Vishwak Sen: మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) లీడ్ రోల్‌లో నటిస్తున్న హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ (Om Shanti Shanti Shantihi). ఈషా రెబ్బా (Eesha Rebba) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంతో AR సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్‌పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మిస్తున్నారు. కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్రం జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు మాస్ కా దాస్ విశ్వక్సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తన ఫ్రెండ్ తరుణ్ భాస్కర్‌లో విశ్వక్సేన్ (Vishwak Sen) పేల్చిన పంచులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అసలు విశ్వక్సేన్ ఏం మాట్లాడారంటే..
Also Read- Mohan Babu: ఆ అవార్డు అందుకున్న మొదటి తెలుగు నటుడు మోహన్ బాబే.. పిక్స్ వైరల్!
బిస్కెట్ వేశా..
‘‘నేను దాదాపు ఏడాదిగా పబ్లిక్ అపీరియన్స్ ఇవ్వడం లేదు. ఇంటర్వ్యూలకి, ఫంక్షన్స్‌కు కూడా వెళ్లడం లేదు. డిటాక్స్ అని అండర్ గ్రౌండ్‌లో తిరుగుతున్నాను. కానీ ఇది నా ఫ్యామిలీ ఫంక్షన్. డిటాక్స్ కుదరదు. ‘ఫలక్ నామా దాస్’లో సైదులు క్యారెక్టర్‌ని తరుణ్‌తో చేయించడానికి చాలా కష్టపడ్డాను. ఏదో రకంగా ఒప్పించి చేయించాను. ఒక బిస్కెట్ వేసి ఎలాగోలా చేయించాను. ఎందుకు అలా చేయించానా? అని ఆ తర్వాత చాలా బాధపడ్డాను. ఎందుకంటే తన యాక్టర్‌గా చాలా బిజీ అయిపోయాడు. ‘ఈ నగరానికి ఏమైంది 2’ స్టార్ట్ చేస్తారా? లేదా? అనే టెన్షన్ వచ్చింది. కానీ, అజయ్ భూపతి సినిమాలో తను ఐటెం సాంగ్‌లో కనిపించినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. మనం పెట్టిన రాకెట్ అటు, ఇటు తిరిగి లుంగీలోకి పోయిందనేలా మారిపోయాడు.
Also Read- Barabar Premistha: ‘మళ్లీ మళ్లీ’.. ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి మాంచి రొమాంటిక్ ట్రాక్ వదిలారు
ఈ వేడుకకు గెస్ట్‌గా రాలేదు
జోక్స్ పక్కన పెడితే.. తరుణ్ నాకు ఫ్యామిలీ కంటే ఎక్కువ. నార్మల్‌గా మనం తెలిసిన వాళ్ల కోసం స్టాండ్ తీసుకుంటాం. పరిచయం ఉన్నవాళ్ల కోసం ఎవరైనా నిలబడతారు. కానీ, నేను పరిచయం లేని రోజుల్లో, నాకు చాలా క్లిష్టమైన సమయంలో నా కోసం తరుణ్ చాలా బలంగా నిలబడ్డాడు. నా కోసమే కాదు, అతనికి తెలిసిన వారెవరైనా అలాగే నిలబడతాడు. మోస్ట్ హానెస్ట్ పర్సన్ తను. సినిమా పర్సన్ అని, నాకు అవకాశం ఇచ్చాడు అని కాదు కానీ, నిజంగా మానవత్వం ఉన్న మనిషి తను. నా బ్లడ్ బ్రదర్. నేను ఈ వేడుకకు గెస్ట్‌గా రాలేదు. ఇది నాకు హోం ఫంక్షన్. ఆల్ ది బెస్ట్ తరుణ్. ఈషా ఇది నీ సినిమా.. ఎందుకంటే ఈ సినిమా కథ నాకు తెలుసు. ఈషా క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. నిర్మాత సృజన్‌కి మంచిగా డబ్బులు రావాలి. ఇందులో వచ్చిన డబ్బులు ఇప్పుడు మేము చేస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’కి ఎక్కువగా పెట్టాలని కోరుకుంటున్నాను. అందరు ఈ సినిమాని థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు టీమ్’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

