Arijit Retirement: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన గాత్రంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న అరిజిత్ సింగ్, తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. ‘తుమ్ హీ హో’, ‘కేసరియా’, ‘చన్నా మేరేయా’ వంటి ఎన్నో అద్భుతమైన గీతాలను అందించిన ఆయన, ఇకపై సినిమాల్లో కొత్త పాటలు పాడకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
Read also-Tharun Bhascker: ఈషా రెబ్బాతో తనకున్న రిలేషన్‌పై తరుణ్ భాస్కర్ సంచలన కామెంట్స్
రిటైర్మెంట్ ప్రకటన
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అరిజిత్ ఒక సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో, ‘ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్న శ్రోతలందరికీ ధన్యవాదాలు. నేను ఇకపై ప్లేబ్యాక్ సింగర్‌గా కొత్త ప్రాజెక్టులను అంగీకరించడం లేదు. ఈ ప్రయాణాన్ని నేను ఇక్కడితో ముగిస్తున్నాను. ఇది చాలా అద్భుతమైన ప్రయాణం’ అని పేర్కొన్నారు. ఈ వార్త ఒక్కసారిగా సంగీత ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. తనకు ఏదైనా పనిని నిరంతరం చేయడం వల్ల త్వరగా బోర్ కొడుతుందని ఆయన ఒప్పుకున్నారు. అందుకే స్టేజ్ పెర్ఫార్మెన్స్‌లలో కూడా పాత పాటలను కొత్త కొత్త ట్యూన్స్‌తో ప్రయోగాలు చేస్తుంటానని చెప్పారు. సినిమాల్లో పాడటం కూడా తనకు ఏకధాటిగా ఒకేలా అనిపిస్తోందని తెలిపారు. పరిశ్రమలోకి కొత్త టాలెంట్ రావాలని ఆయన కోరుకుంటున్నారు. కొత్త సింగర్స్ వచ్చే పాటలు విని తను స్ఫూర్తి పొందాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, కానీ సరైన సమయం కోసం వేచి చూసి ఇప్పుడు ఆ ధైర్యం తెచ్చుకున్నానని ఆయన వెల్లడించారు.
Read also-S Thaman: ఇక థమన్ పని అయిపోయినట్లేనా? కేవలం బాలయ్య చిత్రాలే దిక్కా!
తిరిగి శాస్త్రీయ సంగీతం వైపు..
అరిజిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ ఆపేస్తున్నప్పటికీ, సంగీతాన్ని మాత్రం వదలడం లేదు. ఆయన తన మూలాలైన భారతీయ శాస్త్రీయ సంగీతం వైపు మళ్లుతున్నారు. మళ్ళీ మొదటి నుంచి సంగీతాన్ని అభ్యసిస్తూ, స్వతంత్రంగా సంగీతాన్ని సృష్టించడమే తన లక్ష్యమని చెప్పారు. ఒక చిన్న కళాకారుడిగా మళ్లీ తనను తాను మలచుకోవాలని ఆయన ఆరాటపడుతున్నారు. అయితే అరిజిత్ అభిమానులు పూర్తిగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన ఒప్పుకున్న కొన్ని పాత కమిట్‌మెంట్స్ ఉన్నాయని, వాటిని పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. అందువల్ల ఈ ఏడాది మరికొన్ని పాటలు విడుదలయ్యే అవకాశం ఉంది. కేవలం సినిమాల్లో పాడటమే ఆపుతున్నాను తప్ప, తన సంగీత ప్రయాణం ఆగిపోదని ఆయన భరోసా ఇచ్చారు. చివరగా, దేవుడు తన పట్ల చాలా కరుణతో ఉన్నాడని, భవిష్యత్తులో కేవలం మంచి సంగీతాన్ని ఆస్వాదించే అభిమానిగా, కొత్త విషయాలను నేర్చుకునే విద్యార్థిగా ఉండాలనుకుంటున్నానని అరిజిత్ సింగ్ తన మనసులోని మాటను వెల్లడించారు.

