S Thaman: మొన్నటి వరకు ఎక్కడ విన్నా, ఏ సినిమా చూసినా థమన్ (Music Director Thaman) పేరే వినిపించేది. అగ్ర హీరోలందరికీ ఆయనే ఫస్ట్ ఛాయిస్. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ‘అల వైకుంఠపురములో’ నుంచి ‘అఖండ 2: తాండవం’ వరకు తన మ్యూజిక్‌తో థియేటర్లను షేక్ చేసిన థమన్, ఇప్పుడు కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు. కేవలం బాలకృష్ణ (Balakrishna) సినిమాలకే ఆయన పరిమితమవుతున్నారా? అన్న అనుమానం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రీసెంట్‌గా విడుదలైన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) పాటలు థమన్ గ్రాఫ్‌ను ఒక్కసారిగా డౌన్ చేశాయనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్ సినిమాకి ‘రెబల్ సాబ్’ వంటి సాంగ్ వస్తుందని తెలిసి ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ పాట విడుదలయ్యాక.. ‘అదే పాత డప్పులు, అదే తరహా ట్యూన్స్, కొత్తదనం ఎక్కడ?’ అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. అందులోనూ మళ్లీ కాపీ కొట్టారనే ఆరోపణలు కూడా రావడం.. థమన్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లయింది. అందుకే ఇప్పుడు థమన్ వైపు స్టార్ హీరోలెవరూ చూడటం లేదనేలా టాక్ నడుస్తోంది.
Also Read- Bhartha Mahasayulaku Wignyapthi: ‘వామ్మో వాయ్యో’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. ఎంజాయ్!
కొత్తవారికే ఛాన్స్..
ఒకప్పుడు తమన్ కోసం క్యూ కట్టిన స్టార్ డైరెక్టర్లు, హీరోలు ఇప్పుడు ఇతర మ్యూజిక్ డైరెక్టర్ల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ హవా టాలీవుడ్‌లో పెరగడం, హర్షవర్ధన్ రామేశ్వర్ (‘యానిమల్’ ఫేమ్), భీమ్స్ సిసిరోలియో, యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ వంటి వారు దూసుకురావడంతో థమన్‌కు కాంపిటీషన్ పెరిగింది. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలన్నీ ఇతర సంగీత దర్శకుల చేతుల్లోనే ఉన్నాయి. అయితే విమర్శలు రావడం థమన్‌కు కొత్తేమీ కాదు. గతంలో దేవిశ్రీ ప్రసాద్‌తో పోటీ పడి వెనుకబడిన సమయంలో కూడా ఆయన ఫీనిక్స్ పక్షిలా పుంజుకున్నారు. మరి ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ గడ్డుకాలం నుండి థమన్ బయటపడతారా? తనపై వస్తున్న రొటీన్ ముద్రను చెరిపేసి మళ్ళీ మెలోడీలతో, అదిరిపోయే మాస్ బీట్లతో మ్యాజిక్ చేస్తారా? అనేది వేచి చూడాలి.
Also Read- Jana Nayagan: ‘జన నాయగన్’ విడుదల ఇప్పట్లో లేనట్టే.. వ్యవహారం మళ్లీ మొదటికి!
కేవలం బాలయ్య చిత్రాలే..!
ప్రస్తుతం థమన్ చేతిలో ఉన్న పెద్ద హీరో చిత్రాలంటే కేవలం బాలకృష్ణ చిత్రాలే. ప్రస్తుతం బాలయ్య సినిమాలకు ఆయన వరసగా సంగీతం అందిస్తూ వస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’కు కూడా ఆయన సంగీతం అందించారనే విషయం తెలియంది కాదు. అంతకు ముందు బాబీ డైరెక్షన్‌లో వచ్చిన ‘డాకు మహారాజ్’ చిత్రానికి కూడా ఆయనే మ్యూజిక్ అందించారు. బాలయ్య సినిమాలకు థమన్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) ఒక రేంజ్‌లో ఉంటుందనేది వాస్తవం. అందుకే బాలయ్య చిత్రాలకు ఆయన ఇంకా ఫస్ట్ ఆప్షన్‌గా కొనసాగుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కనుకు ‘ఓజీ 2’ చేస్తే కచ్చితంగా థమన్‌కే అవకాశం ఉంటుంది. ఈ ఇద్దరే ప్రస్తుతం థమన్ లిస్ట్‌లో ఉన్నారు. మిగతా అందరూ ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్‌కే ఫిక్స్ అయ్యారు. మళ్లీ థమన్ ఏదో ఒక మాయ చేస్తేనే, లేదంటే దేవిశ్రీలా వెనుకబడిపోవడం కాయమంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

