపూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్లో 25 మంది కలిసి మేడారం జాతరకు మంగళవారం సాయంత్రం బయలుదేరారు. మహాముత్తారం మండలంలోని పెగడపల్లి-కేశవాపూర్ అటవీ ప్రాంతంలో ట్రాక్టరును రహదారి కిందకు దించి మళ్లీ ఎక్కించే క్రమంలో అదుపుతప్పి పల్టీ కొట్టి బోల్తాపడింది. ట్రాక్టర్ ట్రాలీ కింద తల్లీకూతుళ్లు నలిగిపోయి అక్కడికక్కడే చనిపోయారు. మరో మహిళ ఇరుక్కుపోయింది. రెండు గంటల పాటు ట్రాలీ కిందే ఇరుక్కుపోయిన మహిళను పోలీసులు స్థానికుల సాయంతో బయటకు తీసి భూపాలపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి ఏఎస్పీ నరేష్ కుమార్ చేరుకొని పరిశీలించారు. ఈ ప్రమాదంతో మేడారానికి వెళ్లే దారిలో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దీంతో కాటారం మీదుగా వచ్చే వాహనాలన్నింటిని భూపాలపల్లి-కమలాపూర్ క్రాస్ నుంచి పోలీసులు తరలించారు.
Also Read: Arijit Retirement: సంగీత ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ప్లేబ్యాక్ సింగింగ్‌కు అరిజిత్ సింగ్ వీడ్కోలు
మేడారం జాతరకు వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు భక్తులు మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కేశవపూర్ శివారులో ఘటన
మేడారం జాతరకు వెళ్తున్న భక్తుల ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా
ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి
మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
మృతులు… pic.twitter.com/TN1kNsa8jw
— BIG TV Breaking News (@bigtvtelugu) January 28, 2026

