Bhartha Mahasayulaku Wignyapthi: వామ్మో వాయ్యో వీడియో సాంగ్
A colorful song still featuring a male actor in festive attire flanked by two female dancers during a vibrant celebration sequence.
ఎంటర్‌టైన్‌మెంట్

Bhartha Mahasayulaku Wignyapthi: ‘వామ్మో వాయ్యో’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. ఎంజాయ్!

Bhartha Mahasayulaku Wignyapthi: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా.. అందాల భామలు డింపుల్ హయతి (Dimpla Hayathi), ఆషిక రంగనాథ్ (Ashika Ranganath) హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi). ఈ సినిమా సంక్రాంతి స్పెషల్‌గా విడుదలై మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం అనుకున్నంతగా రాబట్టలేకపోయి, రేసులో వెనుకబడింది. కంటెంట్ పరంగా మంచి మార్కులే పడ్డాయి కానీ, హెవీ కాంపిటేషన్ ఉండటంతో.. ఈ సినిమా కంటే బాగా ఉన్న సినిమాలకే ప్రేక్షకులకు బ్రహ్మరథం పట్టారు. దీంతో రవితేజ కెరీర్‌లో ఓ మోస్తర్ హిట్ చిత్రంగానే ఈ సినిమా మిగిలిపోయింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు ఎలాంటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఇందులోని ‘వామ్మో వాయ్యో’ సాంగ్ (Vaammo Vaayyo Video Song) బాగా ఆకర్షించి, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది.

Also Read- Jana Nayagan: ‘జన నాయగన్’ విడుదల ఇప్పట్లో లేనట్టే.. వ్యవహారం మళ్లీ మొదటికి!

ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది

ఈ పాట కోసమైనా ఒకసారి సినిమా చూడాలనేలా చేసిందనడంలో అతిశయోక్తి ఉండనే ఉండదు. ఆ రేంజ్‌లో ఈ పాటలో ముద్దుగుమ్మలిద్దరూ అందాల వల విసిరారు. ఇక ప్రమోషన్స్ కోసం ఎక్కడికి వెళ్లినా, దర్శకుడు కిషోర్ తిరుమల ఇదే పాటకు డ్యాన్స్ చేస్తూ, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలో ఈ పాటపై భారీ హైప్ ఏర్పడింది. అనుకున్నట్లుగానే ఈ పాట సినిమాలో పెద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మేకర్స్ ఫుల్ వీడియో సాంగ్‌ని వదిలి, సినిమాను మళ్లీ వార్తల్లోకి తెచ్చారు. ఈ ఫుల్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ అందాలకు, అదిరిపోయే స్టెప్పులకు అంతా ఫిదా అవుతున్నారు. ఈ పాటను సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఫోక్ బీట్‌లో కంపోజ్ చేశారు. స్వాతి రెడ్డి యుకె ఈ పాటను ఆలపించగా, పాటకు దేవ్ పవెర్ సాహిత్యం అందించారు.

Also Read- Vishwak Sen: మనం పెట్టిన రాకెట్ అటు, ఇటు తిరిగి.. తరుణ్ భాస్కర్‌పై విశ్వక్ పంచులే పంచులు!

వామ్మో వాయ్యో అనండిక..

ఈ పాట ఫుల్ వీడియో సాంగ్ కోసం వేచి చూస్తున్నవారంతా ఎంజాయ్ చేసేలా.. యూట్యూబ్‌లో సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోంది. మరెందుకు ఆలస్యం ముద్దుగుమ్మల అందాలను ఆస్వాదించండిక. వామ్మో వాయ్యో అని అరవండిక. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. జనవరి 13న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా రన్ అవుతూనే ఉంది. ఈ సినిమా తర్వాత రవితేజ చేయబోతున్న సినిమాకు సంబంధించి ఆయన పుట్టినరోజైన జనవరి 26న టైటిల్‌ లుక్ పోస్టర్‌ను వదిలారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి ‘ఇరుముడి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా, రవితేజ చాలా కొత్తగా ట్రై చేస్తున్నాడనే ఫీల్‌ని ఈ ఫస్ట్ ఇస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?