Karnataka CM change: సిద్ధరామయ్య, డీకేలకు హైకమాండ్ ఆదేశం
Karnatana-Politics (Image source X)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Karnataka CM Change: కాంగ్రెస్ హైకమాండ్ కీలక ఆదేశాలు.. రేపు సీఎం సిద్ధూ, డీకే భేటీ.. ఏం జరగబోతోంది?

Karnataka CM Change: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు విషయమై సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) మధ్య జరుగుతున్న ‘పవర్ పాలిటిక్స్’ (Karnataka CM Change) వ్యవహారంలో శుక్రవారం పొద్దుపోయాక అత్యంత ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ (Congress Party) హైకమాండ్ నుంచి తనకు కీలక సందేశం వచ్చిందని సిద్ధ రామయ్య చెప్పారు. ప్రతిష్టంభనకు ముగింపు పలికే మార్గాలను అన్వేషించే లక్ష్యంతో, రేపు ఉదయం (శనివారం) టిఫిన్ సమయంలో కలిసి కూర్చుని, చర్చించాలంటూ తనను, శివకుమార్‌ను హైకమాండ్ కోరిందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన కావేరీలో ఉదయం 9.30 గంటలకు తామిద్దరం సమావేశం అవుతామని తెలిపారు. అయితే, రేపటి సమావేశం కేవలం అల్పాహారం మాత్రమేనని, హైకమాండ్ ఏది నిర్ణయిస్తే తాను దానికి కట్టుబడి ఉంటానని సిద్ధరామయ్య వ్యూహాత్మక వ్యాఖ్యలు చేశారు.

ఇరువురి మధ్య అంతర్గత విభేదాలపై వస్తున్న ఊహాగానాలను సిద్దరామయ్య కొట్టిపారేశారు. పార్టీ అగ్ర నాయకత్వం ఏది నిర్ణయించినా దాన్ని తాను పాటిస్తానని చెప్పారు. మీడియాతో మాట్లాడూతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, మీడియాకు ఈ వివరణ ఇవ్వడానికి కొన్ని గంటల ముందు కూడా శుక్రవారం ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఐక్యతను చాటుతూ ఇద్దరూ ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, డీకే శివకుమార్ మాట్లాడుతూ, 2004 లోక్‌సభ ఎన్నికల్లో విజయం తర్వాత సోనియా గాంధీ త్యాగం చేశారంటూ కొనియాడారు. ప్రధానమంత్రి పదవిని తాను చేపట్టే అవకాశం వచ్చినా, మన్మోహన్ సింగ్‌కు అవకాశం కల్పించారని ప్రస్తావించారు. సిద్దరామయ్య సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడంతో పరోక్ష విమర్శ చేసినట్టుగా అనిపించింది.

Read Also- DK Shivakumar: సోనియానే అధికారాన్ని త్యజించారు.. సీఎం సిద్ధూ సమక్షంలోనే డీకే అసంతృప్తి.. ముదిరిన పోరు

మంత్రుల భిన్నాభిప్రాయాలు

సీఎం, డిప్యూటీ సీఎం మధ్య ఆధిపత్య పోరు జరుగుతూ గందరగోళ పరిస్థితులు నెలకొన్న వేళ కర్ణాటక హోంమంత్రి జీ. పరమేశ్వర ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ కోరుకుంటే డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా తాను సమర్థిస్తానని బహిరంగంగా అన్నారు. ఆయన మాట్లాడిన నిమిషాలకే సిద్దరామయ్యకు విధేయుడుగా పేరు జమీర్ అహ్మద్ ఖాన్ ఈ వ్యాఖ్యలను ఖండించారు. సిద్దరామయ్యే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అన్నారు. నాయకత్వ సమస్యపై బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దంటూ కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినా నేతలు ఎక్కడా తగ్గడం లేదు.

కాగా, సీఎం సిద్దరామయ్యకు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలు, ఓబీసీ ఓటర్లలో ఒక ప్రధాన వర్గంలో చక్కగ ఆదరణ ఉందని, మాస్ లీడర్‌గా పేరున్న వ్యక్తి అని కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఆలోచిస్తోందని తెలుస్తోంది. మరోవైపు, డీకే. శివకుమార్ బలాలు, ఆయన సంస్థాగత సామర్థ్యాలు, ఎన్నికల నిర్వహణ నైపుణ్యాలు రాబోయే ఎన్నికల్లో పార్టీకి బాగా ఉపయోగపడతాయనే ఆలోచన కూడా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే హైకమాండ్ ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో కనిపిస్తోంది.

Read Also- Harish Rao on Cong Govt: గ్రామాల్లో కాంగ్రెస్‌ను నిలదీయండి.. ఆరు గ్యారంటీలపై ప్రశ్నించండి.. హరీశ్ రావు

Just In

01

Substandard Bridge: నాసిరకం బ్రిడ్జిను నిర్మిస్తున్న కాంట్రాక్టర్.. ఫొటోతో బయటపడ్డ బండారం.. ఫొటో ఇదిగో

Political News: ఇవి బురద రాజకీయాలు.. వైసీపీ, బీఆర్ఎస్‌లపై టీడీపీ ఎంపీ ఫైర్

Cheen Tapak Dum Dum: సమంత క్లాప్‌తో మొదలైన ‘చీన్ టపాక్‌ డుం డుం’.. వివరాలివే!

BRS Complaint on CM: సీఎంపై చర్యలు తీసుకోండి.. డీజీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఫిర్యాదు

Anaganaga Oka Raju: సెంచరీ కొట్టేసిన రాజుగారు.. నిర్మాత పంట పండిందిపో!