Barabar Premistha: యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ (Chandrahass) హీరోగా నటిస్తున్న నూతన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’ (Barabar Premistha). సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఏవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవిఆర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అర్జున్ మహీ (‘ఇష్టంగా’ మూవీ ఫేమ్) విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా యూత్‌ను ఆకర్షించడంతో పాటు, సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమైన ఈ మూవీ ప్రమోషన్స్‌లో మేకర్స్ జోరు పెంచారు. ఈ క్రమంలో తాజాగా ‘మళ్లీ మళ్లీ’ అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు.
Also Read- Akira Nandan: అకీరా నందన్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పు.. వారికి నోటీసులు!
రొమాంటిక్ మెలోడియస్ సాంగ్
ఈ పాటను ‘ప్రేమించుకుందాం రా’, ‘శంకర్ దాదా MBBS’, ‘తీన్‌మార్’ చిత్రాల దర్శకుడు జయంత్ సి పరాన్జీ (Jayanth C. Paranjee) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ రొమాంటిక్ మెలోడియస్ పాటలో చంద్రహాస్, మేఘన కెమిస్ట్రీ హైలెట్‌గా ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. పాటను విడుదల చేసిన అనంతరం జయంత్ సి పరాన్జీ మాట్లాడుతూ.. ‘మళ్ళీ మళ్ళీ’ అంటూ సాగే ఈ పాట చాలా బాగుంది. ఫిబ్రవరి 6న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. అందరూ చిత్రాన్ని థియేటర్లలో చూసి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటూ.. సినిమా టీంకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని అన్నారు. ఇక ఈ పాటకు ఆర్ఆర్ ధ్రువన్ ఇచ్చిన బాణీ ఎంతో శ్రావ్యంగా ఉండగా, ఈ పాటకు సాహిత్యం కూడా ఆయనే అందించడం విశేషం. మహమ్మద్ ఇర్ఫాన్ గాత్రంలో ఈ పాట ఎంతో వినసొంపుగా ఉంది. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Also Read- Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ క్రేజీ అప్డేట్.. ఇక ఫ్యాన్స్‌కి పండగే!
ప్రేయసికి డెడికేట్ చేసేలా
‘‘నీ వాలు చూపుల్లో నను బంధించినావే ఓ చెలి..
నీ కన్నా అందంగా ఇంకెవరూ కనిపించట్లే మరి..
నీ మైకంలోనే ఇంకా ఎన్నాళ్లైనా ఉంటే చాలు అనిపిస్తూ ఉందే..
నా లోకం నీతో నిండి పోయేలాగ నన్నుళ్లుకున్నావులే..
నే మళ్లీ మళ్లీ నీ కౌగిళ్లోనే వాలిపోవాలి
ఇక తుళ్లీ తుళ్లీ ఆ తీరాలన్ని చేరుకోవాలి’’.. అంటూ ఒక ప్రేమికుడు తను ఎంతగానో ప్రేమించే ప్రేయసి కోసం డెడికేట్ చేసేలా ఈ పాట ఉంది. లిరిక్స్, మ్యూజిక్స్ అన్నీ కూడా చాలా ఎంతో హాయిగా ఉంటూ, పాటను ఆస్వాదించేలా చేస్తున్నాయి. ఈ చిత్రానికి వైఆర్ శేఖర్ కెమెరామెన్‌గా, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

